ఉత్తర ప్రదేశ్‌లో మంగళవారం సాయంత్రం ఘోర ప్రమాదం సంభవించింది. వారణాసిలోని కాంట్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది దుర్మరణం పాలయ్యారు. చాలా మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది కూలీలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.