
ప్రతీకాత్మక చిత్రం
భోగాపురం : విజయనగరం జిల్లాలో మంగళవారం పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఒకే రోజు పిడుగులు పడి వేర్వేరు చోట్ల నలుగురు మృతిచెందారు. మరొకరికి గాయాలు అయ్యాయి. భోగాపురం మండలం రాజుపులోవలో పిడుగు పడి దుక్క రాములమ్మ, ఆమె మనవరాలు శ్రావణి మృతిచెందారు. పూసపాటిరేగ మండలం రెళ్లివలసలో పొలాల్లో పశువులు కాస్తోన్న రౌతు గౌరునాయుడనే యువకుడు పిడుగుపాటుకు మృతిచెందాడు. తెర్లాం మండలం సుందరాడలో పొలంలో పనిచేస్తోన్న ఆదినారాయణ అనే యువకుడు కూడా పిడుగుపాటుకు బలయ్యాడు. నందబలగలో మరో వ్యక్తి పిడుగుపాటుకు తీవ్రగాయాలపాలయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment