four people died
-
Facebook Live: పోనీయ్.. 300 కి.మీ.లు దాటాలి
లక్నో: బీఎండబ్ల్యూ కారు.. మెరుపు వేగం.. నిర్లక్ష్యపు డ్రైవింగ్.. ఫేస్బుక్ లైవ్‌లో అత్యుత్సాహం.. ఇవన్నీ కలిసి నలుగురి ప్రాణాలను అనంత వాయువుల్లో కలిపేశాయి. 230 కిలోమీటర్ల వేగంతో కారును నడుపుతూ నలుగురు యువకులు ప్రాణాలు బలిచేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై శుక్రవారం సుల్తాన్పూర్ వద్ద జరిగింది. ఈ ప్రమాదం తాలూకు వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆనంద్ ప్రకాశ్(35), అఖిలేశ్ సింగ్(35), దీపక్ కుమార్(37), మరో వ్యక్తి బీఎండబ్ల్యూ కారులో ఎక్స్‌ప్రెస్ హైవేపై అత్యంత వేగంతో దూసుకెళ్తున్నారు. దీంతో అందులోని వ్యక్తి.. ‘ స్పీడ్ మరింత పెంచు. స్పీడ్ 300 కి.మీ.లు దాటాలి. మనం ఫేస్బుక్ లైవ్‌లో ఉన్నాం’ అని డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తితో అన్నాడు. అప్పటికే ఆ వేగంతో భయపడిన కారులోని వ్యక్తి.. ‘మనం నలుగురం చస్తాం. నెమ్మదిగా పోనీయ్’ అని అరిచాడు. దీంతో డ్రైవర్.. భయపడే వ్యక్తిని వారిస్తూ ‘ అరవకు. నేను అంతటి వేగంతో నడిపి చూపిస్తా’ అని కోప్పడ్డాడు. ఈ వాగ్వాదం నడుమే కారు 230 కి.మీ.ల వేగంలో ప్రయాణిస్తూ ఎదురుగా వస్తున్న ట్రక్‌ను ఢీకొట్టింది. కారు టాప్, ముందుభాగం పగిలిపోయి కారులోని నలుగురూ ఛిద్రమై దూరంగా పడిపోయాడు. అక్కడిక్కడే మరణించారు. -
చెరువులోకి దూసుకెళ్లిన కారు
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని యర్రబాలెం వద్ద నలుగురు స్నేహితులు ప్రయాణిస్తున్న కారు సోమవారం రాత్రి అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులూ జలసమాధి అయ్యారు. వీరంతా మంగళగిరి ప్రాంతానికి చెందిన వారే. వడ్రంగి పనిచేసే వాకా శ్రీనివాసరావు (34), డాక్యుమెంట్ రైటర్ తేజ్‌రాంజీ (25), ఇతని అసిస్టెంట్ కొల్లూరు సాయి (25), ఏసీ మెకానిక్ పవన్‌కుమార్ (26) స్నేహితులు. వీరు కారులో తుళ్లూరు వెళ్లి వస్తుండగా యర్రబాలెం యర్రచెరువు వద్దకు రాగానే కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిపోయింది. కారు అద్దాలు తెరిచి ఉండడంతో నీళ్లు ప్రవేశించి నలుగురు జలసమాధి అయ్యారు. తుళ్లూరు నుంచి వాహనాలపై వస్తున్న వారు ఈ విషయాన్ని గమనించి ఆ మార్గంలో వస్తున్న లారీని ఆపి తాడు సహాయంతో కారును బయటకు తీశారు. 108 సిబ్బంది ఆ నలుగురిని పరిశీలించి మృతిచెందినట్లు నిర్ధారించారు. ఐదు నిమిషాల్లో ఇంటికి వస్తానంటూ.. రాంజీ తన భార్య మహేశ్వరికి ఫోన్‌చేసి 5 నిమిషాల్లో ఇంటికి వస్తానని చెప్పిన కొద్దిసేపటికే వీరంతా విగతజీవులుగా మారారు. భర్త ఎంతసేపటికీ రాకపోవడంతో మహేశ్వరి మరోసారి రాంజీకి ఫోన్‌చేయగా ప్రమాద స్థలి వద్ద ఉన్నవారు ఫోన్ ఎత్తి రాంజీ చనిపోయాడని చెప్పడంతో ఆమె కుప్పకూలిపోయినట్లు బంధువులు తెలిపారు. రెండేళ్ల క్రితం ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మహేశ్వరిని రాంజీ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ 5 నెలల కుమారుడు ఉన్నాడు. అలాగే, వాకా శ్రీనుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి మంగళగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
చెరువులో మునిగి నలుగురు హైదరాబాద్ యువకులు మృతి
బెంగళూరు: బీదర్ జిల్లా గోడివాడ దర్గా సమీపంలో ఉన్న చెరువులో హైదరాబాద్‌కు చెందిన నలుగురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. సలీంబాబా నగర్ బస్తీకి చెందిన జునైద్‌ఖాన్ (21), అతని సోదరుడు ఫహాద్‌ఖాన్(16), ఆదే ప్రాంతానికి చెందిన సయ్యద్ జునైద్(16), కిషన్‌బాగ్ ప్రాంతానికి చెందిన హైదర్‌ఖాన్ (16)లు ఆదివారం గోడివాడి దర్గాకు కారులో బయలుదేరారు. 11 గంటల ప్రాంతంలో గోడివాడకు దర్గా వద్దకు చేరుకున్నారు. పక్కనే ఉన్న చెరువులో స్నానం చేసేందుకు వెళ్లారు. ముందుగా హైదర్ వెళ్లగా అతను నీటిలో మునిగిపోతుండటాన్ని మిగతా ముగ్గురూ గమనించారు. చదవండి: Mumbai Cruise Rave Party: ఎవరీ సమీర్ వాంఖెడే..? అతన్ని కాపాడే క్రమంలో వీరు కూడా నీటిలో మునిగిపోయారు. చెరువులో నీరు ఎక్కువగా ఉండటం, వీరికి ఈత రాకపోవడంతో మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుస్తులు, గుర్తింపు కార్డుల ఆధారంగా గుర్తించారు. గజ ఈతగాళ్లతో గాలించి మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ నలుగురి మృతితో సలీంబాబా నగర్లో విషాదం నెలకొంది. కుటుంబభ్యుల రోదనలు మిన్నంటాయి. నిన్నటి వరకు కళ్లముందు తిరిగిన యువకులు ఇక లేరనే బాధను కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. చదవండి: ఫేస్బుక్ ప్రేమ.. యువకుడి చేతిలో మోసపోయి -
మిస్టరీగానే తెలుగు కుటుంబ మరణాలు
చీరాల/ వాషింగ్టన్: అమెరికాలో శనివారం ఉదయం అనుమానాస్పదరీతిలో మృతి చెందిన నలుగురు తెలుగు వ్యక్తుల (ఒకే కుటుంబం) మరణాలు ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. శవపరీక్ష పూర్తి అయిన తర్వాత వారి మరణానికి గల పూర్తి వివరాలు తెలియవచ్చే అవకాశం ఉందని సోమవారం అమెరికా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని వారు తెలిపారు. అమెరికాలోని తెలుగు వారికి ఎలాంటి ఆందోళన అక్కర్లేదన్నారు. అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో వెస్ట్‌డెస్ మోయిన్స్‌లో యాష్‌వర్త్ రోడ్డు– అస్పెన్ డ్రైవ్‌ల మధ్య ఉన్న 65వ స్ట్రీట్‌లో నివాసం ఉంటున్న సుంకర చంద్రశేఖరరెడ్డి (44), ఆయన భార్య లావణ్య (41), కుమారులు ప్రభాస్ (15), సుహాన్ (10)లు శనివారం తుపాకీ తూటాల గాయాలతో అనుమానాస్పదరీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు.. ప్రకాశం, గుంటూరు జిల్లావాసులు ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట పంచాయితీకి చెందిన సీతారామిరెడ్డి తన పెద్ద కుమార్తె లావణ్యను గుంటూరు జిల్లా వింజనంపాడుకు చెందిన సుంకర చంద్రశేఖరరెడ్డికి ఇచ్చి 2003లో చీరాలలో వివాహం చేశారు. చంద్రశేఖరరెడ్డి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, లావణ్య కూడా అమెరికన్ గవర్నమెంట్లో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. గత మే 29న వారు ఓ ఇంటిని కొనుగోలు చేయగా చంద్రశేఖరరెడ్డి అత్తమామలైన సీతారామిరెడ్డి, హైమావతిలు గృహప్రవేశం నిమిత్తం అమెరికా వెళ్లారు. శనివారం ఇంట్లో తుపాకీ పేలిన శబ్ధం రావడంతో కింద పోర్షన్లో ఉంటున్న లావణ్య చెల్లెలు పిల్లలు ఇద్దరు పైకి వెళ్లి చూశారు. రక్తపుమడుగుల్లో పడి ఉన్న నలుగురిని చూసి బయటకు వచ్చి స్థానికుల సహాయం కోరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు, స్థానికులు అక్కడకు చేరుకునే సరికి రక్తపుమడుగులో నలుగురు విగతజీవులుగా పడి ఉన్నారు. తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతి చెందిన ఇద్దరు పిల్లలు ప్రభాస్, సుహాన్ చదువులోగాని, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో చాలా చురుకుగా ఉండేవారని చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబంతో అమెరికాలో పదేళ్లుగా పరిచయం ఉన్న శ్రీకర్ సోమయాజులు తెలిపారు. -
రహదారి రక్తసిక్తం
కల్హేర్(నారాయణఖేడ్): సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల పరిధిలోని జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. శనివారం ఉదయం బాచేపల్లి చందర్‌నాయక్ గేట్ సమీపంలో సంగారెడ్డి–నాందేడ్ జాతీయ రహదారిపై లారీ, తుఫాన్ వాహనం ఢీకొన్నాయి. మహారాష్ట్రలోని దెగ్లూర్‌కు చెందిన ఒకే కుటుంబానికి సంబంధించిన 14 మంది హైదరాబాద్‌లో బంధువుల పెళ్లికి హాజరయ్యేందుకు తుఫాన్ వాహనంలో బయలు దేరారు. వీరి వాహనం మార్గమధ్యలో చందర్‌నాయక్ తండా గేట్ వద్దకు రాగానే నిజాంపేట వైపు నుంచి వస్తున్న లారీ ఎదురుగా వచ్చి ఢీకొంది. దీంతో తుఫాన్ వాహనం డ్రైవర్ షేక్ మన్నాన్(35), శిరిసింబే శివానీ(20)లు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ మన్నాన్ స్టీరింగ్ మధ్యలో ఇరుక్కుపోగా స్థానికులు, పోలీసులు వచ్చి బయటికి తీశారు. అప్పటికే ఆయన మృతిచెందాడు. క్షతగాత్రుల్లో రజని(60), చిప్తి అనే 7 నెలల చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో తుదిశ్వాస విడిచారు. మిగతావారిలో అర్చన, సంధ్య, మహదేవి, ప్రథమేశ్, ప్రగతి, లత, స్వాతి, అశోక్‌తోపాటు మొత్తం 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరి ల్లింది. రోడ్డంతా రక్తసిక్తమై భయానకంగా మారింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని నారాయణఖేడ్ డీఎస్పీ సత్యనారాయణరాజు, కంగ్టి సీఐ తిరుపతియాదవ్ సందర్శించారు. కల్హేర్ ఎస్ఐ ఎం.స్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
కాటేసిన కరెంట్
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యుదాఘాతంతో శుక్రవారం నలుగురు మృతి చెందారు. కమలాపూర్ మండలం దేశరాజుపల్లిలో ఉతికిన బట్టలు ఆరేస్తుండగా మహిళ, కేసముద్రం మండలం ధన్నసరిలో లారీ క్యాబిన్‌కు విద్యుత్ తీగలు తగిలి లారీ డ్రైవర్, రాయపర్తి మండలం తిర్మలాయపల్లిలో ఫెన్సింగ్ తీగలకు కరెంట్ పాసై ఓ రైతుతో పాటు పాలేరు మృతి చెందారు. కరెంట్‌షాక్‌తో మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. కమలాపూర్(హుజూరాబాద్): ఉతికిన బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఇమ్మడి మానస (22) అనే వివాహిత మృతి చెందిన ఘటన కమలాపూర్ మండలంలోని దేశరాజుపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, బంధువుల కథనం ప్రకారం.. దేశరాజుపల్లికి చెందిన రొంటాల రమేష్, శారద దంపతుల చిన్న కూతురు మానస. సుమారు ఏడాదిన్నర క్రితం ధర్మసాగర్ మండలం రాపాకపల్లికి చెందిన ఇమ్మడి ప్రదీప్‌తో మానస వివాహం జరిగింది. వీరికి ఐదు నెలల బాబు ఉన్నాడు. నాలుగు రోజుల క్రితం మానస దేశరాజుపల్లిలోని తల్లిగారింటికి వచ్చింది. ఇటీవల ప్రసవించిన తమ పెద్ద కూతురు వద్దకు శారద వెళ్లగా శుక్రవారం రమేష్ వ్యవసాయ కూలీ పనులకు వెళ్లాడు. ఈ క్రమంలోనే ఇంటి వద్ద ఉన్న మానస బట్టలు ఉతికి ఇంటిముందు ఉన్న ఇనుప తీగపై ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు ఆ ఇనుప తీగకు విద్యుత్ సరఫరా అయి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి భర్త, ఐదు నెలల బాబు ఉన్నారు. మానస మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. విద్యుదాఘాతం రూపంలో తల్లిని కోల్పోయిన ఐదు నెలల బాబును చూసి అయ్యో బిడ్డా.. అంటూ ప్రతి ఒక్కరు కంట తడి పెట్టారు. మానస మృతితో దేశరాజుపల్లి, రాపాకపల్లి గ్రామాల్లో విషాదం చోటు చేసుకుంది. ధన్నసరిలో లారీ డ్రైవర్.. కేసముద్రం: యూరియాలోడు లారీకి విద్యుత్ తీగలు తాకడంతో విద్యుతాఘాతానికి గురైన ఓ లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన మండలంలోని ధన్నసరి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై సతీష్ తెలిపిన ప్రకారం.. ఖిలావరంగల్ మండలం కరీమాబాద్‌కు చెందిన సిరికొండ సారంగపాణి(52) అనే సీనియర్ డ్రైవర్ కేసముద్రం మండలంలోని ధన్నసరి పీఏసీఎస్‌కు మార్క్‌ఫెడ్ సంస్థ కెటాయించిన యూరియా బస్తాలను వరంగల్ ఎన్డీఆర్ గోదాం నుంచి లారీలో కేసముద్రంకు తీసుకువచ్చాడు. ఈ మేరకు ధన్నసరి గ్రామంలో గల గోడౌన్లో బస్తాలను దించేందుకు ఇక్కడి సిబ్బంది ఆ లారీని ధన్నసరికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో గోడౌన్ వద్ద లారీని వెనక్కి తిప్పే క్రమంలో విద్యుత్ తీగలు లారీ క్యాబిన్‌కు తాకాయి. ఈ క్రమంలో లారీడ్రైవింగ్ చేస్తున్న సారంగపాణి హడావుడిగా కిందకు దిగుతూ నేలపై కాలు పెట్టడంతో విద్యుతఘాతానికి(ఎర్త్ కావడంతో) గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య వినోద, కూతురు సంధ్య ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు. ఫెన్సింగ్ తీగలు తాకి ఇద్దరు.. రాయపర్తి : ఫెన్సింగ్ తీగలు తాకి ఓ రైతుతో పాటు పాలేరు మృతి చెందిన సంఘటన శుక్రవారం రాయపర్తి మండలంలోని తిర్మలాయపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం... అర్బన్ జిల్లాకు చెందిన నూకరాజు పాపరాజు తిర్మలాయపల్లిలో ఏడున్నర ఎకరాల మామిడితోటను కొనుగోలు చేసి సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది గ్రామానికి చెందిన శీల మధుసూదన్‌రెడ్డి మామిడితోటను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి మామిడితోటలోని బోరుకు కరెంట్ తీగలను ఫెన్సింగ్ తీగలకు తాకుతూ అమర్చారు. గాలికి అటూఇటూ తాకుతూ రాపిడై తీగలకు కరెంట్ పాసైంది. ప్రతి రోజు తాగునీటి కోసం పక్కనే తనకున్న నాలుగు ఎకరాల్లో పత్తిని సాగు చేస్తున్న జినుగు వెంకట్‌రెడ్డి (46) మామిడితోటలోకి నీళ్లు తెచ్చుకోవడం కోసం భార్య మంజులతో చెప్పి ఫెన్సింగ్ తీగలను దాటే క్రమంలో కరెంట్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదిలా ఉండగా శీల మధుసూదన్‌రెడ్డికి పాలేరుగా పనిచేసే వశపాక కొంరయ్య(45) పరుగున వచ్చి ఫెన్సింగ్‌ను దాటుకొని వద్దామని ప్రయత్నించగా వాటికి అంటుకొని అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఒక్కసారిగా ఇద్దరు ప్రాణాలు బలిగొన్నట్లు తెలుసుకున్న గ్రామస్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఒక్కసారిగా ఇద్దరి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మామిడితోట యజమాని నూకరాజు పాపరాజు, కౌలురైతు శీల మధుసూదన్‌రెడ్డి నిర్లక్ష్యం వల్లే తన భర్తతో పాటు కొంరయ్య మృతి చెందారని మృతుడు వెంకటర్‌రెడ్డి భార్య ఆరోపించారు. మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. సంఘటన స్థలానికి వర్ధన్నపేట సీఐ వేణుచందర్, ఎస్సై ఉపేందర్‌రావులు చేరుకుని పరిశీలించారు. -
విజయనగరం జిల్లాలో పిడుగుల బీభత్సం
భోగాపురం : విజయనగరం జిల్లాలో మంగళవారం పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఒకే రోజు పిడుగులు పడి వేర్వేరు చోట్ల నలుగురు మృతిచెందారు. మరొకరికి గాయాలు అయ్యాయి. భోగాపురం మండలం రాజుపులోవలో పిడుగు పడి దుక్క రాములమ్మ, ఆమె మనవరాలు శ్రావణి మృతిచెందారు. పూసపాటిరేగ మండలం రెళ్లివలసలో పొలాల్లో పశువులు కాస్తోన్న రౌతు గౌరునాయుడనే యువకుడు పిడుగుపాటుకు మృతిచెందాడు. తెర్లాం మండలం సుందరాడలో పొలంలో పనిచేస్తోన్న ఆదినారాయణ అనే యువకుడు కూడా పిడుగుపాటుకు బలయ్యాడు. నందబలగలో మరో వ్యక్తి పిడుగుపాటుకు తీవ్రగాయాలపాలయ్యాడు. -
నలుగుర్ని మింగిన మ్యాన్‌హోల్
► డ్రైనేజీ పనులు చేస్తూ ముగ్గురు, ► కాపాడబోయి మరొకరు మృతి ► జలమండలి, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో బలి ► మృతుల కుటుంబాలకు రూ.2.5 లక్షల చొప్పున నష్టపరిహారం సాక్షి, హైదరాబాద్: మృత్యు కుహరాల్లా మారిన మ్యాన్‌హోల్‌లు నలుగురిని మింగేశాయి. జలమండలి అధికారులు, పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. రెక్కాడితేగాని డొక్కాడని ముగ్గురు కార్మికులతోపాటు వారిని కాపాడబోయిన మరో వ్యక్తి మృత్యువాత పడ్డారు. మాదాపూర్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ఒకరి వెనుక ఒకరు.. జీఎస్కే-విశ్వ ఇన్ఫ్రా కంపెనీకి చెందిన కాంట్రాక్టర్ శనివారం మాదాపూర్ ప్రాంతంలో డ్రైనేజీ పనులు చేసేందుకు మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన ఆరుగురు కార్మికులను తీసుకువచ్చాడు. ఉదయం నుంచి పలు చోట్ల డ్రైనేజీ పూడికతీశారు. సాయంత్రం పనులు ముగిసే సమయంలో అక్కడే ఉన్న ఓ మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసేందుకు.. అందులోకి దిగారు. తొలుత ఓ.నాగేశ్ (32), పి.సత్యనారాయణ (38) లోపలికి దిగారు. అయితే లోపలి నుంచి ఎలాంటి అలికిడి రాకపోవడంతో మేస్త్రీ పి.శ్రీనివాస్ (38) కూడా మ్యాన్హోల్లోకి వెళ్లాడు. ఆ ముగ్గురిలో ఎవరూ పైకి తిరిగి రాకపోవడంతో.. పైన ఉన్న మిగతా కార్మికులు అటువైపు వెళుతున్నవారికి విషయం చెప్పారు. వారిలో కొందరు 108కు సమాచారం ఇచ్చారు. అయితే బైక్‌పై ఆ దారిలో వెళుతున్న గంగాధర్ (35) అనే వ్యక్తి విషయం తెలుసుకుని తాడు సహాయంతో మ్యాన్హోల్లోకి దిగాడు. కానీ ఆయన కూడా పైకి రాలేదు. కొద్దిసేపటికి 108 అంబులెన్స్ రాగా.. దాని డ్రైవర్ చంద్రశేఖరాచారి తాడు సహాయంతో లోపలికి దిగాడు. ఆయనా అందులోనే పడిపోయాడు. కొద్దిసేపటికే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. జేసీబీలతో మ్యాన్‌హోల్ పైభాగాన్ని పగలగొట్టి, మాస్కులతో లోపలికి దిగి.. అందరినీ పైకి తీశారు. అయితే అప్పటికే నాగేశ్, పి.సత్యనారాయణ, పి.శ్రీనివాస్, గంగాధర్ మరణించారు. అపస్మారక స్థితిలో ఉన్న 108 డ్రైవర్ చంద్రశేఖరాచారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విష వాయువుల కారణంగానే.. వంద అడుగుల వెడల్పు రోడ్డుపై ఉన్న మ్యాన్‌హోల్ దాదాపు 20 అడుగుల లోతు ఉంది. ఉదయం నుంచి డ్రైనేజీ పనులు చేస్తున్న కార్మికులు... పైపులోని పూడికను తీసేందుకు వీలుగా మురుగునీటిని అడ్డుకునేందుకు అక్కడక్కడా బస్తాలు, సిమెంట్‌తో తాత్కాలికంగా గోడ కట్టారు. మాదాపూర్ ప్రధాన రహదారి నుంచి పనులు చేసుకుంటూ వచ్చారు. చివరగా మ్యాన్‌హోల్ వద్ద పనులు చేస్తున్నారు. ఆ సమయంలో పైపులో అడ్డుగా పెట్టిన బస్తాలు, సిమెంట్ గోడను తొలగించడంతో ఒక్కసారిగా మురుగు నీరు వచ్చింది. అప్పటికే పైప్‌లైన్‌లో నిండిపోయి ఉన్న విష వాయువులన్నీ మ్యాన్హోల్లోకి చేరి.. కార్మికులు ఊపిరాడక మృతి చెందారని భావిస్తున్నారు. కాగా ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2.5 లక్షల వంతున నష్ట పరిహారం అందజేస్తామని జలమండలి ఎండీ దానకిశోర్ ప్రకటించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి నలుగురి మరణానికి కారణమైన జీఎస్కే సంస్థపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు జల మండలి వర్గాలు తెలిపాయి. దుర్ఘటనపై విచారణకు జలమండలి ఈడీ సత్యనారాయణ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నాయి. పనిముగిశాక మళ్లీ రమ్మన్నారు ఉదయం పది గంటల నుంచి డ్రైనేజీ పనులు చేస్తున్నామని కార్మికులు కె.శ్రీనివాస్, యాదయ్య, రాములు చెప్పారు. సాయంత్రం 5 గంటలకు పని ముగించుకుని వెళ్తుండగా కాంట్రాక్టర్ నుంచి ఫోన్ రావడంతో.. సూపర్వైజర్ మళ్లీ మ్యాన్‌హోల్ వద్దకు తీసుకెళ్లాడని తెలిపారు. అదొక్కటీ శుభ్రం చేసి రమ్మంటూ లోపలికి పంపించాడన్నారు. ఆ మ్యాన్‌హోల్‌కి దిగకపోతే అందరూ బతికేవారని వాపోయారు. కాపాడబోయి.. ప్రమాదంలో మరణించిన గంగాధర్ స్వస్థలం కర్నూలు జిల్లా మద్దిగార మండలం పత్తికొండ గ్రామం. హైదరాబాద్‌లో అల్లాపూర్‌లోని వివేకానంద్‌నగర్‌లో నివాసం ఉంటూ.. ఓ ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆ దారిలో బైక్‌పై వెళుతూ ప్రమాదం విషయం తెలిసి, తాడుతో మ్యాన్హోల్లోకి దిగాడు. విష వాయువుల కారణంగా ఊపిరాడక మరణించాడు. గంగాధర్‌కు భార్య లక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బ్లాక్‌లిస్టులో పెట్టాం.. అయినా ఇటీవలే మాదాపూర్‌లోని ఓ మ్యాన్‌హోల్‌లో ఒక కార్మికుడు మృతిచెందడంతో అక్కడ పనులు చేపట్టిన జీఎస్కె-విశ్వ ఇన్ఫ్రా సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టాం. ఆ సంస్థ చేపట్టిన పనులన్నీ నిలిపివేయాలని ఉత్తర్వులిచ్చాం. అయినా ఆ కంపెనీ క్షేత్రస్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చి మిగిలిపోయిన పనులను చేపట్టినట్లు మా దృష్టికి వచ్చింది. ఇప్పడు జరిగిన దుర్ఘటనకు ఆ కంపెనీ నిర్లక్ష్యమే కారణమని భావిస్తున్నాం. నైపుణ్యం లేని కార్మికులను మ్యాన్హోల్లోకి దించినట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేస్తాం. కాంట్రాక్టు సంస్థ గుర్తింపును రద్దు చేస్తాం..’’ - దానకిశోర్, హైదరాబాద్ జల మండలి ఎండీ -
మృత్యు వాన
♦ నగరంలో వేర్వేరు చోట్ల నలుగురు బలి ♦ కాలనీలు, రహదారులు జలమయం ♦ ఉప్పొంగిన నాలాలు ♦ జనజీవనం అతలాకుతలం ♦ ఎక్కడికక్కడ స్తంభించిన ట్రాఫిక్ సాక్షి,సిటీబ్యూరో : గ్రేటర్లో ఐదు రోజులుగాకురుస్తున్న వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. ముఖ్యంగా సోమవారం రాత్రి నుంచివర్షం బీభత్సం సృష్టించింది. నాలుగు నిండు ప్రాణాలు బలైపోయాయి. ఉప్పుగూడ అరుంధతి నగర్ కాలనీలో ఉప్పొంగుతున్న నాలాలో పడి సంజయ్(7) అనే బాలుడు మృతిచెందాడు. తుకారాంగేట్ వద్ద రైల్వే వరద కాల్వలో పడి గుర్తుతెలియని వ్యక్తి(50) మృత్యువాత పడ్డాడు. విద్యుత్ తీగలు తెగిపడడంతో మియాపూర్ ఆల్విన్ కాలనీలో కె.లక్ష్మణ్ రాజు(18), సోమరాజు(12)లు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం రాత్రి 10 నుంచి మంగళవారం(14న) ఉదయం 11 గంటల వరకు నగరంలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులపై మోకాలి లోతున వరదనీరు ప్రవహించింది. మెట్రో పనులు జరుగుతున్న మలక్‌పేట్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, సికిం ద్రాబాద్, బేగంపేట తదితర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై వర్షపునీరు నిలవడంతో ట్రాఫిక్ స్తంభించింది. మరో 24 గంటల పాటు నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అంధకారం వర్షాలతో గ్రేటర్‌లోని సుమారు 200 ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. సరూర్‌నగర్, హయత్‌నగర్, శేరిలింగంపల్లి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ పరిధిలోని పలు కాలనీలు, బస్తీలకు సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. విద్యుత్ కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసినా ఫలితం కనిపించకపోవడంతో అంధకారంలోనే గడిపారు. ఇదీ పరిస్థితి... మూసాపేటలో విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. వడగండ్లతో కురిసిన వర్షంతో కూకట్పల్లి నియోజకవర్గంలో చెట్లు కూలడమే కాక రోడ్లన్నీ జలమయమయ్యాయి. మూసాపేట డివిజన్ శివశక్తినగర్‌లో వర్షానికి భారీ చెట్టు కూలి 11కేవీ విద్యుత్ వైర్లపై పడటంతో రెండు స్తంభాలు నేలకొరిగాయి. రాత్రి సమయంలో జరగడంతో ప్రమాదం తప్పింది. ♦ ఏఎస్‌రావునగర్, సైనిక్‌పురి పరిధిలోని కాలనీల్లో చెట్లు కూలి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఆరుల్కాలనీ, హస్తినాపురి, సాయిపురి, కందిగూడ, డీఎల్ఆర్ ఎన్క్లేవ్లలో చెట్లు నేలకూలాయి. ♦ యాప్రాల్ డివిజన్లోని రోడ్లు, కాలనీలు జలమయమయ్యాయి. స్థానిక బస్ షెల్టర్ కూలి ఓ ఆటో దెబ్బతింది. యాప్రాల్ నుంచి కౌకూర్ వెళ్లే రోడ్డు, తులసి గార్డెన్ రోడ్డు ఎస్ఎస్ ఎన్క్లేవ్ కాలనీల్లో వర్షం నీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు రాత్రంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జేజేనగర్, పరిసర కాలనీలలో డ్రైనేజీ లీకేజీలతో అవస్థలు పడ్డారు. ♦ శివరాంపల్లి, మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్, అత్తాపూర్ డివిజన్లలోని లోతట్టు ప్రాంతాలలో వరద నీరు ఇళ్లలోకి చేరింది. ♦ సలీంనగర్, మూసారంబాగ్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురు గాలులకు సలీంనగర్ డివిజన్ శ్రీపురం కాలనీలోని చెట్లు నేలకూలాయి. ♦ కంటోన్మెంట్ ఐదో వార్డులోని గృహలక్ష్మీ కాలనీలో సోమవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి చెట్లు విరిగి మూడు విద్యుత్ స్తంభాలపై పడడంతో అవి నేలకొరిగాయి. మంటలు వ్యాపించడంతో... విద్యుత్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ♦ నాచారం పెద్ద చెరువు ప్రాంతంలో వరద ఉద్ధృతికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ♦ పాతనగరంలోని ఛత్రినాకలో వడగళ్ల వర్షానికి ప్రజలు భయకంపితులయ్యారు. దాదాపు పది నిమిషాల పాటు పెద్ద ఎత్తున వడగళ్లు పడడంతో రేకుల గదులలో ఉన్న ప్రజలు ఆందోళనకు గురయ్యారు. నల్లవాగు నాలా ఉప్పొంగింది. ♦ మారేడ్‌పల్లి అంబేద్కర్ నగర్ రైల్ నిలయం పక్కన ఉన్న నాలా శ్లాబ్ కూలిపోయింది. బస్తీ ప్రారంభంలో ఓ కంపెనీ వారు కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి తొవ్విన పెద్ద గొయ్యిలోకి వర్షపునీరు చేరింది. ఈ గొయ్యి దాదాపు 30 అడుగుల లోతు.. 150 అడుగల పొడవు ఉంది. ఈ నీటి తాకిడికి బస్తీలోని కొన్ని ఇళ్ల గోడలు పూర్తిగా నానిపోయాయి. దీనికిఆనుకుని ఉన్న నల్లపోచమ్మ ఆలయ ప్రహరీ కూలిపోయింది. దీంతో అప్రమత్తమైన కాంప్లెక్స్ యాజమాన్యం నీటిని తోడే కార్యక్రమం మొదలు పెట్టింది. ♦ నారాయణగూడ వైఎంసీఏ చౌరస్తాలో భారీ చెట్టు కూలిపోయింది. రాత్రి కావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ♦ రాజన్నబావి నుంచి ఛత్రినాక పరిసరాలలో వరద నీరు పెద్ద ఎత్తున రోడ్లపై పారడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ♦ మలక్‌పేట్, చాదర్‌ఘాట్, నల్గొండ క్రాస్‌రోడ్డు, దిల్సుఖ్నగర్, కొత్తపేట్, సరూర్‌నగర్, లెనిన్‌నగర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ♦ పాతనగరంలోని అనేక బస్తీలలో మ్యాన్‌హోళ్లకు మూతలు లేకపోవడంతో ముందు జాగ్రత్తగా స్థానికులు డబ్బాలు, చెట్ల కొమ్మలను అందులో ఏర్పాటు చేసుకొని ప్రమాదాలు జరగకుండా చూసుకున్నారు. దుర్దానా హోటల్ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన రైల్వే ఫ్లై ఓవర్ పక్కన భారీగా వరద నీరు నిలిచిపోయింది. అందులో ద్విచక్ర వాహనాలు పెద్ద ఎత్తున మొరాయించాయి. ♦ అరుంధతి కాలనీ బ్రిడ్జి వద్ద వరద నీరు పెద్ద ఎత్తున ప్రవహించడంతో పాదచారులు బ్రిడ్జి పైనుంచి నడిచి వెళ్లాల్సి వచ్చింది. లలితాబాగ్ ప్రధాన రహదారి తవ్వేయడంతో వరద నీరు భారీగా చేరింది. భయ్యాలాల్ నగర్ బస్తీలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. ♦ నర్సాపూర్ రాష్ట్ర రహదారి గుంతలమయంగా మారింది. జీడిమెట్ల- దూలపల్లి ప్రధాన రహదారి చెరువును తలపించింది. ♦ జీడిమెట్ల బస్ డిపో సమీపంలో రోడ్డంతా ఛిద్రమైంది. గండిమైసమ్మ చౌరస్తాలో రహదారిపై భారీ గుంతలు పడ్డాయి. ♦ జాతీయ రహదారి 44 పేట్ బషీరాబాద్ వద్ద రోడ్డుకు అడ్డంగా కూలిన చెట్టును అల్వాల్ ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. -
విషాద జాతర
పండగవేళ అక్కడ విషాదం వికృత నృత్యం చేసింది... వారి సంతోషాన్ని చంపావతి నది చంపేసింది. గ్రామ దేవత జాతర కోసం వచ్చిన నలుగురిని పొట్టనపెట్టకుని కన్నవారికి కడుపు మంట మిగిల్చింది. నిమిషం ముందువరకూ ఆడు తూపాడుతూ కేరింతలు కొట్టిన ఆ యువకులు విగత జీవులుగా పడి ఉండడంతో ఊరు గొల్లుమంది. అమ్మా, పాదాలమ్మ తల్లీ నీ పండుగ కోసం... నీకు పసుపు కుంకుమలు సమర్పించేందుకు వచ్చాం తల్లీ.. నీకు కనికారం కలగలేదా..మా బిడ్డలను రక్షిం చలేకపోయావా...ఇదేనా నీవు మామీద చూపించే దయ అంటూ మృతుల తల్లిదండ్రులు, తోబుట్టువులు కటుంబ సభ్యులు నదీ తీరంలో గుండెపగిలేలా రోదిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టింది. భోగాపురం : మండలంలోని గరే నందిగాం గ్రామానికి చెందిన కొంతమంది బతుకు తెరువుకోసం కొన్నేళ్ల కిందట విశాఖ వెళ్లారు. వారిలో కొంతమంది ప్రైవేటు కంపెనీల్లో, మరికొంతమంది తాపీమేస్త్రీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరంతా విశాఖపట్నం సమీపంలోని పోతినమల్లయ్యపాలెం వద్ద లక్ష్మివానిపాలెంలో నివాసముంటునన్నారు. అయితే వారు ప్రతీ ఏటా గ్రామంలో ఉన్న పాదాలమ్మ అమ్మవారి జాతర కోసం గరే నందిగాం వచ్చి పసుపు కుంకుమలు అందిచండం ఆనవాయితీ. అమ్మవారికి ప్రధమ పూజారులుగా వారు ఉంటూ వస్తున్నారు. గ్రామస్తులు పండగ జరిపే సమయంలో అమ్మవారికి ముందుగా సమర్పించిన బలిని వారికి అందజేసి అనంతరం పండగ నిర్వహిస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. ఈ నేపథ్యంలో సోమవారం గ్రామానికి చేరుకున్న వారంతా మంగళవారం అమ్మవారికి పసుపు కుంకులు సమర్పించి మొక్కులు చెల్లించి జాతర నిర్వహించారు. అలాగే బుధవారం అమ్మవారికి బలులు సమర్పించి, మధ్యాహ్నం భోజనాలు అనంతరం తిరిగి విశాఖ వెళ్లిపోవాల్సి ఉంది. ఇంటివద్ద పెద్దలు ఆపనిలో నిమగ్నమై ఉండగా సుమారు ఉదయం 7.30 గంటల ప్రాంతంలో పోతిన వెంకట అప్పారావు, బెర్జి మహేష్ (23), గరే శివ (24), పోతిన రాము (25) కొత్తపల్లి రాజేష్ (15)లు గ్రామానికి ఆనుకుని ఉన్న చంపావతి నదిలోకి స్నానానికి వెళ్లారు. మహేష్, శివ, రాము, రాజేష్ ఒకరి తరువాత ఒకరు నదిలో స్నానానికి దిగారు. వారు దిగిన చోట బాగాలోతు ఉన్న విషయం వారికి తెలియదు. దీంతో ఒకరి వెనుక ఒకరు ఆ గుమ్మిలోకి జారిపోయారు. చివరగా ఉన్న వెంకట అప్పారావు వారిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో అతను గ్రామంలోకి పరుగెత్తి విషయాన్ని గ్రామస్తులకు తెలిపాడు. వెంటనే వారంతా నది ఒడ్డుకు చేరుకుని మృతదేహాల కోసం గాలించారు. నదీ ప్రవాహ వేగం ఎక్కువగా లేకపోవడంతో దగ్గరలోనే మృతదేహాలన్నీ లభ్యమయ్యాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున నది ఒడ్డుకు చేరుకున్నారు. మృతదేహాలను చూసిన వారి దుఃఖం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా నదీ తీరం వారి రోదనలతో నిండిపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐలు దీనబంధు, లోవరాజులు సంఘటనాస్థలం వద్దకు చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. వైఎస్ఆర్ సీపీ సిఇసి మెంబరు కాకర్లపూడి శ్రీనివాసరాజు ఫోనులో బాధిత కుటుంబాలకి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎంపీపీ కర్రోతు బంగార్రాజు, ఏఎంసీ మాజీ చైర్మన ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, మాజీ జెడ్పిటిసి భెరైడ్డి ప్రభాకరరెడ్డి, సుందర గోవిందరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు మజ్జి శ్రీనివాస్, పిళ్లా విజయకుమార్, యడ్ల ఆదిరాజు, పడాల శ్రీనువాసరావు, కందుల రఘుబాబు, గరే కాళిదాసు తదితరులు బాధితులను పరామర్శించి, అవసరమైన సహాయ సహకారాలు అందించారు. ఒకే ఇంట్లో ఇద్దరు గరే శివ, పోతిన రాము బావమరుదులు. ఏడాదిన్నర క్రితం శివ చెల్లిన పెళ్లాడిన రాముకి ఆరు నెలల పాప ఉంది. దగ్గరి బంధువులైన వీరిద్దరూ ప్లంబింగ్ పనులు చేస్తున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరిద్దరిని నది రూపంలో మత్యువు కబళించింది. వీరి మృతితో శివ తండ్రి రామచంద్రరావు, రాము తండ్రి తాత కన్నీరుమున్నీరుగా విలపించారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. వద్దంటే వెళ్లాడు.. కాటపల్లి రాజేష్ స్థానిక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అతడి తండ్రి ఇటీవల మరణించాడు. అతనికి అక్క, అన్నయ్య ఉన్నారు. తల్లి కుట్టు మెషీన్ ఆధారంగా కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. వద్దన్నా వినకుండా మంగళవారం సాయంత్రం గరే నందిగాంలో గ్రామ దేవత పండక్కి వెళ్లాడు. ఇంతలోనే ప్రమాదంలో మృతి చెందడంతో తల్లి గుండెలవిసేలా రోదించింది. వ ద్దంటే వెళ్లాడు అందనిలోకాలకు చేరుకున్నాడంటూ విలపిస్తోంది. ఒక్కగానొక్క కొడుకు దూరం విజ్జి కనకరావుకు ఒక్కగానొక్క కొడుకు మహేష్. అతడికి ఒక చెల్లి ఉంది. ఓ కాంట్రాక్టర్ వద్ద పనులు చేస్తున్నాడు. కుటుంబానికి ఆధారంగా ఉన్న అతడ్ని మత్యువు కబళించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు విలపిస్తున్నారు. తమ కుమారుడు ఇకలేడనే వార్త వారిని తీవ్ర మనోవేదనకు గురిచేసింది. చుట్టుపక్కలవారితో కలుపుగోరుగా ఉండే మహేష్ మతితో స్థానికులు విచారంలో మునిగిపోయారు.