Lightning Thunder
-
Weather Alert: ఏపీలో ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
సాక్షి, అమరావతి: ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక. తిరుపతి, చిత్తూరు,అన్నమయ్య, కర్నూలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ సోమవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. కాగా, పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని తెలిపారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు. తిరుపతి.. తిరుపతి అర్బన్, రేణిగుంట, నారాయణవనం, కేవీబీపురం, నాగులాపురం, పిచ్చాటూరు, పుత్తూరు. చిత్తూరు.. నగరి, నిండ్ర, విజయపురం అన్నమయ్య.. కురబలకోట, మదనపల్లె, బి.కొత్తకోట, గుర్రంకొండ, కలికిరి,వాయల్పాడు కర్నూలు.. చిప్పగిరి, మద్దికెర ఈస్ట్, ఆదోని, ఆస్పరి, పెద్దకడుబూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు మండలాలు, పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కూడా చదవండి: ముందే పలకరించిన నైరుతి రుతుపవనాలు.. ఇక భారీ వర్షాలే.. -
ఘోరం: సెల్ఫీల కోసం టవర్‌పై కిక్కిరిసిన జనం, పిడుగుపాటుతో..
జైపూర్: చల్లబడిన వాతావరణం.. వానలో ‘సెల్ఫీ’ అత్యుత్సాహం ప్రాణాలు తీసింది. పిడుగుపాటుతో పదహారు మంది చనిపోగా.. డజన్ల సంఖ్యలో గాయపడినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఆదివారం సాయంత్రం ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారుల చెప్తున్నారు. ఆదివారం సాయంత్రం వాన కురుస్తుండగా అమెర్ప్యాలెస్(అమర్ ప్యాలెస్)ను సందర్శిస్తున్న వాళ్లలో కొందరు ఆనందంతో క్లాక్‌టవర్‌పైకి ఎక్కారు. సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో ఒక్కసారిగా టవర్‌పై పిడుగుపడింది. ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా.. ఆ కంగారులో పక్కనున్న హిల్ ఫారెస్ట్‌లోకి కొందరు దూకేశారు. ఇప్పటిదాకా 16 మంది మృతిచెందినట్లు అధికారులు నిర్ధారించారు. మృతుల్లో ఎక్కువగా పిల్లలే ఉన్నారు. #Rajasthan | "With the help of locals, we rescued around 29 people from the Amer Fort area after lightning struck them. They were taken to the hospital. Of these, 16 people have died," Anand Srivastava, Police Commissioner, Jaipur said yesterday Visuals from the spot. pic.twitter.com/4RJLOJ661E — ANI (@ANI) July 11, 2021 కాగా, మరో 29 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకశాం ఉందని భావిస్తున్నారు. ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం ప్రకటించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
సముద్రంలో బోటుపై పిడుగు
సాక్షి, పెదవాల్తేరు (విశాఖ తూర్పు): సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటుపై పిడుగు పడింది. దీంతో ఒక మత్స్యకారుడు గల్లంతు కాగా.. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. విశాఖలోని పెదజాలారిపేటకు చెందిన అరిసిల్లి పోలిరాజు (19), పిల్లా సతీష్ (24), పిల్లా జగ్గారావు (25), వాడమొదుల లక్ష్మణ (30), తెడ్డు వెంకన్న (40), పిల్లా పరశురాం (20) ఆరుగురు మత్స్యకారులు గురువారం ఫైబర్ బోటుపై చేపల వేటకు వెళ్లారు. విశాఖ తూర్పు దిశగా 20 కిలోమీటర్ల దూరం వెళ్లేసరికి వర్షం పడింది. ఈ క్రమంలో బోటుపై పిడుగు పడడంతో పోలిరాజు సముద్రంలోకి పడిపోయాడు. మిగిలిన మత్స్యకారులు గాయపడ్డారు. మధ్యాహ్నం వీరు సురక్షితంగా ఒడ్డుకి చేరుకున్నారు. అయితే తీవ్రంగా గాయపడిన సతీష్‌ను ఏఎన్ బీచ్ ఆస్పత్రిలో చేర్పించారు. ఒక్కసారిగా మంటలు రావడంతో తమకు కళ్లు బైర్లు కమ్మి అసలు ఏం జరిగిందో తెలియలేదని ఒడ్డుకు చేరుకున్న మత్స్యకారులు ‘సాక్షి’కి తెలిపారు. గాయపడిన సతీష్‌ను మధ్యాహ్నం 3 గంటల సమయంలో బీచ్‌రోడ్డులోని ఏఎన్ బీచ్ ఆస్పత్రిలో చేర్పించారు. సతీష్‌కు భార్య పి.రాణి, దీక్షిత (4), అలేఖ్య (1) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెదజాలారిపేటలో ఎదురుచూస్తున్న మత్స్యకార మహిళలు పెదజాలారిపేటలో విషాదం ఈ దుర్ఘటనతో పెదజాలారిపేటలో విషాదం నెలకొంది. పోలిరాజు తల్లి నూకరత్నం కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. ఆమె భర్త తాతాలు 16 సంవత్సరాల క్రితం చనిపోగా, ఇద్దరు కుమారులలో ఒకడైన పోలిరాజు గల్లంతవడంతో ఆమె గుండెలవిసేలా రోదిస్తోంది. స్థానిక మత్స్యకార మహిళలు ఆమెను ఓదార్చుతున్నారు. మరోవైపు పోలిరాజు కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల పరామర్శించారు. ఆర్థికసాయం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మత్స్యకారుడు సతీశ్ -
విజయనగరం జిల్లాలో పిడుగుల బీభత్సం
భోగాపురం : విజయనగరం జిల్లాలో మంగళవారం పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఒకే రోజు పిడుగులు పడి వేర్వేరు చోట్ల నలుగురు మృతిచెందారు. మరొకరికి గాయాలు అయ్యాయి. భోగాపురం మండలం రాజుపులోవలో పిడుగు పడి దుక్క రాములమ్మ, ఆమె మనవరాలు శ్రావణి మృతిచెందారు. పూసపాటిరేగ మండలం రెళ్లివలసలో పొలాల్లో పశువులు కాస్తోన్న రౌతు గౌరునాయుడనే యువకుడు పిడుగుపాటుకు మృతిచెందాడు. తెర్లాం మండలం సుందరాడలో పొలంలో పనిచేస్తోన్న ఆదినారాయణ అనే యువకుడు కూడా పిడుగుపాటుకు బలయ్యాడు. నందబలగలో మరో వ్యక్తి పిడుగుపాటుకు తీవ్రగాయాలపాలయ్యాడు. -
నదిలో పిడుగుపాటు: జాలరి మృతి
గుంటూరు: గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజామున పిడుగులు పడ్డాయి. తాడేపల్లి మండలం సీతానగరం సమీపంలోని కృష్ణానదిలో పిడుగు పడింది. ఈ ఘటనలో నదిలో చేపల పడుతున్న జాలరి మరదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే నాదెండ్ల మండలం అప్పాపురంలో పొలాల్లో కూడా పిడుగులు పడ్డాయి. దీంతో 7 ఏకరాల్లోని గడ్డివాము కూడా దగ్ధమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని పలు పట్టణాల్లో గత అర్థరాత్రి నుంచి ఎడతేరపి లేకుండా వర్షం కురుస్తుంది. నెల్లూరు నగరం, కావలి, గూడూరు పట్టణాల్లోని పలు ప్రాంతాలు జలమయమైనాయి. దాంతో పట్టణవాసులు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే ప్రకాశం జిల్లాలో వివిధ ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అద్దంకి, కోరసిపాడు, బల్లికురవ, టంగుటూరు, సంతమాగులూరు మండలాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. దాంతో ఆయా మండలాల్లోని పలు ప్రాంతాలు జలమయమైనాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు