గుంటూరు: గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజామున పిడుగులు పడ్డాయి. తాడేపల్లి మండలం సీతానగరం సమీపంలోని కృష్ణానదిలో పిడుగు పడింది. ఈ ఘటనలో నదిలో చేపల పడుతున్న జాలరి మరదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే నాదెండ్ల మండలం అప్పాపురంలో పొలాల్లో కూడా పిడుగులు పడ్డాయి. దీంతో 7 ఏకరాల్లోని గడ్డివాము కూడా దగ్ధమైంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని పలు పట్టణాల్లో గత అర్థరాత్రి నుంచి ఎడతేరపి లేకుండా వర్షం కురుస్తుంది. నెల్లూరు నగరం, కావలి, గూడూరు పట్టణాల్లోని పలు ప్రాంతాలు జలమయమైనాయి. దాంతో పట్టణవాసులు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే ప్రకాశం జిల్లాలో వివిధ ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అద్దంకి, కోరసిపాడు, బల్లికురవ, టంగుటూరు, సంతమాగులూరు మండలాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. దాంతో ఆయా మండలాల్లోని పలు ప్రాంతాలు జలమయమైనాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు