
విద్యార్థుల కిడ్నాప్ కు విఫలయత్నం
విజయనగరం : విజయనగరం జిల్లాలోని భోగాపురంలో ఇద్దరు విద్యార్థులను కిడ్నాప్ చేసేందుకు ఆగంతకులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. స్తానికంగా ఉండే గంటాన జగదీష్‌కుమార్(13), కనకరాజు(6) శనివారం ఉదయం స్కూల్ బస్ కోసం రోడ్డు పక్కన వేచి ఉన్నారు. ఇంతలో మాస్కులు ధరించి నల్లటి మారుతి కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారులో ఎక్కాలంటూ పిల్లలను బలవంతం చేశారు. ఎక్కకపోతే చంపుతామని కత్తులతో బెదిరించారు.
అయినా విద్యార్థులు కారు ఎక్కకపోయే సరికి, వారిని బలవంతంగా కారులోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు. దీంతో భయంతో విద్యార్థులు పెద్దగా కేకలు వేశారు. ఇంతలో స్థానికులు అటుగా రావడంతో దుండగలు విద్యార్థులను వదిలి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సమీప పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు.
(భోగాపురం)