9న భోగాపురంలో సమైక్య శంఖారావ
కుట్రలు, కుతంత్రాలను ఛేదించుకుని బయటకొచ్చిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈనెల 9న తొలిసారిగా జిల్లాకు రానున్నారు.
భోగాపురం, న్యూస్‌లైన్ : కుట్రలు, కుతంత్రాలను ఛేదించుకుని బయటకొచ్చిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈనెల 9న తొలిసారిగా జిల్లాకు రానున్నారు. సమైక్యాంధ్ర కోసం అహర్నిశలు శ్రమిస్తూ రాష్ర్టవ్యాప్తంగా పర్యటిస్తున్న ఆయన ఆది వారం భోగాపురం పంచాయతీ సెంటర్ వద్ద నిర్వహించనున్న సమైక్య శంఖారా వం సభలో పాల్గోనున్నారు. ఈ మేరకు భారీ ఎత్తున సభ నిర్వహించేందుకు పార్టీ జిల్లా నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు, అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బేబీనాయన, నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సురేష్‌బాబు, వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు తదితరులు మొయిదలో సమావేశమై అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు.
అంతకుముందు పార్టీ జిల్లా అధ్యక్షుడు సాంబశివరాజు, నెల్లిమర్ల సమన్వయకర్త సురేష్‌బాబు, సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు భోగాపు రం వెళ్లి సమైక్య శంఖారావం సభా వేదికను పరిశీలించారు. ఈ సందర్భంగా సాంబశివరాజు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చేపట్టిన ఉద్యమంలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు వస్తున్నారని, భోగాపురం పంచాయతీ సెంటర్ వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు సభ ప్రారంభంకానున్నట్టు చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉండడం ఎంత అవసరమో వివరిస్తూ, కాంగ్రెస్, టీడీపీల కుట్రలను ఎండగడు తూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తారని తెలి పారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పార్టీ శ్రేణు లు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ అధ్య క్షుడు వరుపుల సుధాకర్, నెల్లిమర్ల, పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాల కన్వీనర్లు సింగుబాబు, మహంతి లక్ష్మణరావు, సబ్బవరపు వెంకటరమణ, దారపు లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు.