పాఠశాలలో రికార్డుల మాయంపై విచారణ | enquiry on school records missing | Sakshi
Sakshi News home page

పాఠశాలలో రికార్డుల మాయంపై విచారణ

Published Fri, Feb 13 2015 1:44 PM | Last Updated on Wed, Sep 26 2018 3:27 PM

enquiry on school records missing

భోగాపురం: విజయనగరం జిల్లాలోని భోగాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్షల రికార్డులు మాయమైన వ్యవహారంపై విచారణ చేపట్టారు. ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ పి.సాయిబాబు శుక్రవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు గుప్తాను విచారించారు. ఇదే పాఠశాలలో చదివిన ఓ విద్యార్థినికి అంగన్‌వాడీ కేంద్రంలో ఉద్యోగం కోసం ఏడవ తరగతి పాసైనట్లు ప్రధానోపాధ్యాయుడు గతేడాది సర్టిఫికెట్ జారీ చేశారు.

అయితే అది తప్పుడు సర్టిఫికెట్ అంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. ఆ తర్వాత పాఠశాలలో 1995 సంవత్సరానికి చెందిన ఏడవ తరగతి పరీక్షల రికార్డులు మాయం అయ్యాయి. ఈ నేపథ్యంలో అసిస్టెంట్ కమిషనర్ సాయిబాబు శుక్రవారం పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందించనున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement