విజయనగరం జిల్లా భోగాపురం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుపై స్థానికుల ఆందోళనలు ఆగటం లేదు.
భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుపై స్థానికుల ఆందోళనలు ఆగటం లేదు. గురువారం ఉదయం భోగాపురం గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్దకు తరలివచ్చారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్లకార్డులతో ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.