భోగాపురం ఎయిర్పోర్టు నిర్వాసిత గ్రామాల్లో శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. తూడెం ఎయిర్పోర్ట్ నోటిఫై భూముల్లోరైట్స్ సంస్థ సర్వేరాళ్లు పాతింది. తూడెం, గిద్దలపాలెంలో భారీ బందోబస్తు చేపట్టడమే కాకుండా తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు టీడీపీ ఎంపీటీసీ పైల రాము భూ సేకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. తమ భూముల్లో అనుమతి లేకుండా సర్వేరాళ్లు వేయటంపై నిరసన తెలిపారు.