విద్యార్థి అదశ్యం
భోగాపురం : స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బమ్మిడి ఈశ్వరరావు మంగళవారం నుంచి కనిపించడం లేదు. పాఠశాలకని చెప్పి వెళ్లిన తన కుమారుడు ఇంత వరకూ తిరిగి ఇంటికి చేరలేదని తల్లి స్వరాజ్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అన్నిచోట్లా వెతికినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది.