రాజధాని గ్రామాల్లో దళితులకు అన్యాయం జరుగుతోందని మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు.
గుంటూరు : రాజధాని గ్రామాల్లో దళితులకు అన్యాయం జరుగుతోందని మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. శనివారం గుంటూరులో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ... దళిత భూములను దోచుకుని అగ్రవర్ణాలకు కట్టబెట్టేందుకు యత్నిస్తుందని చంద్రబాబు సర్కార్ పై ఆయన నిప్పులు చెరిగారు.
దళితులను దగా చేస్తే రాజధాని నిర్మాణాన్ని కొనసాగనీయమని మందకృష్ణ స్పష్టం చేశారు. రాజధానికి కావాల్సిన భూమి కంటే 90 శాతం అధికంగా భూములు సేకరించారని విమర్శించారు. దళితులకు జరుగుతున్న అన్యాయాలపై వచ్చే నెల 13న ఓ రోజు దీక్ష చేయనున్నట్లు మందకృష్ణ పేర్కొన్నారు.