
'ల్యాండ్ మాఫియా రారాజు చంద్రబాబే'
హైదరాబాద్: ల్యాండ్ మాఫియాకు రారాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో అమాయక రైతుల నుంచి ల్యాండ్ పుల్లింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. ల్యాండ్ బ్యాంక్ పేరుతో లక్షల కోట్ల దోపిడిక తెరతీశారని అన్నారు.
10లక్షల ఎకరాలకు పైగా రైతుల నుంచి భూములు లాక్కున్నారని, రెండున్నరేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదని మండిపడ్డారు. ల్యాండ్ మాఫియాకు చంద్రబాబు భూబకాసురుడిగా మారారని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు రైతుల భూములు తీసుకుంటున్నారని, భూములకు రైతులకు విడదీయరాని సంబంధం ఉందని అన్నారు. చంద్రబాబు తన తాబేదార్లకు అక్రమంగా భూములు కట్టబెట్టేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారాడని మండిపడ్డారు.