
'చట్టాన్ని ప్రయోగిస్తే ప్రతిఘటిస్తాం'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశానికి సంబంధించి రైతులపై భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తే ప్రతిఘటిస్తామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) హెచ్చరించారు.
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశానికి సంబంధించి రైతులపై భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తే ప్రతిఘటిస్తామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) హెచ్చరించారు. ఇప్పటికే 33,400 ఎకరాలు తీసుకున్నారు.. ఇంకా భూముల తీసుకుని ఏంచేస్తారని ఆయన ప్రశ్నించారు. సింగపూర్ ప్రభుత్వంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే సహించమన్నారు.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎదుట చంద్రబాబు సర్కారు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. ఇంతవరకూ గ్రామ కంఠాలనే గుర్తించకుండా భూసేకరణ ఎలా చేస్తారని నిలదీశారు. రైతుల కోసం కలిసి వచ్చే పార్టీలతో కలిసి పనిచేయడానికి తమకు అభ్యంతరం లేదని ఆర్కే స్పష్టం చేశారు.