భూసేకరణ మా అభిమతం కాదు
విజయవాడ : భూసేకరణ మా ప్రభుత్వ అభిమతం కాదని .... ల్యాండ్ పూలింగే మా అభిమతమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం విజయవాడలోని ఐలాపురం హోటల్‌లో జరిగిన మెప్మా డీలర్ల సమావేశంలో మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు.
భూసేకరణ మా అభిమతం కాదని.. అనివార్య పరిస్థితుల్లోనే భూసేకరణకు నోటీఫికేషన్ జారీ చేశామని మంత్రి చెప్పారు. పవన్‌కల్యాణ్ చెప్పినట్లు రైతులకు నచ్చచెప్పి భూసేకరణ చేస్తామని ఆయన చెప్పారు. గ్రామకమతాల విషయంలో అందరికీ న్యాయం చేస్తామని మంత్రి నారాయణ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.