ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిసర గ్రామాల్లోల్లో భూసమీకరణకు కలెక్టర్ కాంతీలాల్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు డిప్యూటీ కలెక్టర్లు భూసేకరణకు సిద్ధమయ్యారు. నూతనంగా ప్రకటించిన రాజధాని ప్రాంతంలోని తొలి విడత 10 గ్రామాల్లో భూ సేకరణకు నోటిఫికేషన్ విడుదల అయింది. తుళ్లూరు, అనంతవరం, బోయపాలెం, పిచ్చుకలపాలెం, అబ్బురాజుపాలెం నేలపాడు, శాకమూరు, దొండపాడు, ఐనవోలు గ్రామాల్లో భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు.