మరో రెండు గ్రామాల్లో భూసేకరణ
Published Fri, May 19 2017 11:50 AM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిలో మరో రెండు గ్రామాల్లో భూసేకరణ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. తుళ్ళూరు మండలం లింగాయపాలెం, మంగళగిరి మండలం నవులూరులో రైతుల నుంచి భూమి సేకరించటానికి నోటిఫికేషన్ ఇచ్చింది. లింగాయపాలెంలో 110.60కు నోటిఫికేషన్ ఇచ్చినందున 81 మంది భూ యజమానులు ప్రభావితం అవుతారని అధికారులు తెలిపారు. నవులూరులో 183.56 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. దీనివల్ల 106 మంది ప్రభావితం కావడంతో పాటు 1,101 మంది నిర్వాసితులవుతారని పేర్కొన్నారు.
ఈ భూ సేకరణ నోటిఫికేషన్‌పై మంళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కోర్టు తీర్పులను సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు లెక్కచేయకుండా రాజధానిలో భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వటం దారుణం అని అన్నారు. రైతులు, కూలీలు వ్యవసాయం చేసుకుంటూ బతకటం ఆయనకు ఇష్టం లేదన్నారు. భూసేకరణ నోటిఫికేషన్ ఇస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్న పవన్ కళ్యాణ్ వెంటనే రాజధాని రైతులకు అండగా నిలవాలని ఆర్కే డిమాండ్ చేశారు.
Advertisement