ల్యాండ్ పూలింగ్ విధానానికి సంబంధించి తొలివిడత భూ సమీకరణకు గడువు పెంచాలని ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ విధానానికి సంబంధించి తొలివిడత భూ సమీకరణకు గడువు పెంచాలని ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. పూలింగ్ ఆలస్యం కావడంతో ప్రతి గ్రామానికి మరో 15 రోజులు గడువు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే నెలరోజులు పూర్తైనా 50శాతం మాత్రమే ల్యాండ్ పూలింగ్ జరిగిందని, ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో పూలింగ్ ప్రారంభం కాలేదని అధికారులు తెలిపారు. నిన్నటికి 16వేల ఎకరాల భూ సమీకరణ జరిగినట్టు మంత్రి నారాయణ వెల్లడించారు. కాగా, పూలింగ్ కోసం కేటాయించిన అధికారుల్లో 8మందిని వెనక్కి పంపుతూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.