‘భూ సేకరణ వేగవంతానికి కృషి’ | land pooling | Sakshi
Sakshi News home page

‘భూ సేకరణ వేగవంతానికి కృషి’

Published Wed, Jul 20 2016 11:18 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

land pooling

ఎచ్చెర్ల: పొన్నాడ వంతెనకు ఆనుకొని రోడ్డు నిర్మించేందుకు త్వరితగతిన భూ సేకరణ చేసేందుకు కృషి చేస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ తెలిపారు. పొన్నాడ సమీపంలోని సేకరణకు అవసరమైన భూములను ఆయన బుధవారం పరిశీలించారు. సేకరణకు మూడు ఎకరాలు అవసరం కాగా, ప్రభుత్వ భూమి ఎకరా నలభై సెంట్లు, ప్రైవేట్‌ వ్యక్తుల భూమి ఎకరా అరవై సెంట్లు అవసరంగా గుర్తించారు. ప్రైవేట్‌ వ్యక్తులకు నష్ట పరిహారం చెల్లింపు, ప్రభుత్వ భూమి లెవలింగ్‌లపై దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. రైతులు భూ సేకరణకు సహకరించాలని కోరారు. పరిశీలనలో ఇన్‌చార్జి తహశీల్దార్‌ బందర వెంకటరావు, డీటీ బలివాడ శ్రీహరిబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement