
భూసేకరణ చట్టానికి బ్రేక్: నారాయణ
హైదరాబాద్: భూసేకరణ చట్టాన్ని రాజధానిలో ప్రస్తుతం అమలు చేయడం లేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పామని, 15 రోజుల తర్వాత అఫిడవిట్ దాఖలు చేయమని కోర్టు కోరిందని చెప్పారు. అంతవరకూ ల్యాండ్ పూలింగ్ మాత్రమే నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు.
ఇప్పటి వరకు 16,500 ఎకరాలు రైతుల నుంచి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రాజధాని డిజైన్లొ మార్పులున చేస్తున్నారని, 29 గ్రామాల్లో భూములచ్చిన రైతులకు అదే గ్రామంలో అభివృద్ధి చెందిన భూమి ఇస్తామని మంత్రి తెలిపారు.