రాజధాని ప్రాంతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించేవరకు అసైన్డ్ భూముల రైతుల అవస్థలు ప్రభుత్వానికి తెలియలేదా అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.
గుంటూరు: రాజధాని ప్రాంతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించేవరకు అసైన్డ్ భూముల రైతుల అవస్థలు ప్రభుత్వానికి తెలియలేదా అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఆయనిక్కడ బుధవారం మాట్లాడుతూ ఇంతకాలం రైతులు ఆందోళన చేస్తుంటే ఏపీ సీఎం చంద్రబాబు ఎక్కడ నిద్రపోయారన్నారు.
భూములు ఇవ్వక పోతే భూ సేకరణ చేస్తామనడం అవివేకానికి నిదర్శనమని ఆయన తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వమే వెనకడుగేసిన సంగతి గుర్తుంచుకోవలన్నారు. అయినా భూ సేకరణ చేయాలనుకుంటే దమ్ము, ధైర్యముంటే నోటిఫికేషన్ ఇవ్వండని ఆయన హెచ్చరించారు.