'పవన్ ను ఒప్పించే భూసేకరణ'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంత రైతులను, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఒప్పించి రాజధానికి భూసేకరణ చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. పవన్ తో మాకు ఎటువంటి విభేదాలు లేవని ఆయన పేర్కొన్నారు. తుళ్లురు నుంచి భూ సేకరణ మొదలు పెడతామని వెల్లడించారు. భూ సేకరణ నోటిఫికేషన్ వచ్చిన 24 గంటల్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. భూ సేకరణ ద్వారా సుమారు మూడు వేల ఎకరాలు సేకరిస్తామని.. పవన్ కల్యాణ్ కు ప్రస్తుత వాస్తవ పరిస్థితులను వివరిస్తామని మంత్రి ప్రత్తిపాటి వివరించారు.