ఫార్మాసిటీ సర్వే పనులు ప్రారంభం | pharma city land survey works started in rangareddy district | Sakshi

ఫార్మాసిటీ సర్వే పనులు ప్రారంభం

Published Fri, Nov 11 2016 4:04 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రం సమీపంలోని అన్మాస్‌పల్లి, పుల్లేరుబోడ్ తండా పరిసరాల్లో ప్రభుత్వం తలపెట్టిన ఫార్మాసిటీ కోసం భూముల సర్వే ముమ్మరంగా సాగుతోంది.

కడ్తాల్ : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రం సమీపంలోని అన్మాస్‌పల్లి, పుల్లేరుబోడ్ తండా పరిసరాల్లో ప్రభుత్వం తలపెట్టిన ఫార్మాసిటీ కోసం భూముల సర్వే ముమ్మరంగా సాగుతోంది. రంగారెడ్డి జిల్లా ల్యాండ్ సర్వే డిప్యూటీ ఇన్స్‌స్పెక్టర్‌ అనంతరెడ్డి పర్యవేక్షణలో రెండు బృందాలుగా ఏర్పడి అధికారులు సర్వే నంబర్ 260, 321లలో సర్వే చేపట్టారు. భూముల హద్దుల గుర్తింపునకు, సమగ్ర వివరాల సేకరణకు తాము సర్వే కొనసాగిస్తున్నట్లు వివరించారు. ముందుగా ఆయా సర్వే నంబర్లలో భూముల హద్దులను గుర్తించనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా భూములు ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉన్నాయో తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement