సాక్షి, తెలంగాణ భవన్: తెలంగాణలో సాగుతోంది ఇందిరమ్మ రాజ్యం కాదు.. ఇందిర ఎమర్జెన్సీ పాలన అంటూ తీవ్ర విమర్శలు చేశారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే.. పట్నం నరేందర్ రెడ్డిది అరెస్ట్ కాదు.. కిడ్నాప్ అని ఆరోపించారు. సీఎం తన సొంత అల్లుడు సత్యనారాయణరెడ్డికి చెందిన ఫార్మా కంపెనీ కోసమే ఫార్మా విలేజ్ అంటూ నాటకాలడుతున్నారని చెప్పుకొచ్చారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘రేవంత్ రెడ్డి తుగ్లక్ విధానాల వలనే లగచర్ల ఘటన జరిగింది. కొడంగల్ నుంచే సీఎం రేవంత్ రెడ్డి భరతం పడుతాం. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిది అరెస్ట్ కాదు.. కిడ్నాప్. సీఎం సొంత అల్లుడు సత్యనారాయణరెడ్డికి చెందిన ఫార్మా కంపెనీ కోసమే ఫార్మా విలేజ్. సీఎం అల్లుడు సత్యనారాయణరెడ్డి, శరత్‌ల ఫార్మా కంపెనీలను విస్తరించటం కోసం ప్రభుత్వం సహకరిస్తుంది.
తన ఏడు ఎకరాల భూమి కోల్పోతున్న కారణంగానే సురేష్ కలెక్టర్‌ను అడిగాడు. సురేష్ అనే వ్యక్తి.. బరాబర్ బీఆర్ఎస్ నాయకుడే. నిఘా వ్యవస్థ వైఫల్యం వలనే లగచర్ల ఘటన.. కలెక్టర్ గన్ మెన్లు ఎక్కడ?. ప్రభుత్వ కుట్రకు పోలీస్ ఉన్నతాధికారుల బలికావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు సురేష్ పద్దతిగా.. మర్యాదగా చెప్తే తప్పా?. సొంత పార్టీ కార్యకర్తలతో మా నేతలు మాట్లాడితే తప్పా?. సురేష్ మమల్ని కలవటం తప్పు అయితే.. రాహుల్ గాంధీ రోజూ తిట్టే అదానీని రేవంత్ కలవటం కూడా తప్పే. హైకోర్టులో పిటిషన్లు వేసి ప్రభుత్వం జడ్జీలను కూడా తప్పుదోవ పట్టిస్తోంది. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు.. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ పాలన.
రేవంత్ పిచ్చి నిర్ణయాల వలనే కొడంగల్ రగులుతున్నది. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్.. మహారాష్ట్రకు మూటలు మోస్తున్నాడు. రైతుల అక్రమ అరెస్ట్‌లు జరుగుతుంటే సీఎం ఎక్కడ?. షోలాపూర్ చౌరస్తాలో నిలబడినా.. రేవంత్‌ను ఎవరూ గుర్తుపట్టరు. కనీసం ఆయన సతీమణికి కూడా సమాచారం ఇవ్వకుండా నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. తీవ్రవాదుల మాదిరిగా రైతులను పొలాల వెంబడి తరుముతున్నారు. ఫార్మా విలేజ్ వలన వచ్చే లాభమెంటో ముఖ్యమంత్రి చెప్పాలి. రైతులు తిరుపతి రెడ్డికి ఫోన్ చేసి అడిగితే.. తన్ని భూములు తీసుకుంటామని హెచ్చరించలేదా?.
కేంద్ర పెద్దలను నేను కలవటం తప్పు అయితే.. సీఎం గవర్నర్‌ను కలవటం కూడా తప్పే. ఫార్మా సిటీని రద్దు చేస్తామని పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అనలేదా?. అధికారంలోకి రాగానే ఫార్మా సిటీ రద్దు అని.. మళ్ళీ యూ టర్న్ ఎందుకు తీసుకున్నారు. తనపై దాడి జరగలేదని స్వయంగా కలెక్టర్ చెప్తుంటే.. ఐజీ దాడి జరిగిందంటున్నారు’ అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment