హైదరాబాద్ : పట్టపగలు నడిరోడ్డుపై ఓ వృద్ధుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నగరంలోని హబ్సిగూడలో శనివారం కలకలం రేపింది. ఇది గుర్తించిన స్థానికులు మంటలు ఆర్పి 108 సాయంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా.. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.