సాక్షి, హైదరాబాద్: హబ్సిగూడలో గురువారం విషాదం చోటు చేసుకుంది. లారీ ఢీకొట్టడంతో పాఠశాల విద్యార్థిని మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు.. గురువారం సాయంత్రం జూన్సన్ గ్రామర్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న కామేశ్వరి.. పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో లారీ ఢీకొంది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు.ప్రమాదంతో అప్రమత్తమైన వాహనదారులు బాలికను ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ బాలిక మరణించింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
కొద్దిరోజుల క్రితం
మరోవైపు హబ్సిగూడా ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఇదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురై పదో తరగతి విద్యార్థిని మృతి చెందింది.
ఆగస్ట్ 17, శనివారం ఉదయం హబ్సిగూడలోని గౌతమ్ మోడల్ స్కూల్‌లో పదో తరగతి విద్యార్థిని సాత్విక ఎప్పటిలాగే ఉదయం 7 గంటలకు ఆటోలో స్కూల్‌కు బయలుదేరింది. హబ్సిగూడ చౌరస్తాలో సిగ్నల్ పడి ఉండటంతో ఆర్టీసీ బస్సు వెనకాల ఆటోను ఆపి ఉంచాడు డ్రైవర్. ఈ క్రమంలో మితిమీరిన వేగంలో వెనక నుంచి దూసుకువచ్చిన ఓవర్ లోడ్‌తో ఉన్న టస్కర్ (18 చక్రాల లారీ) వాహనం ఆటోను ఢీకొట్టింది. దీంతో స్వాతిక ప్రయాణిస్తున్న ఆటో ముందున్న ఆర్టీసీ బస్సు కిందకు చొచ్చుకెళ్లింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ ఎల్లయ్య తీవ్రంగా గాయపడగా..సాత్విక ప్రాణాలు కోల్పోయింది. ఇలా వరుస ప్రమాదాలతో ఉన్నత విద్యాసంస్థలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న హబ్సిగుడాలో వరుస రోడ్డు ప్రమాదాలు విద్యార్థులు,వారి తల్లిదండ్రుల్ని కలవరానికి గురి చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment