Land conservation
-
‘రెవెన్యూ’ సేవల్లో తేడా కనపడాలి: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే. మీరు బాగా పనిచేస్తే ప్రజలకు మేలు జరగడమే కాదు.. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. సామాన్యులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి. గతానికి, ప్రస్తుతానికి తేడా కనపడాలి’అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రెవెన్యూ ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 272 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లతో మంత్రి పొంగులేటి ఆదివారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో ముఖా ముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లుగా రాష్ట్ర ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యల నుంచి విముక్తి కలిగించేలా దేశానికే రోల్‌మోడల్‌గా ఉండే కొత్త రెవెన్యూ చట్టాన్ని త్వరలో తీసుకొస్తామని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకొనేలా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామన్నారు. వ్యవస్థలో ఒకరిద్దరి తప్పుల కారణంగా అందరికీ చెడ్డపేరు వస్తోందని, అలాంటి పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తగా పనిచేయాలని, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు వేసే ప్రతి అడుగు రెవెన్యూ వ్యవస్థకు వన్నె తెచ్చేలా ఉండాలన్నారు. రెవెన్యూ సేవల్లో అంతరాయాన్ని నివారించేలా నల్లగొండ జిల్లా తిరుమలగిరి, రంగారెడ్డి జిల్లా యాచారం మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టామని.. ఈ క్రమంలో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకొని కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని రూపొందించే ప్రక్రియ తుదిదశకు చేరుకుందని వివరించారు. కొత్త చట్టం వచ్చేలోగానే ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామన్నారు. 3 నెలలకోసారి లీగల్ సమావేశాలు.. ప్రభుత్వ భూముల పరిరక్షణలో రెవెన్యూ యంత్రాంగం రాజీపడవద్దని మంత్రి పొంగులేటి సూచించారు. భూముల పరిరక్షణ కోసం మూడు నెలలకోసారి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో లీగల్ టీంలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. రెవెన్యూ మంత్రిగా ఎవరున్నా భూముల రికార్డులను టాంపరింగ్ చేసేందుకు వీల్లేకుండా రెవెన్యూ రికార్డుల డిజిటైజేషన్ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపడతామని తెలిపారు. రెవెన్యూ కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోయినా పట్టించుకోని గత ప్రభుత్వం.. అప్పు చేసి మరీ ఉన్న సచివాలయాన్ని కూలగొట్టి కొత్తది కట్టిందని విమర్శించారు. కొన్ని జిల్లాల్లో కలెక్టరేట్లు ఉన్నా కొత్తవి నిర్మించిందని.. తానైతే అలాంటి పనులు చేయబోనని పొంగులేటి స్పష్టం చేశారు. అందరికీ శిక్షణ తప్పనిసరి.. రెవెన్యూ శాఖలో ఉద్యోగంలో చేరిన వారితోపాటు సర్వీసులో ఉన్న వారికి కూడా శిక్షణ తప్పనిసరి చేస్తామని.. ఇందుకోసం రెవెన్యూ అకాడమీని ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల జాబ్ చార్ట్ నిర్ధారణకు కమిటీని ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల్లోని ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి జాబ్ చార్ట్ రూపొందిస్తామన్నారు. ఆర్థికేతర అంశాలకు తక్షణమే పరిష్కారం రెవెన్యూ ఉద్యోగుల సమస్యల్లో ఆర్థికేతర అంశాలను తక్షణమే పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. 33 జిల్లాల్లో సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను ఏర్పాటు చేస్తామని, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల కేడర్ స్ట్రెంగ్త్ పెంచుతామని, 17 మంది రెవెన్యూ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లను పూర్వ జిల్లాలకు పంపడంపై దసరాలోపే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కె. చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి డి. శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి భాస్కరరావు, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు వి. లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ, ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వక్ఫ్‌భూములపై మండలిలో రభస
పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం: ఉపముఖ్యమంత్రి సంతృప్తి చెందని కాంగ్రెస్.. సభ నుంచి వాకౌట్ హైదరాబాద్: వక్ఫ్ భూముల పరిరక్షణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ నివసించే ప్రాంతంలో ఉన్న వక్ఫ్ భూములు కూడా వేరేవారి ఆధీనంలో ఉన్నాయని కాంగ్రెస్ సభ్యులు చేసిన విమర్శలు గురువారం శాసనమండలిలో రభసకు కారణమయ్యాయి. ఫారూఖ్ హుస్సేన్ అడిగిన ప్రశ్నపై ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీతో పాటు సయ్యద్ అల్తాఫ్ హైదర్ రజ్వీ, సలీం, రాములు నాయక్ తదితరులు చర్చలో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెందని కాంగ్రెస్ సభ్యులు విపక్షనేత షబ్బీర్ అలీ నేతృత్వంలో వాకౌట్ చేశారు. రాష్ట్రంలో 23 వేల ఎకరాల వక్ఫ్ భూములు కబ్జాకు గురయ్యాయని, భూముల పరిరక్షణకు ఏర్పాటైన కమిటీలు ఏవీ పనిచేయలేడంలేదని రజ్వీ, షబ్బీర్ అలీ విమర్శించారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బాజిరెడ్డి గోవర్ధన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే దీనిపై కాంగ్రెస్ సభ్యులు సంతృప్తి చెందలేదు. ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. 2017లో కల్వకుర్తి ఎత్తిపోతల పూర్తి.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని 2017 డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావు మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చెప్పారు. పాతూరి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ 3.65 లక్షల ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టుకు రూ. 1,295 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేశామని, ఈ బడ్జెట్లో రూ. 900 కోట్లు కేటాయించామని చెప్పారు. పొంగులేటి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ కాటన్ కాార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కళాశాల, వర్సిటీలకు సన్నబియ్యం: ఈటల కళాశాలలు, విశ్వవిద్యాలయాల వసతి గృహాలకు కూడా వచ్చే ఏడాది నుంచి సన్నబియ్యం సరఫరా చేయనున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. అనాథలను పోషించే స్వచ్చంద సంస్థలు అడిగినా, సన్నబియ్యం సరఫరా చేస్తామని మంత్రి చెప్పారు. సత్ప్రవర్తన ఖైదీల విడుదల: నాయిని జైళ్లలో మగ్గుతున్న ఖైదీలలో సత్ప్రవర్తన గల వారిని విడుదల చేయనున్నట్లు హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని క్రీడా శాఖ మంత్రి టి.పద్మారావు గౌడ్ తెలిపారు. అలాగే క్రీడలను ప్రోత్సహించేందుకు పారితోషకాలను పెంచుతున్నట్లు చెప్పారు. కోచ్‌లకు కూడా ఇప్పుడున్న వేతనాలకన్నా రెట్టింపు ఇచ్చేలా కృషి చేస్తానన్నారు. సరిహద్ధు చెక్‌పోస్టులను ఆధునికీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఇందుకోసం రూ. 10.70 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. -
ఇక.. సమగ్ర భూ సర్వే
నెల లేదా పక్షం రోజుల్లో... గొలుసు పద్ధతికి స్వస్తి అత్యాధునిక పరిజ్ఞానంతో కొలతలు సన్నాహాలు చేస్తున్న సర్కారు అధికారులకు రాతపూర్వక సమాచారం కాజీపేట : భూముల పరిరక్షణకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నో ఏళ్లుగా న్యాయస్థానాల్లో నానుతున్న హద్దు పంచాయతీలు... ఇతరత్రా సమస్యలకు చెక్ పెట్టాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నూతన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇటీవల ఒకే రోజులో సమగ్ర కుటుంబ సర్వే చేసినట్లుగా... త్వరలోనే సమగ్ర భూసర్వేకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. భూ రికార్డుల్లోని లోపాలను సవరించి సమగ్ర రికార్డుల తయారీకి ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. ఇందుకు అవసరమైన నిధులతోపాటు సిబ్బందిని కేటాయించేందుకు సంబంధిత శాఖలు సిద్ధంగా ఉండాల ని ఆదేశాలు సైతం జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గా ల సమాచారం. నిజాం ప్రభుత్వ పాలనలో తయారైన భూముల వాస్తవికత రికార్డులపై సరైన లెక్కలు తేల్చాలని సర్కారు నిర్ణయం తీసుఉకుంది. ఈ మే రకు ప్రభుత్వ, ప్రైవేట్, గ్రామీణ ప్రాంతాల్లోని భూ ముల వివరాలను తిరిగి నమోదు చేయనున్నారు. నెల లేదా పక్షం రోజుల్లో.... జిల్లా విస్తీర్ణం మొత్తం 31,71,720 హెక్టార్లు. ఇందులో అటవీ, ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్ భూములున్నాయి. వందేళ్లకుపైగా సమగ్ర భూ సర్వేలు జరగని కారణంగా క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఆనాటి రికార్డుల ఆధారంగానే భూముల వివరాలను అంచనా వేస్తుండడంతో వాస్తవికత లోపిస్తోంది. పుష్కర కాలం కింద బంజరు, బీళ్లుగా ఉన్న పనికిరాని భూములు ప్రస్తుతం పెరిగిన అవసరాలకు అనుగుణంగా పంట పొలాలుగా మారిపోయాయి. పలు పట్టణాలు, నగరాల్లో ఎందుకు పనికిరాని భూములు అత్యంత ఖరీదైనవిగా విలువలను పెంచుకున్నాయి. ఈ నే పథ్యంలోనే భూముల మార్పులు, చేర్పులను ప్రతిబింబించే సమగ్ర సర్వే అవసరమని రాష్ట్ర ప్రభుత్వం అంచనాకు వచ్చింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూముల హద్దులను నిర్ణయించి సమగ్రంగా నిక్షిప్తం చేయనున్నారు. వివిధ రకాల నేలలు, వాటి స్వభావాలు, వాస్తవసాగు, విస్తీర్ణం, బావులు, చెరువులు, కుంటలు, మైదానాలు, గుట్టలు, సాగు భూములు, ప్రభుత్వ భూములు, వాగులు, లోయలు... ఇలా అన్నింటిని క్రోడీకరించనున్నారు. పక్కాగా చేపట్టనున్న ఈసర్వే మరో నెలరోజుల్లో గానీ... అన్ని అనుకున్నట్లు జరిగితే పక్షం రోజుల్లో గానీ ప్రారంభం కానున్నట్లు జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం నుంచి రాతపూర్వక సమాచారం అందినట్లు తెలిసింది. 1932 రికార్డులే ఆధారం... భూములను కొలవాలన్నా.. వివిధ రకాల భూములను గుర్తించాలన్నా... 1932 నిజాం కాలంనాటి రికార్డులే ఆధారం. అప్పటి సర్వే ఆధారంగానే రికార్డులను భద్రపరిచారు. దశాబ్దాలు గడుస్తుండడంతో అప్పటి దస్త్రాలు అవసానదశకు చేరాయి. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన సర్వే నంబర్లు భూముల దస్త్రాలు చిరిగిపోయాయి. వివాదాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈక్రమంలోనే నేషనల్ రికార్డు మోడలైజేషన్ (ఎన్‌ఎల్‌ఆర్‌ఎం) కింద కేంద్ర ప్రభుత్వ సహకారంతో భూ సమగ్ర సర్వే కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. సర్వే బాధ్యతలను జాతీయ, అంతార్జాతీయ సంస్థలు చేపట్టనుండగా... వారికి జిల్లా యంత్రాంగం పూర్తిగా సహకరిస్తుంది. గొలుసు సర్వేకు స్వస్తి... భూములను కొలవాలంటే ఇప్పటి వరకు గొలుసులే ఆధారం. గొలుసు ద్వారానే ప్రతీది జరిగేది. ఈ పాత విధానానికి స్వస్తి పలికి నూతన విధానంలో కొలతలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎలక్ట్రానిక్ ట్రాన్స్మర్ సిస్టం (ఈటీఎస్), డిఫరెన్సియల్ గ్లోబల్ సిస్టం (డీజీసీ) ద్వారా ఇక భూ సర్వేచేస్తారు. ప్రతి భూమిపై రెండు విధానాల్లో సర్వే నిర్వహించనున్నారు. రాళ్లు, గుట్టలు ఉన్నచోట ఒకరకంగా, సమాంతరంగా ఉన్న చోట మరో విధానంలో సర్వే చేసి హద్దులను నిర్ధేశిస్తారు. మూడు దశల్లో సర్వే పనులు జరగనుండగా... తొలిదశలో వివాదాలున్న చోట నిర్వహిస్తారు. అనంతరం మిగతా ప్రాంతాల్లో సర్వే చేపట్టనున్నారు. సర్వేతో ఇబ్బందులు తొలగిపోతారుు.. నూతన విధానంలో ఈటీఎస్, డీజీసీ ద్వారా భూ సర్వే చేయనున్నట్లుగా సమాచారం వాస్తవమే. త్వరలో ఈ విధానంపై ప్రభుత్వం సరైన నిర్ణయాన్ని ప్రకటించవచ్చు. ఈసర్వేలతో భూ వివాదాలకు తెరపడే అవ కాశం ఉంటుంది. - ఎల్.ప్రభాకర్, ఏడీ సర్వేల్యాండ్ రికార్డుల శాఖ -
గోల్డెన్ గోల్మాల్ కు చెక్..!
- భూముల పరిరక్షణకు నడుం బిగించిన కలెక్టర్ - చౌటుప్పల్ మండలంలో 1250ఎకరాలకుపైగా గోల్డెన్ ఫారెస్ట్ భూములు - దాదాపు 600ఎకరాలకుపైగా అన్యాక్రాంతం - ఆరుగురు సర్వేయర్లతో ప్రత్యేక బృందం ఏర్పాటు - నాలుగు రోజులుగా కొనసాగుతున్న సర్వే చౌటుప్పల్ : చౌటుప్పల్ పరిధిలో గోల్డెన్ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్ సంస్థ కొనుగోలు చేసిన భూముల్లో నెలకొన్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు జిల్లా యం త్రాంగం రంగంలోకి దిగింది. భువనగిరి డివిజనల్ సర్వేయర్ నేతృత్వంలో ఐదుగురు సర్వేయర్లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం సభ్యులు నాలుగు రోజులుగా సర్వే చేస్తున్నారు. గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్ సంస్థ.. 1995లో మూడేళ్లలో మీ డబ్బుకు రెట్టింపు సొమ్ము ఇస్తామని దేశవ్యాప్తంగా డిపాజిట్లు సేకరించి చౌటుప్పల్ మండలంలోని చౌటుప్పల్, తాళ్లసింగారం, లింగోజిగూడెం, తంగడపల్లి, పంతంగి గ్రామాల పరిధిలో 1258ఎకరాల భూములను కొనుగోలు చేసింది. ఆ తరువాత కాలంలో సంస్థ బోర్డు తిప్పేయడంతో, సంస్థ చైర్మన్‌ను పలు అవినీతి ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసి, జైలుకు పంపారు. ఈ నేపథ్యంలో సంస్థలో డిపాజిట్లు చేసిన పలువురు డిపాజిట్‌దారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. చైర్మన్ జైలులోనే మృతిచెందారు. న్యాయస్థానం లిక్విడేటర్‌ను నియమించి, భూములను వేలం వేసి డిపాజిట్‌దారులకు సొమ్ము చెల్లించాలని తీర్పునిచ్చింది. భూముల వేలంపాటకు పలుమార్లు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. వివిధ కారణాలతో వేలంపాటలు పూర్తి కావడం లేదు. అక్రమాలకు తెరతీసిన రెవెన్యూ అధికారులు రెవెన్యూశాఖ లెక్కల ప్రకారం చౌటుప్పల్ మండలంలో గోల్డెన్ఫారెస్టు సంస్థకు 1258ఎకరాల భూములు ఉన్నాయి. కానీ వాస్తవానికి అంతకంటే ఎక్కువే భూములున్నాయి. గోల్డెన్ఫారెస్ట్ సంస్థ కొనుగోలు చేసిన భూములన్నింటినీ తహసిల్దార్ కార్యాలయంలో రికార్డు మార్పిడీ చేయించలేదు. కొనుగోలు సమయంలోనే సంస్థలో చక్రం తిప్పిన ఇద్దరు తమ భార్యల పేరున భూములను రిజిస్ట్రేషన్ చేయించారు. సంస్థ పేరునే భూములున్నా అన్ని డాక్యుమెంట్లను సుప్రీంకోర్టుకు సమర్పించలేదు. చైర్మన్ అరెస్టు అనంతరం ఆ ఇద్దరు, రెవెన్యూ అధికారులు రెవెన్యూ చట్టాల్లోని లోపాలను ఆసరాగా చేసుకొని అక్రమాలకు తెరతీశారు. ఈ భూములున్ని హైవేకు ఇరువైపులా ఉండడం, 2005లో వచ్చిన రియల్ భూంతో ఈ భూములపై కన్నేశారు. ఈ సమయంలో ఇక్కడ పని చేసిన తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులు కొంతమంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని గోల్డెన్ఫారెస్టు సంస్థకు భూములను అమ్మిన రైతులు వృద్ధాప్యంలో ఉన్నారని, వారి వారసులని భార్యలు, కూతుళ్లు, కొడుకుల పేర రెండోసారి పట్టాపాస్‌పుస్తకాలు ఇచ్చారు. సదరు ఏజెంట్ల సహకారంతో భూములను అమ్మకానికి పెట్టారు. ఆ రైతు వచ్చి భూములను పట్టా చేసినందుకు ఎకరాకు ఇంత అంటూ ముట్టజెప్పారు. ఆ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు తక్కువ రే ట్లకు కొనగోలు చేసి, వెంచర్లు చేశారు. కొందరు కంపెనీలు పెట్టారు . ఇలా రెవెన్యూ ఉద్యోగులు, ఏజెంట్లు, రియల్ వ్యాపారులు కోట్లకు పడగలెత్తారు. ఆ తరువాతికాలంలో వచ్చిన మరికొందరు తహసీల్దార్లు కూడా ఇదే అక్రమ దందాను కొనసాగించారు. ఇలా దాదాపు 600ఎకరాల భూమి అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయింది. పలు కంపెనీ యజమానులు కూడ వందలాది ఎకరాల భూములను కబ్జాపెట్టారు. భూముల పరిరక్షణకు సర్వే గోల్డెన్ భూముల్లో అక్రమాలకు పాల్పడి, రెవెన్యూ అధికారులు సస్పెన్షన్‌కు కూడ గురయ్యారు. ఇటీవల కాలంలో లింగోజిగూడెం శివారులో ఏర్పాటైన ఓ వెంచర్‌పై పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. సీఎం పేషీ వరకు ఫిర్యాదులు వెళ్లాయి. జిల్లా కలెక్టర్‌కు కూడ ఫిర్యాదులు చేశారు. వరుసగా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ భూముల పరిరక్షణకు సర్వే చేసి, హద్దురాళ్లు నాటాలని నిర్ణయించారు. మొదటగా ఇతరుల కబ్జాల్లోని వెలికితీసేందుకు ఆరుగురు సర్వేయర్లతో బృందాన్ని ఏర్పాటు చేశారు. నాలుగు రోజులుగా సర్వే జరుగుతోంది. రామన్నపేట, చౌటుప్పల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గోల్డెన్ సంస్థ పేరిట రిజిస్ట్రేషన్ అయిన భూముల వివరాలను తీసుకొని, దాని ఆధారంగా సర్వే చేస్తున్నారు. సర్వే పూర్తి కాగానే అక్రమార్కుల చెరలో ఉన్న భూములన్నింటినీ స్వాధీనం చేసుకోనున్నారు. భూములన్నింటినీ స్వాధీనం చేసుకుంటాం : ఎన్.మధుసూదన్, ఆర్డీఓ, భువనగిరి చౌటుప్పల్, బీబీనగర్ మండలాల్లోని గోల్డెన్ ఫారెస్టు సంస్థకు చెందిన భూములన్నింటినీ సర్వే చేయిస్తున్నాం. చౌటుప్పల్ పూర్తికాగానే, బీబీనగర్‌లో సర్వే చేయిస్తా. ఇప్పటికే పలు కంపెనీలు కూడా భూములను ఆక్రమించినట్టు తేలింది. సర్వే తర్వాత భూములన్నింటినీ స్వాధీనం చేసుకుంటాం. -
భూదాన్ భూములపై నెలరోజుల్లో నివేదిక
సాక్షి, రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూములను తనిఖీ చేసి నెలరోజుల్లో స్పష్టమైన వివరాలు ఇవ్వాలని రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఎస్కే సిన్హా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ప్రభుత్వ భూముల పరిరక్షణ, భూ కేటాయింపు, భూదాన్, యూఎల్సీపై రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూదాన్ యజ్ఞబోర్డుకు సంబంధించి 21,939 ఎకరాలు ఉందని ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఇందులో 13,916 ఎకరాలు ఫిట్‌గా ఉందని, ఇందులోనుంచి 13,510 ఎకరాలు అసైన్డ్ చేయగా, 8023 ఎకరాలు నిరుపయోగంగా ఉందన్నారు. ఈ భూములు ఎవరి పరిధిలో ఉన్నాయి, ఎంత మొత్తం కేటాయించారు.. ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ మండలాల వారీగా రిపోర్టు తయారు చేసి నెల రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలో 44వేల ఎకరాల భూమిని వివిధ సంస్థలకు కేటాయించడం జరిగిందని, ఇందులో 10,852 ఎకరాలు నిరుపయోగంగా ఉన్నట్లు ప్రాథమికంగా తేలిందన్నారు. ప్రభుత్వ భూములు కేటాయించిన ఏపీఐఐసీ, హెచ్ఎండీఏ, దిల్, రాజీవ్ స్వగృహ, హౌజింగ్ తదితర సంస్థలతో ప్రత్యేక సమావేశం నిర్విృస్తామన్నారు. నిరుపయోగంగా ఉన్న భూముల్ని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. విలువైన భూములకు ప్రహరీలు జిల్లాలో విలువైన ప్రభుత్వ భూ ములున్నాయని సీసీఎల్ఏ ఎస్కే సిన్హా పేర్కొన్నారు. సుమారు రూ. 4867 కోట్ల విలువైన 853 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షిం చేందుకుగాను ప్రహరీలు, కంచెలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకవసరమైన నిధులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభు త్వ భూముల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకుగాను ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. లీగల్ సెల్ ఏర్పాటు చేయండి : కలెక్టర్ జిల్లాలోని భూములకు సంబంధించి పెద్ద సంఖ్యలో కేసులున్నాయని కలెక్టర్ ఎన్.శ్రీధర్ సీసీఎల్ఏకు వివరించారు. వీటిని పరిష్కరించేందుకు వీలుగా ప్రత్యేక లీగల్‌సెల్ ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా ప్రత్యేకంగా ప్రభుత్వ న్యాయవాదిని ఏర్పాటు చేస్తే సమస్యలు త్వరితంగా పరిష్కారమ వుతాయన్నారు.ఈ సమావేశంలో జేసీలు చంపాలాల్, ఎం వీరెడ్డి, సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి, ఆర్డీఓలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.