ఇక.. సమగ్ర భూ సర్వే | omprehensive land survey | Sakshi
Sakshi News home page

ఇక.. సమగ్ర భూ సర్వే

Published Mon, Apr 6 2015 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 11:54 PM

ఇక.. సమగ్ర  భూ సర్వే

ఇక.. సమగ్ర భూ సర్వే

నెల లేదా పక్షం రోజుల్లో...   గొలుసు పద్ధతికి స్వస్తి
అత్యాధునిక పరిజ్ఞానంతో కొలతలు
సన్నాహాలు చేస్తున్న సర్కారు
అధికారులకు రాతపూర్వక సమాచారం

 
కాజీపేట :  భూముల పరిరక్షణకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నో ఏళ్లుగా న్యాయస్థానాల్లో నానుతున్న హద్దు పంచాయతీలు... ఇతరత్రా సమస్యలకు చెక్ పెట్టాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నూతన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇటీవల ఒకే రోజులో సమగ్ర కుటుంబ సర్వే చేసినట్లుగా... త్వరలోనే సమగ్ర భూసర్వేకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.

భూ రికార్డుల్లోని లోపాలను సవరించి సమగ్

రికార్డుల తయారీకి ప్రభుత్వం  మార్గదర్శకాలను రూపొందించింది. ఇందుకు అవసరమైన నిధులతోపాటు సిబ్బందిని కేటాయించేందుకు సంబంధిత శాఖలు సిద్ధంగా ఉండాల ని ఆదేశాలు సైతం జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గా ల సమాచారం. నిజాం ప్రభుత్వ పాలనలో తయారైన భూముల వాస్తవికత రికార్డులపై సరైన లెక్కలు తేల్చాలని సర్కారు నిర్ణయం తీసుఉకుంది. ఈ మే రకు ప్రభుత్వ, ప్రైవేట్, గ్రామీణ ప్రాంతాల్లోని భూ ముల వివరాలను తిరిగి నమోదు చేయనున్నారు.

నెల లేదా పక్షం రోజుల్లో....

జిల్లా విస్తీర్ణం మొత్తం 31,71,720 హెక్టార్లు. ఇందులో అటవీ, ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్ భూములున్నాయి. వందేళ్లకుపైగా సమగ్ర భూ సర్వేలు జరగని కారణంగా క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఆనాటి రికార్డుల ఆధారంగానే భూముల వివరాలను అంచనా వేస్తుండడంతో వాస్తవికత లోపిస్తోంది. పుష్కర కాలం కింద బంజరు, బీళ్లుగా ఉన్న పనికిరాని భూములు ప్రస్తుతం పెరిగిన అవసరాలకు అనుగుణంగా పంట పొలాలుగా మారిపోయాయి. పలు పట్టణాలు, నగరాల్లో ఎందుకు పనికిరాని భూములు అత్యంత ఖరీదైనవిగా విలువలను పెంచుకున్నాయి. ఈ నే పథ్యంలోనే భూముల మార్పులు, చేర్పులను ప్రతిబింబించే సమగ్ర సర్వే అవసరమని రాష్ట్ర ప్రభుత్వం అంచనాకు వచ్చింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూముల హద్దులను నిర్ణయించి సమగ్రంగా నిక్షిప్తం చేయనున్నారు. వివిధ రకాల నేలలు, వాటి స్వభావాలు, వాస్తవసాగు, విస్తీర్ణం, బావులు, చెరువులు, కుంటలు, మైదానాలు, గుట్టలు, సాగు భూములు, ప్రభుత్వ భూములు, వాగులు, లోయలు... ఇలా అన్నింటిని క్రోడీకరించనున్నారు. పక్కాగా చేపట్టనున్న ఈసర్వే మరో నెలరోజుల్లో గానీ... అన్ని అనుకున్నట్లు జరిగితే పక్షం రోజుల్లో గానీ ప్రారంభం కానున్నట్లు జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం నుంచి రాతపూర్వక సమాచారం అందినట్లు తెలిసింది.

1932 రికార్డులే ఆధారం...

భూములను కొలవాలన్నా.. వివిధ రకాల భూములను గుర్తించాలన్నా... 1932 నిజాం కాలంనాటి  రికార్డులే ఆధారం. అప్పటి సర్వే ఆధారంగానే రికార్డులను భద్రపరిచారు. దశాబ్దాలు గడుస్తుండడంతో అప్పటి దస్త్రాలు అవసానదశకు చేరాయి. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన సర్వే నంబర్లు భూముల దస్త్రాలు చిరిగిపోయాయి. వివాదాలు నానాటికీ పెరిగిపోతున్నాయి.  ఈక్రమంలోనే నేషనల్ రికార్డు మోడలైజేషన్ (ఎన్‌ఎల్‌ఆర్‌ఎం) కింద కేంద్ర ప్రభుత్వ సహకారంతో భూ సమగ్ర సర్వే కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. సర్వే బాధ్యతలను జాతీయ, అంతార్జాతీయ సంస్థలు చేపట్టనుండగా... వారికి జిల్లా యంత్రాంగం పూర్తిగా సహకరిస్తుంది.
 
గొలుసు సర్వేకు స్వస్తి...



భూములను కొలవాలంటే ఇప్పటి వరకు గొలుసులే ఆధారం. గొలుసు ద్వారానే ప్రతీది జరిగేది.  ఈ పాత విధానానికి స్వస్తి పలికి నూతన విధానంలో కొలతలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మర్ సిస్టం (ఈటీఎస్), డిఫరెన్సియల్ గ్లోబల్ సిస్టం (డీజీసీ) ద్వారా ఇక భూ సర్వేచేస్తారు. ప్రతి భూమిపై రెండు విధానాల్లో సర్వే నిర్వహించనున్నారు. రాళ్లు, గుట్టలు ఉన్నచోట ఒకరకంగా, సమాంతరంగా ఉన్న చోట మరో విధానంలో సర్వే చేసి హద్దులను నిర్ధేశిస్తారు. మూడు దశల్లో సర్వే పనులు జరగనుండగా... తొలిదశలో వివాదాలున్న చోట నిర్వహిస్తారు. అనంతరం మిగతా ప్రాంతాల్లో సర్వే  చేపట్టనున్నారు.
 
సర్వేతో ఇబ్బందులు తొలగిపోతారుు..


నూతన విధానంలో ఈటీఎస్, డీజీసీ ద్వారా భూ సర్వే చేయనున్నట్లుగా సమాచారం వాస్తవమే. త్వరలో ఈ విధానంపై ప్రభుత్వం సరైన నిర్ణయాన్ని ప్రకటించవచ్చు. ఈసర్వేలతో భూ వివాదాలకు తెరపడే అవ కాశం ఉంటుంది.
 - ఎల్.ప్రభాకర్,
 ఏడీ సర్వేల్యాండ్ రికార్డుల శాఖ
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement