new action plan
-
‘ఎ’ ప్లస్‌లోనే ఆ ముగ్గురు.. ఏడాదికి రూ.7 కోట్లు!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2020–2021 సీజన్‌కు కొత్త కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. 2019–2020 కాంట్రాక్ట్ గతేడాది సెప్టెంబరు 30తో ముగియగా... తాజా కాంట్రాక్ట్ 2020 అక్టోబరు నుంచి 2021 సెప్టెంబరు వరకు ఉంటుంది. ఈసారి మొత్తం 28 మంది ఆటగాళ్లతో బీసీసీఐ కాంట్రాక్ట్ జాబితాను రూపొందించింది. వరుసగా మూడో ఏడాది భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గ్రేడ్ ‘ఎ’ ప్లస్’లో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఈ ముగ్గురికి ఏడాది కాలానికి రూ. 7 కోట్లు చొప్పున చెల్లిస్తారు. హైదరాబాద్ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్, పంజాబ్ బ్యాట్స్‌మన్ శుబ్‌మన్ గిల్ తొలిసారి కాంట్రాక్ట్‌లను అందుకున్నారు. వీరిద్దరికి గ్రేడ్ ‘సి’ లో చోటు కల్పించారు. వీరిద్దరికి రూ. కోటి చొప్పు న కాంట్రాక్ట్ మొత్తం లభిస్తుంది. 2017–2018 తర్వాత స్పిన్నర్ అక్షర్ పటేల్ (గుజరాత్) మళ్లీ కాంట్రాక్ట్ జాబితాలో చోటు సంపాదించాడు. అక్షర్ పటేల్‌కు గ్రేడ్ ‘సి’లో స్థానం ఇచ్చారు. గాయాల బారిన పడ్డ భువనేశ్వర్ కుమార్ గ్రేడ్ ‘ఎ’ నుంచి ‘బి’కి పడిపోయాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు గ్రేడ్ ‘బి’ నుంచి ‘ఎ’కు... పేస్ బౌలర్ శార్దుల్ ఠాకూర్‌కు గ్రేడ్ ‘సి’ నుంచి ‘బి’కి ప్రమోషన్ లభించింది. గత ఏడాది గ్రేడ్ ‘సి’ కాంట్రాక్ట్ పొందిన కేదార్ జాదవ్ (మహారాష్ట్ర), మనీశ్ పాండే (కర్ణాటక) ఈసారి మొండిచేయి లభించింది. వీరిద్దరూ తమ కాంట్రాక్ట్‌లను కోల్పోయారు. కుల్దీప్ యాదవ్ ‘ఎ’ నుంచి ‘సి’కి... గ్రేడ్ ‘ఎ’లో 10 మందికి చోటు కల్పించారు. గత ఏడాది గ్రేడ్ ‘ఎ’లో ఉన్న ‘చైనామన్’ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గ్రేడ్ ‘సి’కి... గ్రేడ్ ‘బి’లో ఉన్న యజువేంద్ర చహల్ గ్రేడ్ ‘సి’కి పడిపోయారు. 2019 ప్రపంచకప్ తర్వాత వీరిద్దరు ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయారు. వరల్డ్‌కప్ తర్వాత కుల్దీప్ యాదవ్ కేవలం మూడు టి20 మ్యాచ్‌లు ఆడగా... చహల్ 17 మ్యాచ్‌లు ఆడి కేవలం 16 వికెట్లు తీశాడు. టెస్టు ఫార్మాట్లోనూ కుల్దీప్ యాదవ్‌పై టీమ్ మేనేజ్మెంట్ అంతగా నమ్మకం పెట్టుకోలేదు. 2018–2019 ఆస్ట్రేలియా పర్యటనలో హెడ్ కోచ్ రవిశాస్త్రి నుంచి భారత నంబర్‌వన్ స్పిన్నర్ అంటూ కితాబు అందుకున్న కుల్దీప్ యాదవ్‌కు ఆ తర్వాత కేవలం ఒకే ఒక్క టెస్టులో ఆడాడు. కొత్త కాంట్రాక్ట్ జాబితా గ్రేడ్ ‘ఎ’ ప్లస్ (రూ. 7 కోట్లు) విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా. గ్రేడ్ ‘ఎ’ (రూ. 5 కోట్లు) రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మొహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా. గ్రేడ్ ‘బి’ (రూ. 3 కోట్లు) వృద్ధిమాన్ సాహా, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, శార్దుల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్. -
'దిశ' ఉదంతం.. పోలీసులకు పాఠాలు
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ ఉదంతం దేశవ్యాప్తంగా పోలీసులకు ఎన్నో పాఠాలు నేర్పుతోంది. మహిళలు, యువతుల భద్రత విషయంలో వారు తీసుకుంటున్న చర్యల ‘దిశ’మారుస్తోంది. పంజాబ్ లోని లూధియానా, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్ సహా అనేక మెట్రో నగరాల పోలీసులు మహిళల భద్రత విషయంలో వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాచకొండ నుంచే మొదలైన సేవలు.. ‘దిశ’ఉదంతం వెలుగులోకి వచ్చిన వెంటనే తొలుత స్పందించింది రాచకొండ పోలీసులే. సీపీ మహేశ్ భగవత్ గత గురువారమే స్పందించి యువతులు, మహిళలకు అదనపు సేవలు అందించేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. వాహనాల్లో పెట్రోల్ అయిపోయినా, పంక్చర్ అయినా పోలీసులకు ఫోన్ చేయాలని లేదా వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలంటూ సూచించారు. ఈ సర్వీసును ఆ మరుసటి రోజు నుంచే అనేక మంది వినియోగించుకున్నారు. లూధియానాలో ఫ్రీ ట్రావెల్ సర్వీస్.. రాత్రి వేళల్లో ప్రయాణించే మహిళలు, యువతుల కోసం పంజాబ్‌లోని లూధియానా పోలీసులు ఆదివారం నుంచి కొత్త సర్వీసు ప్రారంభించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య మహిళలకు సురక్షితమైన ప్రయాణం అందించేందుకు ఉచితంగా సేవలందిస్తున్నారు. ఆ సమయాల్లో ప్రయాణించేందుకు వాహనం దొరక్కపోతే పోలీసులకు ఫోన్ చేయాలంటూ రెండే ప్రత్యేక నంబర్లు కేటాయించారు. వీటికి కాల్ చేస్తే కంట్రోల్‌రూం వాహనం లేదా స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ వాహనం వచ్చి సదరు మహిళను సురక్షితంగా గమ్య స్థానానికి చేరుస్తాయని లూధియానా పోలీస్ కమిషనర్ రాకేశ్ అగర్వాల్ ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. బ్యాన్ చేసిన బెంగళూరు కాప్స్.. ‘దిశ’పై అఘాయిత్యానికి పాల్పడ్డ దుండగులు ఆమెపై పెట్రోల్ పోసి కాల్చేశారు. పెట్రోల్‌ను ఓ బంకు నుంచి బాటిల్లో కొని తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని అన్ని బంకులకు పోలీస్ కమిషనర్ భాస్కర్‌రావు సోమవారం నోటీసులు జారీ చేశారు. బాటిళ్లు, క్యాన్లతో వచ్చే వారికి ఇంధనం విక్రయాన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. దీన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఈ విషయాన్ని బంకుల్లో బోర్డుల ద్వారా అందరికీ తెలిసేలా ఏర్పాటు చేయించారు. కోల్‌కతాలో కెమెరాల ఏర్పాటు.. పశ్చిమబెంగాల్లోని కోల్‌కతా పోలీస్ కమిషనర్ అంజూ శర్మ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఇందులో ‘దిశ’కేసును ప్రస్తావించి.. అలాంటి ఘటనలు కోల్‌కతాలో జరగకుండా కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాటిలో భాగంగా కళాశాలలు, పాఠశాలలు ఉన్న ప్రాంతాలతో పాటు నిర్మానుష్య ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సాధారణంగా మహిళలు, యువతులు కాలకృత్యాల కోసం నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లి దుండగుల బారినపడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. నగరవ్యాప్తంగా మొబైల్ టాయిలెట్స్ అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు -
‘అయోధ్య’ కోసం చట్టం చేయాలి: శివసేన
ముంబై: వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల అనం తరం రాజకీయ అనిశ్చితి ఏర్పడే అవకాశమున్నందున అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఇప్పుడే పార్లమెంట్లో చట్టం చేయాలని శివసేన పార్టీ డిమాండ్ చేసింది. రామ మందిరం నిర్మించేంత వరకూ ప్రధాని మోదీ కాషాయరంగు తలపాగాను ధరించరాదని ఆ పార్టీ కోరింది. ఈ మేరకు శివసేన పార్టీకి చెందిన పత్రిక సామ్న తాజా సంపాదకీయంలో పేర్కొంది. రామమందిర నిర్మాణానికి మరోమార్గం లేనప్పుడు అవసరమైతే కేంద్రమే చట్టం తీసుకొచ్చేలా విధానపర నిర్ణయం తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య గతంలో చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా సంపాదకీయంలో ప్రస్తావించింది. కేంద్రంలోని గత యూపీఏ ప్రభుత్వం అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై ఏకాభిప్రాయం సాధించలేకపోయిందని, సుప్రీంకోర్టు కూడా ఏ నిర్ణ యం చెప్పలేదని అందులో పేర్కొంది. రామమందిర నిర్మాణానికి లోక్‌సభలో శివసేనతో పాటు మరిన్ని పార్టీలు మద్దతిస్తున్నందున దానిపై చట్టం తీసుకురావటంలో ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వవని శివసేన తెలిపింది. ప్రస్తుతం లోక్‌సభలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉందని, 2019లో లోక్‌సభలో బీజేపీ పరిస్థితి ఏమిటో ఇప్పుడే చెప్పలేమని అందుకే ఆ లోపే రామమందిర నిర్మాణానికి చట్టం చేయాలని శివసేన సూచించింది. -
ఇక.. సమగ్ర భూ సర్వే
నెల లేదా పక్షం రోజుల్లో... గొలుసు పద్ధతికి స్వస్తి అత్యాధునిక పరిజ్ఞానంతో కొలతలు సన్నాహాలు చేస్తున్న సర్కారు అధికారులకు రాతపూర్వక సమాచారం కాజీపేట : భూముల పరిరక్షణకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నో ఏళ్లుగా న్యాయస్థానాల్లో నానుతున్న హద్దు పంచాయతీలు... ఇతరత్రా సమస్యలకు చెక్ పెట్టాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నూతన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇటీవల ఒకే రోజులో సమగ్ర కుటుంబ సర్వే చేసినట్లుగా... త్వరలోనే సమగ్ర భూసర్వేకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. భూ రికార్డుల్లోని లోపాలను సవరించి సమగ్ర రికార్డుల తయారీకి ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. ఇందుకు అవసరమైన నిధులతోపాటు సిబ్బందిని కేటాయించేందుకు సంబంధిత శాఖలు సిద్ధంగా ఉండాల ని ఆదేశాలు సైతం జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గా ల సమాచారం. నిజాం ప్రభుత్వ పాలనలో తయారైన భూముల వాస్తవికత రికార్డులపై సరైన లెక్కలు తేల్చాలని సర్కారు నిర్ణయం తీసుఉకుంది. ఈ మే రకు ప్రభుత్వ, ప్రైవేట్, గ్రామీణ ప్రాంతాల్లోని భూ ముల వివరాలను తిరిగి నమోదు చేయనున్నారు. నెల లేదా పక్షం రోజుల్లో.... జిల్లా విస్తీర్ణం మొత్తం 31,71,720 హెక్టార్లు. ఇందులో అటవీ, ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్ భూములున్నాయి. వందేళ్లకుపైగా సమగ్ర భూ సర్వేలు జరగని కారణంగా క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఆనాటి రికార్డుల ఆధారంగానే భూముల వివరాలను అంచనా వేస్తుండడంతో వాస్తవికత లోపిస్తోంది. పుష్కర కాలం కింద బంజరు, బీళ్లుగా ఉన్న పనికిరాని భూములు ప్రస్తుతం పెరిగిన అవసరాలకు అనుగుణంగా పంట పొలాలుగా మారిపోయాయి. పలు పట్టణాలు, నగరాల్లో ఎందుకు పనికిరాని భూములు అత్యంత ఖరీదైనవిగా విలువలను పెంచుకున్నాయి. ఈ నే పథ్యంలోనే భూముల మార్పులు, చేర్పులను ప్రతిబింబించే సమగ్ర సర్వే అవసరమని రాష్ట్ర ప్రభుత్వం అంచనాకు వచ్చింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూముల హద్దులను నిర్ణయించి సమగ్రంగా నిక్షిప్తం చేయనున్నారు. వివిధ రకాల నేలలు, వాటి స్వభావాలు, వాస్తవసాగు, విస్తీర్ణం, బావులు, చెరువులు, కుంటలు, మైదానాలు, గుట్టలు, సాగు భూములు, ప్రభుత్వ భూములు, వాగులు, లోయలు... ఇలా అన్నింటిని క్రోడీకరించనున్నారు. పక్కాగా చేపట్టనున్న ఈసర్వే మరో నెలరోజుల్లో గానీ... అన్ని అనుకున్నట్లు జరిగితే పక్షం రోజుల్లో గానీ ప్రారంభం కానున్నట్లు జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం నుంచి రాతపూర్వక సమాచారం అందినట్లు తెలిసింది. 1932 రికార్డులే ఆధారం... భూములను కొలవాలన్నా.. వివిధ రకాల భూములను గుర్తించాలన్నా... 1932 నిజాం కాలంనాటి రికార్డులే ఆధారం. అప్పటి సర్వే ఆధారంగానే రికార్డులను భద్రపరిచారు. దశాబ్దాలు గడుస్తుండడంతో అప్పటి దస్త్రాలు అవసానదశకు చేరాయి. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన సర్వే నంబర్లు భూముల దస్త్రాలు చిరిగిపోయాయి. వివాదాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈక్రమంలోనే నేషనల్ రికార్డు మోడలైజేషన్ (ఎన్‌ఎల్‌ఆర్‌ఎం) కింద కేంద్ర ప్రభుత్వ సహకారంతో భూ సమగ్ర సర్వే కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. సర్వే బాధ్యతలను జాతీయ, అంతార్జాతీయ సంస్థలు చేపట్టనుండగా... వారికి జిల్లా యంత్రాంగం పూర్తిగా సహకరిస్తుంది. గొలుసు సర్వేకు స్వస్తి... భూములను కొలవాలంటే ఇప్పటి వరకు గొలుసులే ఆధారం. గొలుసు ద్వారానే ప్రతీది జరిగేది. ఈ పాత విధానానికి స్వస్తి పలికి నూతన విధానంలో కొలతలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎలక్ట్రానిక్ ట్రాన్స్మర్ సిస్టం (ఈటీఎస్), డిఫరెన్సియల్ గ్లోబల్ సిస్టం (డీజీసీ) ద్వారా ఇక భూ సర్వేచేస్తారు. ప్రతి భూమిపై రెండు విధానాల్లో సర్వే నిర్వహించనున్నారు. రాళ్లు, గుట్టలు ఉన్నచోట ఒకరకంగా, సమాంతరంగా ఉన్న చోట మరో విధానంలో సర్వే చేసి హద్దులను నిర్ధేశిస్తారు. మూడు దశల్లో సర్వే పనులు జరగనుండగా... తొలిదశలో వివాదాలున్న చోట నిర్వహిస్తారు. అనంతరం మిగతా ప్రాంతాల్లో సర్వే చేపట్టనున్నారు. సర్వేతో ఇబ్బందులు తొలగిపోతారుు.. నూతన విధానంలో ఈటీఎస్, డీజీసీ ద్వారా భూ సర్వే చేయనున్నట్లుగా సమాచారం వాస్తవమే. త్వరలో ఈ విధానంపై ప్రభుత్వం సరైన నిర్ణయాన్ని ప్రకటించవచ్చు. ఈసర్వేలతో భూ వివాదాలకు తెరపడే అవ కాశం ఉంటుంది. - ఎల్.ప్రభాకర్, ఏడీ సర్వేల్యాండ్ రికార్డుల శాఖ