
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో రెండు ముఖ్యమైన ఫ్లైఓవర్ల నిర్మాణానికి 160 ఎకరాల రక్షణ భూములను కేటాయించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర పురపాలక మంత్రి కె.తారకరామారావు విజ్ఞప్తి చేశారు. బెంగళూరులో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు 210 ఎకరాల రక్షణ భూములను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని సోమవారం ఆయన ట్విట్టర్‌లో షేర్ చేసి, నిర్మలా సీతారామన్‌కు ట్యాగ్ చేశారు. రెండేళ్లుగా రక్షణ భూముల కేటాయింపులకు ఎదురుచూస్తున్నామన్నారు. బెంగళూరులో కేటాయించిన ప్రాతిపదికనే హైదరాబాద్‌లో సైతం రక్షణ భూములు కేటాయిస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment