Telugu Film Producers Council Meeting: రేపు (గురువారం) తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సమావేశం కానుంది. హైదరాబాద్ ఫిలీం ఛాంబర్‌లో నిర్వహించే ప్రత్యేక జనరల్ బాడీ మీటింగ్‌లో కౌన్సిల్ సభ్యులందరు హాజరు కావాలని నోటీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఓటీటీ, వీపీఎఫ్ ఛార్జీలు, టికెట్ ధరలు, ఉత్పత్తి వ్యయం, పని పరిస్థితులు, రేట్లు, ఫైటర్స్ యూనియన్, ఫెడరేషన్ సమస్యలు, మేనేజర్‌ల పాత్ర, నటులు, టెక్నీషియన్స్ సమస్యలపై చర్చించనున్నట్లు సమాచారం.
కాగా ఆగస్టు 1 నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలో షూటింగ్‌లు బంద్ చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు ఇదివరకు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశాలపై నిర్వహించే చర్చలు ప్రారంభదశలోనే ఉన్నట్లు ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఈ క్రమంలోనే గురువారం (జులై 21) తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
చదవండి:👇
షూటింగ్స్ బంద్‌పై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు..
నా మైండ్ సెట్ చాలా మారింది: నాగ చైతన్య
కరీనా కపూర్ మళ్లీ ప్రెగ్నెంట్ !.. అతను ఇప్పటికే చాలా చేశాడని పోస్ట్
డ్రగ్స్‌తో పట్టుబడిన మోడల్.. గర్భవతిగా నమ్మిస్తూ..
చిక్కుల్లో సింగర్ శ్రావణ భార్గవి.. కోర్టుకు వెళతానని అన్నమయ్య వంశస్తుల హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment