చాలా రంగాల్లో లైగిక వేధింపులు ఎక్కువగా అవుతున్నాయి. కొందరు ధైర్యం చేసి కంప్లైంట్స్ ఇస్తున్నారు. మరికొందరు ఎవరికీ చెప్పలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. మహిళలపై గతంలో జరిగిన, ఇప్పుడు జరుగుతున్న హింసపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రిటైర్డ్ నాయమూర్తి ఆధ్వర్యంలో ఓ కమిటీ నియమించి మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ఉక్కుపాదం మోపాలని తెలుగు భాషా పరిరక్షణ వేదిక కన్వీనర్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఓ ప్రకటనలో కోరారు.
కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఏం చెప్పారంటే?
కేరళలో హేమ కమిటీ రిపోర్ట్ రిలీజైన వెంటనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ లాల్ తన పదవికి రాజీనామా చేశారు. పూనమ్ కౌర్ తనకు అన్యాయం జరిగిందని ట్విటర్‌లో చెప్పితే ఎలా? లిఖిత పూర్వకంగా తనపై జరిగిన హింసని చెబితేనే కదా? జానీ మాస్టర్‌కి ఇటీవల కేంద్రం ప్రకటించిన ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డ్‌ని ఈ లైంగిక వేధింపుల కేసు విచారణ ముగిసే వరకు ఇవ్వకూడదని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రికి డిమాండ్ చేస్తున్నాం.
షూటింగ్స్ జరిగే ప్రదేశాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసి ఇలాంటి వేధింపులను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఓ చట్టం తీసుకురావాలి. వానిటీ వెహికల్ తదితర సౌకర్యాల్ని తమిళనాడు లాగా నిర్మాతలు వెంటనే రద్దు చేయలి. ఈ లైంగి వేధింపుల కేసు తేలే వరకు జానీ మాస్టర్‌కు చిత్ర పరిశ్రమలో అవకాశాలు ఇవ్వకూడదని కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment