kethi reddy jagadeshwarreddy
-
సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి: కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
చాలా రంగాల్లో లైగిక వేధింపులు ఎక్కువగా అవుతున్నాయి. కొందరు ధైర్యం చేసి కంప్లైంట్స్ ఇస్తున్నారు. మరికొందరు ఎవరికీ చెప్పలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. మహిళలపై గతంలో జరిగిన, ఇప్పుడు జరుగుతున్న హింసపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రిటైర్డ్ నాయమూర్తి ఆధ్వర్యంలో ఓ కమిటీ నియమించి మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ఉక్కుపాదం మోపాలని తెలుగు భాషా పరిరక్షణ వేదిక కన్వీనర్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఓ ప్రకటనలో కోరారు.కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఏం చెప్పారంటే?కేరళలో హేమ కమిటీ రిపోర్ట్ రిలీజైన వెంటనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ లాల్ తన పదవికి రాజీనామా చేశారు. పూనమ్ కౌర్ తనకు అన్యాయం జరిగిందని ట్విటర్లో చెప్పితే ఎలా? లిఖిత పూర్వకంగా తనపై జరిగిన హింసని చెబితేనే కదా? జానీ మాస్టర్‌కి ఇటీవల కేంద్రం ప్రకటించిన ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డ్‌ని ఈ లైంగిక వేధింపుల కేసు విచారణ ముగిసే వరకు ఇవ్వకూడదని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రికి డిమాండ్ చేస్తున్నాం.షూటింగ్స్ జరిగే ప్రదేశాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసి ఇలాంటి వేధింపులను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఓ చట్టం తీసుకురావాలి. వానిటీ వెహికల్ తదితర సౌకర్యాల్ని తమిళనాడు లాగా నిర్మాతలు వెంటనే రద్దు చేయలి. ఈ లైంగి వేధింపుల కేసు తేలే వరకు జానీ మాస్టర్‌కు చిత్ర పరిశ్రమలో అవకాశాలు ఇవ్వకూడదని కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి చెప్పుకొచ్చారు. -
సేవా తత్పరుడు జేఎస్ రెడ్డి
శివాజీనగర: జేఎస్ రెడ్డిగా అందరికీ సుపరిచితులైన జక్కా శ్రీనివాసులురెడ్డి గొప్ప సేవా తత్పరుడని ప్రముఖులు అన్నారు. ఈ నెల 1వ తేదీన బెంగళూరులో తుదిశ్వాస విడిచిన జేఎస్ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమాన్ని బుధవారం బెంగళూరులోని ఇందిరా నగర్ క్లబ్లో నిర్వహించారు. మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుతో పాటు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్ర«భాకర్‌రెడ్డి, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే జే.కే.రెడ్డి, బెంగళూరు తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్ ఏ.రాధాకృష్ణరాజు, వైఎస్సార్సీపీ నాయకుడు భక్తవత్సలరెడ్డి, భాస్కర్‌రెడ్డి, వెంకట్, నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, బెంగళూరుకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని జేఎస్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. సమాజానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. సినీ నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ జేఎస్ రెడ్డి తన పుట్టినగడ్డకు విశేష సేవలు అందించారన్నారు. జేఎస్ రెడ్డి ఉత్తమ వ్యక్తిత్వం కలిగి స్వశక్తితో ఎదిగారన్నారు. కాంట్రాక్టర్‌గా ఆయన ప్రతిభ అపారమన్నారు. గుజరాత్లో నర్మదా నది కాలువల నిర్మాణంలో ఆయన ప్రతిభను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెచ్చుకొని జేఎస్ రెడ్డిని ప్రభుత్వం తరఫున సన్మానించారన్నారు. కాంట్రాక్టర్లకు అలాంటి గౌరవం దక్కడం అరుదైన విషయమన్నారు. కర్ణాటక రీజియన్‌లో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించిన వ్యాపారవేత్తగా ఆయనకు బిరుదు లభించిందన్నారు. రెడ్‌క్రాస్ ఆస్పత్రి భవన నిర్మాణానికి సొంత డబ్బు వెచ్చించడమే కాకుండా ఆస్పత్రి నిర్వహణను చూశారన్నారు. క్యాన్సర్ ఆస్పత్రిలో తన సొంత డబ్బుతో వేలాది మంది పేద రోగులకు వైద్యం అందించేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. కోట్ల రూపాయలతో చిల్డ్రన్స్ పార్కు నిర్మించారన్నారు. రైతుల సంక్షేమానికి దాదాపు రూ.15 కోట్లు వ్యయం చేశారన్నారు. ఎన్నో అభివృద్ధి పనులకు సహకరించారన్నారు. దాన ధర్మాలు సమాజ బాధ్యతగా భావించారన్నారు. ఆయన మృతి నెల్లూరు జిల్లాకు తీరని లోటని స్మరించుకున్నారు. జేఎస్ రెడ్డి మృతి సమాజానికి తీరని లోటు: ఎం.వెంకయ్య నాయుడు జేఎస్ రెడ్డి తనకు మంచి మిత్రుడని, గొప్ప సేవాతత్పరుడని, ఆయన మృతి వారి కుటుంబానికి, సమాజానికి పెద్ద లోటని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. జేఎస్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులరి ్పంచి మాట్లాడారు. జేఎస్ రెడ్డి భౌతికంగా లేకపోయినా అందరి హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారన్నారు. పెద్దల మాటలను గౌరవిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. జేఎస్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రారి్థస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. కార్యక్రమంలో జేఎస్ రెడ్డి కుమారుడు భక్తవత్సలరెడ్డి, కుమార్తె ఇందిర తదితరులు పాల్గొన్నారు. -
Bigg Boss6 : నాగార్జునకు ఏపీ హైకోర్టు నోటీసులు
బిగ్‌బాస్ షో నిలిపివేయాలంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్జంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ చేపట్టింది. అంతకుముందు విచారణలో భాగంగా.. బిగ్ బాస్ తెలుగు షోపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కనీసం రెండు లేదా మూడు ఎపిసోడ్లను చూస్తామని చెప్పిన ధర్మాసనం.. నేడు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హీరో నాగార్జునతో పాటు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, షో నిర్మాహకులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. అశ్లీల, అనైతిక, హింసాత్మక చర్యలను ప్రోత్సహిస్తున్న బిగ్‌బాస్ షో ప్రసారాన్ని నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 2019లో కూడా ప్రజాప్రయోజన వాజ్జం వేశాడు. రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం గతంలో విచారణ జరిపి.. ‘బిగ్‌బాస్ రియాలిటీ షోపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలు అందులో ఏముందో తెలుసుకునేందుకు తామూ రెండు మూడు ఎపిసోడ్లు చూస్తామని తెలిపింది. ఎలాంటి సెన్సార్షిప్ లేకుండా ఈ షో ప్రసారమవుతోందని పిటిషనర్ ఆరోపిస్తున్నందున, ఈ షో పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. నేడు మరోసారి విచారణ జరిపి.. షో నిర్వాహకులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. -
తెలంగాణలోనూ ఆన్లైన్ టికెట్ విధానం పెట్టండి: నిర్మాత
సాక్షి, హైదరాబాద్: సినిమా ఆన్లైన్ టికెట్ విధానాన్ని తెలంగాణలో కూడా తీసుకురావాలని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదిరిగా సినిమా టికెట్లను ఆన్లైన్లో అమ్మే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
జగన్‌గారి దృష్టికి చిత్రపరిశ్రమ సమస్యలు
‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారి దృష్టికి చిత్ర సమస్యలు, చిన్న నిర్మాతల కష్టాలను తీసుకెళ్లి, పరిష్కారం కోసం కృషి చేస్తా’’ అని ‘తమిళనాడు తెలుగు యువశక్తి’ అధ్యక్షుడు, సినీ దర్శక–నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. జనవరి 5న తన పుట్టినరోజుని పురస్కరించుకుని ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ– ‘‘సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌లో స్థిరపడేందుకు ‘తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ను స్థాపించాం. ఎలాంటి చర్యలు చేపడితే చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌లో చిగురిస్తుందో త్వరలో జగన్‌గారిని కలిసి వివరించనున్నాం. ఏపీలో సినిమా రంగం అభివృద్ధికి జగన్‌గారు ఎలాంటి సహాయ, సహకారాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. కాగా, త్వరలోనే ఒక వెబ్ సిరీస్ చేయనున్నా. ‘తమిళనాడు తెలుగు యువశక్తి’ అధ్యక్షుడిగా చెన్నైలోని లె లుగువారి సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు చేస్తున్నా’’ అన్నారు. -
జగన్ నిర్ణయం బాగుంది : కేతిరెడ్డి
సాక్షి, చెన్నై : ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల నిర్ణయం చాలా గొప్పదని, దీంతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందని సినీ నిర్మాత, దర్శకుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. అందులో.. ప్రజాస్వామ్య పరిరక్షకులందరూ తమ ఎజెండాలను పక్కనపెట్టి మూడు రాజధానుల అంశాన్ని స్వాగతించాలి. అధికారాన్ని సమానంగా పంచనప్పుడు ప్రత్యేక రాష్ట్ర నినాదాలు వస్తాయి. అందుకు ఉదాహరణగా తెలంగాణ, ఉత్తరాంచల్, చత్తీస్‌గఢ్, గుజరాత్ రాష్ట్రాలను చెప్పవచ్చు. ప్రతిపక్ష పార్టీలకు అధికార పార్టీలో లోపాలేవీ కనిపించనప్పుడు వేర్పాటు వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంటాయి. రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర నినాదాన్ని ఇటీవల కొన్ని పార్టీలు ముందుకు తీసుకెళ్లడాన్ని మనం గమనించవచ్చు. అలాంటి వారికి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చెంపపెట్టులాంటిది. ఇప్పటికే కర్ణాటకలో బెంగళూరు, మైసూరులలో రెండు అసెంబ్లీలు, మహారాష్ట్రలో ముంబై, నాగ్‌పూర్‌లలో రెండు అసెంబ్లీలు ఉన్నాయి. హైకోర్టు బెంచ్‌లు తమిళనాడులో చెన్నై, మధురైలలో ఉన్నాయి. మహరాష్ట్రలో ముంబై, నాగ్‌పూర్‌లలో బెంచ్‌లున్నాయి. తమిళనాడులో ముందు నుంచే అభివృద్ధిని చెన్నైకి పరిమితం చేయకుండా ప్రతీ జిల్లాకు సమపాళ్లలో పంచారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధినంతా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కే పరిమితం చేయడం వల్ల తెలంగాణ వాదం బలపడింది. జగన్మోహన్రెడ్డి ఇప్పుడు చేసిన పనిని అప్పటి పాలకులు చేసి ఉంటే విభజన జరిగేది కాదు. అలాగే దక్షిణాదిలో రెండవ రాజధాని, సుప్రీంకోర్టు బెంచ్ పెట్టాలని మేము చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నాం. కానీ, ఏ ప్రభుత్వం కూడా మా డిమాండ్‌ను పట్టించుకోవట్లేదు. దానికి కారణం దక్షిణాదిలో కేవలం 130 ఎంపీ సీట్లు ఉండడమే. ఇప్పుడు మోదీ నాయకత్వంలో అయినా రెండో రాజధానిని దక్షిణాదిలో ఏర్పాటు చేయాలని కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి కోరారు. -
జయలలిత ఎప్పటికీ బతికే ఉంటారు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తమిళంలో పలు చిత్రాలు తయారవుతున్నాయి. లేటెస్ట్గా దర్శకుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ‘శశిలలిత’ టైటిల్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జయలలితగా కాజోల్ దేవగన్, శశికళగా అమలాపాల్ నటిస్తారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఫస్ట్ లుక్ టైటిల్‌ను శనివారం హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజేపీ నాయకులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘కేవలం తమిళనాడు మాత్రమే కాకుండా మొత్తం దక్షిణాదిలో అభిమానులను సొంతం చేసుకున్నారు జయలలిత. సినీ, రాజకీయ, సేవా రంగాల్లో విశిష్ట గుర్తింపు పొందారామె. ‘శశిలలిత’ చిత్రం రూపొందించడం అభినందనీయం. వాస్తవికతకు దగ్గరగా ఉంటుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. ‘‘జయలలిత ఎప్పటికీ ప్రజల గుండెల్లో బతికే ఉంటారు. ఆమె బాల్యం, సినీనటిగా ఎదగడం, ప్రేమ విఫలం, రాజకీయ నాయకురాలిగా ఆమె ఎదుర్కొన్న అవమానాలు, ఆమె మరణం వెనుక ఉన్న కారణం, 75 రోజులు ఆసుపత్రిలో ఉన్న సంఘటనలు ఈ సినిమాలో ప్రస్తావిస్తాం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి. కో–డైరెక్టర్ శివకుమార్, రైటర్ వెంకట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
డ్రగ్స్ కేసుపై సుప్రీం విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు చలన చిత్ర పరిశ్రమను కుదిపేసిన మాదకద్రవ్యాల కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ దీపక్ మిశ్రా సోమవారం విచారణ చేపట్టారు. మాదకద్రవ్యాల కేసుపై సీబీఐ ధర్యాప్తు చేపట్టాలని కోరుతూ సినీ నిర్మాత, తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై గతంలో విచారించిన ధర్మాసనం మాదకద్రవ్యాల వాడకంను అరికట్టెందుకు ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించి, వాటిని అములు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే వాటిని అమలు చేయడానికి తమకు కొంత సమయం కావాలని ప్రభుత్వం తరుఫున అదనపు సోలిసిటర్ జనరల్ మనిందర్ సింగ్ కోర్టును కోరారు. దీంతో సోమవారం మళ్లీ విచారణ చేపట్టిన న్యాయస్థానం, ప్రభుత్వం మరింత సమయం కోరడంతో ఈ కేసును ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. దీనిపై కేతిరెడ్డి మాట్లాడుతూ.. అసలు మాదక ద్రవ్యాలతో ఎవరెవరకి సంబంధం ఉందని తెలుసుకోవడం కోసం సీబీఐ విచారణ కోరుతూ గతంలో కోర్టులో పిటిషన్ వేశానన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రిని కూడా కోరారని ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు 18 రాష్ట్రాలను ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చానని తెలిపారు. టీవీల్లో డ్రగ్స్ వాడకంపై పరిమితులు విధించాలని.. పబ్స్‌పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని పిటిషన్లో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. చదువుల పేరుతో విదేశీయులు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత భారతదేశంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు. -
కేసీఆర్.. మా ఉద్యమానికి అండగా ఉండండి
తిరుమల : తెలంగాణ సీఎం కేసీఆర్‌ను తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తిరుమలలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నో ఏళ్లుగా తెలుగు భాష కోసం తాము చేస్తున్న పోరాటానికి కేసీఆర్ సహకారం కోరడానికి తమిళనాడు నుంచి కేతిరెడ్డితో పాటూ పెద్ద ఎత్తున తెలుగు అభిమానులు తరలివచ్చారు. తమిళనాడులో రద్దు చేసిన తెలుగు భాష పునరుద్ధరణ కోసం కృషి చేయాలని కేసీఆర్‌ను కేతిరెడ్డి కోరారు. తాము చేస్తున్న ఉద్యమానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై చర్చించడానికి తెలుగు సంఘాల నాయకులు హైదరాబాద్‌కు రావాలని కేసీఆర్ వారితో అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఉద్యమం, జల్లికట్టు ఉద్యమం కన్నా ఎంతో బలమైనదని కేతిరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత కూడా మద్దతు తెలపడం వారి ఉద్యమ స్పూర్తికి నిదర్శనమన్నారు. తమిళనాడులోని తెలుగు వారికి స్పూర్తి కలిగించాలని కోరటానికి వచ్చామని, అందులో భాగంగా ఆయనకు స్వాగత ఏర్పాట్లు చేయడానికి తమిళనాడు నుంచి తెలుగు అభిమానులు తరలివచ్చారని తెలిపారు.