సేవా తత్పరుడు జేఎస్‌ రెడ్డి js reddy Tributes of picture | Sakshi
Sakshi News home page

సేవా తత్పరుడు జేఎస్‌ రెడ్డి

Published Thu, May 16 2024 12:17 PM

js reddy Tributes of  picture

శివాజీనగర: జేఎస్‌ రెడ్డిగా అందరికీ సుపరిచితులైన జక్కా శ్రీనివాసులురెడ్డి గొప్ప సేవా తత్పరుడని ప్రముఖులు అన్నారు. ఈ నెల 1వ తేదీన బెంగళూరులో తుదిశ్వాస విడిచిన జేఎస్‌ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమాన్ని బుధవారం బెంగళూరులోని ఇందిరా నగర్‌ క్లబ్‌లో నిర్వహించారు. మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుతో పాటు నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు ఆదాల ప్ర«భాకర్‌రెడ్డి, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే జే.కే.రెడ్డి, బెంగళూరు తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్‌ ఏ.రాధాకృష్ణరాజు, వైఎస్సార్‌సీపీ నాయకుడు భక్తవత్సలరెడ్డి, భాస్కర్‌రెడ్డి, వెంకట్, నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, బెంగళూరుకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని జేఎస్‌ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. 

సమాజానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.  సినీ నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ జేఎస్‌ రెడ్డి తన పుట్టినగడ్డకు విశేష సేవలు అందించారన్నారు. జేఎస్‌ రెడ్డి ఉత్తమ వ్యక్తిత్వం కలిగి స్వశక్తితో ఎదిగారన్నారు. కాంట్రాక్టర్‌గా ఆయన ప్రతిభ అపారమన్నారు. గుజరాత్‌లో నర్మదా నది కాలువల నిర్మాణంలో ఆయన ప్రతిభను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెచ్చుకొని జేఎస్‌ రెడ్డిని ప్రభుత్వం తరఫున సన్మానించారన్నారు. కాంట్రాక్టర్లకు అలాంటి గౌరవం దక్కడం అరుదైన విషయమన్నారు. కర్ణాటక రీజియన్‌లో  అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించిన వ్యాపారవేత్తగా ఆయనకు బిరుదు లభించిందన్నారు. 

రెడ్‌క్రాస్‌ ఆస్పత్రి భవన నిర్మాణానికి సొంత డబ్బు వెచ్చించడమే కాకుండా ఆస్పత్రి నిర్వహణను చూశారన్నారు. క్యాన్సర్‌ ఆస్పత్రిలో తన సొంత డబ్బుతో వేలాది మంది పేద రోగులకు వైద్యం అందించేందుకు కృషి చేశారని గుర్తు చేశారు.   కోట్ల రూపాయలతో చిల్డ్రన్స్‌ పార్కు నిర్మించారన్నారు.  రైతుల సంక్షేమానికి  దాదాపు రూ.15 కోట్లు వ్యయం చేశారన్నారు. ఎన్నో అభివృద్ధి పనులకు సహకరించారన్నారు. దాన ధర్మాలు సమాజ బాధ్యతగా భావించారన్నారు. ఆయన మృతి నెల్లూరు జిల్లాకు తీరని లోటని స్మరించుకున్నారు. 

జేఎస్‌ రెడ్డి మృతి సమాజానికి తీరని లోటు:     ఎం.వెంకయ్య నాయుడు 
జేఎస్‌ రెడ్డి తనకు మంచి మిత్రుడని, గొప్ప సేవాతత్పరుడని, ఆయన మృతి వారి కుటుంబానికి, సమాజానికి పెద్ద లోటని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. జేఎస్‌ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి  నివాళులరి ్పంచి మాట్లాడారు. జేఎస్‌ రెడ్డి భౌతికంగా లేకపోయినా అందరి హృదయాల్లో శాశ్వత  స్థానం సంపాదించుకున్నారన్నారు. పెద్దల మాటలను గౌరవిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. జేఎస్‌ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రారి్థస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు.  కార్యక్రమంలో జేఎస్‌ రెడ్డి కుమారుడు భక్తవత్సలరెడ్డి, కుమార్తె ఇందిర తదితరులు పాల్గొన్నారు.    

 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement