పురుషుల వేషాల్లో చోరీలకు | - | Sakshi
Sakshi News home page

పురుషుల వేషాల్లో చోరీలకు

Published Thu, May 1 2025 12:22 AM | Last Updated on Thu, May 1 2025 12:22 AM

పురుష

పురుషుల వేషాల్లో చోరీలకు

బనశంకరి: రాష్ట్రంలో అబలలపై లైంగిక వేధింపులు, అత్యాచారం, వరకట్న దాడులు వంటి అనేక రకాల నేరాలపై పోలీస్‌ స్టేషన్లలో వేలాది కేసులు నమోదు అవుతున్నాయి. కానీ శిక్ష పడుతున్న నిందితులు ఎంతమంది అనేది తెలుసుకుంటే నివ్వెరపోవడం ఖాయం. చాలా కేసుల్లో నిందితులు దర్జాగా బయటపడుతున్న దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది.

● ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో 2023 నుంచి 2025 ఫిబ్రవరి వరకు 25,700 కేసులు నమోదయ్యాయి. ఇందులో 39 కేసుల్లో మాత్రమే శిక్ష విధించగా, 966 కేసులు వీగిపోయాయి. మిగతావి విచారణలో ఉన్నాయి.

● లైంగిక వేధింపులు, భార్యలపై భర్తల దాడులు, అధిక కట్న కోసం వేధింపులు కేసులు ఇందులో ఉన్నాయి. నిందితులు కొన్నాళ్లపాటు అరెస్టవుతారు, విడుదలయ్యాక ఏ భయమూ ఉండదు.

● 2023లో లైంగిక వేధింపుల కేసుల్లో 19 కేసుల్లో శిక్షలు పడగా, 400 కేసుల్లో ఫలితం లేదు.

● అత్యాచార కేసుల్లో ఒక్క శిక్ష పడకపోవడం విశేషం. పైగా 33 రేప్‌ కేసుల్లో నిందితులకు క్లీన్‌చిట్‌ లభించింది.

● భార్యలపై దాడులకు పాల్పడిన కేసుల్లో 241 కొట్టివేయగా, 7 కేసుల్లో మాత్రమే శిక్షపడింది.

● వరకట్నం వేధింపుల కేసుల్లో ఒకరికి శిక్షపడగా 167 కేసులు వీగిపోయాయి. 6 వరకట్న చావుల కేసుల్లోనూ ఆధారాలు లేవంటూ నిందితులు తప్పించుకున్నారు.

ఈ ఏడాది ఒక్కటీ లేదు

● 2024 లైంగిక వేధింపులకు సంబంధించి 8 కేసుల్లో కోర్టు శిక్ష విధించింది. కానీ 57 కేసులు వీగిపోయాయి. క్రమంగా 7,1,11 కేసుల్లో నిందితులకు క్లీన్‌చిట్‌ లభించింది. భర్తల దౌర్జన్యాల కేసుల్లో నలుగురికి శిక్ష పడగా 43 కేసులను కొట్టేశారు. 2025లో ఇలాంటి కేసుల్లో ఇప్పటివరకు ఒక్క కేసులోనూ శిక్ష పడలేదు.

నివారణ చర్యలు

కోర్టుల్లో కేసులు వీగిపోతుండగా దీనిని అడ్డుకోవడానికి సర్కారు కొన్ని చర్యలు తీసుకుంటోంది. పోలీసులు మరింత పటిష్టంగా దర్యాప్తు చేయడానికి 206 సీన్‌ ఆఫ్‌ క్రైం (సోకో) అధికారులను అన్ని శాఖల్లో భర్తీచేసింది. సాక్ష్యాధారాలను సేకరించి కేసులో శిక్ష పడేలా చూడడమే వారి పని. పోలీసులు, న్యాయవాదుల మధ్య సమన్వయం, నిందితులు, సాక్షుల ట్రాకింగ్‌, ఇంకా పలు నూతన చర్యలను చేపట్టే పనిలో ఉంది.

కారణాలు ఏమిటి?

● లైంగిక వేధిపులు, కట్న వేధింపులని కొందరు తప్పుడు కేసులు పెట్టడం

● ఆరోపణలు రుజువు చేసే సాక్ష్యాధారాలు లోపించడం

● కోర్టు విచారణకు ఫిర్యాదుదారులు, సాక్షులు గైర్హాజరు, నిందితుల పరారు తదితరాలు.

సాఫీగా సాగాల్సిన

సంసారంలో అలజడులు ఎన్నో

బొమ్మనహళ్లి: విచిత్రమైన మహిళా దొంగల ఉదంతమిది. ఆటోలో తిరుగుతూ అనువైన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న మహిళ, యువతిని బెంగళూరు బొమ్మనహళ్ళి పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు నీలోఫర్‌, షబ్రీన్‌ తాజ్‌ కాగా, వారు ఆటోల్లో పురుషుల వేషధారణలో సంచరిస్తూ డబ్బు బంగారాన్ని కొట్టేయడం విశేషం. నీలోఫర్‌, షబ్రీన్‌ తాజ్‌ కలిసి ఈజీ మనీ కోసం దొంగతనాల బాట పట్టారు. మార్చి 17వ తేదీన బొమ్మనహళ్ళిలో ఓ ఇంటి తాళం పగలగొట్టి చొరబడ్డారు. 130 గ్రాముల బంగారు నగలు, రూ. 3 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.

సీసీ కెమెరాల్లో చిత్రాలు

ఫిర్యాదు మేరకు బొమ్మనహళ్ళి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల చిత్రాల ఆధారంగా ఇద్దరినీ పట్టుకున్నారు. ఆ చిత్రాల్లో వీరు ప్యాంటు, షర్టు ధరించి మగవారిలా కనిపించారు. చివరకు ఇద్దరూ మహిళలేనని ఖాకీలు తెలుసుకున్నారు. మైకోలేఔట్‌ ఠాణా పరిధిలో కూడా ఇదే రీతిలో చోరీ చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. వెండి, బంగారు సొత్తును డిజే హళ్ళి, ట్యానరీ రోడ్డులో ఉన్న బంగారు వ్యాపారులకు కుదువ పెట్టి డబ్బు తీసుకునేవారు. నీలోఫర్‌ వృత్తిరీత్యా దొంగ కాగా, షబ్రీన్‌తాజ్‌ని చోరీలకు ఒప్పించింది. నీలోఫర్‌ గతేడాది దొంగతనం కేసులో బాగలకుంటె పోలీసులకు చిక్కి జైలుకెళ్లింది. విడుదలయ్యాక పాత వృత్తిని వదల్లేదని పోలీసులు తెలిపారు.

వేధింపులు, అత్యాచారం, హత్యలు, కట్నం కేసుల్లో నిందితులు కులాసా

చాలా తక్కువగా శిక్షలు

బెంగళూరులో అత్యధిక నేరాలు

రెండేళ్లలో 39 కేసుల్లోనే ఖరారు

కుమిలిపోతున్న బాధితులు

ఇద్దరు మహిళా దొంగల వింత పంథా

పురుషుల వేషాల్లో చోరీలకు 1
1/4

పురుషుల వేషాల్లో చోరీలకు

పురుషుల వేషాల్లో చోరీలకు 2
2/4

పురుషుల వేషాల్లో చోరీలకు

పురుషుల వేషాల్లో చోరీలకు 3
3/4

పురుషుల వేషాల్లో చోరీలకు

పురుషుల వేషాల్లో చోరీలకు 4
4/4

పురుషుల వేషాల్లో చోరీలకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement