బిగ్‌బాస్ షో నిలిపివేయాలంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్జంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ చేపట్టింది. అంతకుముందు విచారణలో భాగంగా.. బిగ్ బాస్ తెలుగు షోపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కనీసం రెండు లేదా మూడు ఎపిసోడ్‌లను చూస్తామని చెప్పిన ధర్మాసనం.. నేడు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హీరో నాగార్జునతో పాటు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, షో నిర్మాహకులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
అశ్లీల, అనైతిక, హింసాత్మక చర్యలను ప్రోత్సహిస్తున్న బిగ్‌బాస్ షో ప్రసారాన్ని నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 2019లో కూడా ప్రజాప్రయోజన వాజ్జం వేశాడు. రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం గతంలో విచారణ జరిపి.. ‘బిగ్‌బాస్ రియాలిటీ షోపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలు అందులో ఏముందో తెలుసుకునేందుకు తామూ రెండు మూడు ఎపిసోడ్లు చూస్తామని తెలిపింది. ఎలాంటి సెన్సార్‌షిప్ లేకుండా ఈ షో ప్రసారమవుతోందని పిటిషనర్ ఆరోపిస్తున్నందున, ఈ షో పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. నేడు మరోసారి విచారణ జరిపి.. షో నిర్వాహకులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment