బిగ్‌బాస్ హౌస్‌లో ఆదివారం తమన్నా సందడి చేసింది. తమన్నా లేటెస్ట్ మూవీ బబ్లీ బౌన్సర్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఆదివారం బిగ్‌బాస్ షోకి వెళ్లింది. ఆమె చేతిలో ఓ కానుక పెట్టి బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపాడు నాగార్జున. తర్వాత హౌస్‌లో ఉన్న బాయ్స్ అంతా..లేడి కంటెసెంట్స్‌లో ఎవరు బౌన్సర్ కావాలనుకుంటున్నారో చెప్పి వారి చేతికి బ్యాండ్ కట్టాలని చెప్పాడు. దీంతో ఒక్కోక్కరు తమకు నచ్చిన కంటెస్టెంట్‌కి బ్యాండ్ కట్టారు. చలాకీ చంటి ఫైమా బౌన్సర్ కావాలని కోరుకున్నాడు.
ఎందుకు ఫైమాను ఎంచుకున్నాడో వివరిస్తూ..రాత్రి పూట రాజ్ ఒక రకంగా పడుకుంటున్నాడని, తన దుప్పటి, దిండు రెండూ మాయమవుతున్నాయని చెప్పాడు ‘ఫైమా ఏ విధంగా నిన్ను కాపాడుతుంది?’అని నాగార్జున అడగ్గా..‘వాడు భయపడేది దీనికి(ఫైమా) ఒక్కదానికే సర్’అని చంటి చెప్పడంతో తమన్నా, నాగ్‌లతో సహా అంతా ఘొల్లున నవ్వారు.
(చదవండి: షానీ ఔట్.. మాట లేదు, ఆటా లేదు..ఇంత సాదాసీదా వీడ్కోలా?)
ఇక అర్జున్ కల్యాణ్ తన చాయిస్‌గా గీతూ, శ్రీసత్యలను ఎంచుకున్నట్లు చెప్పగానే బిగ్‌బాస్ షోకి వెళ్లిన ఆడియన్స్ అంతా గట్టిగా ఈళలు వేశారు. వారిని చూసి ఏంటి ఇంత స్పందన అని నాగ్ అడగ్గా...‘వారి మధ్య ఏదో ఉంది’ అని ఓ యువతి చెప్పడంతో అందరూ గట్టిగా నవ్వారు. ‘అదేం లేదు సర్.. మేం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే’ అని అర్జున్ అంటే.. నేను ఏమన్నా అన్నానా అని నాగ్ నవ్వాడు. ఇక తమన్నా అయితే..‘ఎన్ని సినిమాల్లో మేము యాక్ట్ చేయలేదు..మొదట్లో ఫ్రెండ్స్ తర్వాత... అంటూ వారిని మరింత ఎంకరేజ్ చేసింది. ఈ దెబ్బతో నిజంగానే వారి మధ్య ప్రేమ చిగురిస్తుందా లేదా చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment