
పోస్టర్ రిలీజ్ చేస్తున్న కేతిరెడ్డి
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తమిళంలో పలు చిత్రాలు తయారవుతున్నాయి. లేటెస్ట్‌గా దర్శకుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ‘శశిలలిత’ టైటిల్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జయలలితగా కాజోల్ దేవగన్, శశికళగా అమలాపాల్ నటిస్తారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఫస్ట్ లుక్ టైటిల్‌ను శనివారం హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజేపీ నాయకులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘కేవలం తమిళనాడు మాత్రమే కాకుండా మొత్తం దక్షిణాదిలో అభిమానులను సొంతం చేసుకున్నారు
జయలలిత. సినీ, రాజకీయ, సేవా రంగాల్లో విశిష్ట గుర్తింపు పొందారామె. ‘శశిలలిత’ చిత్రం రూపొందించడం అభినందనీయం. వాస్తవికతకు దగ్గరగా ఉంటుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. ‘‘జయలలిత ఎప్పటికీ ప్రజల గుండెల్లో బతికే ఉంటారు. ఆమె బాల్యం, సినీనటిగా ఎదగడం, ప్రేమ విఫలం, రాజకీయ నాయకురాలిగా ఆమె ఎదుర్కొన్న అవమానాలు, ఆమె మరణం వెనుక ఉన్న కారణం, 75 రోజులు ఆసుపత్రిలో ఉన్న సంఘటనలు ఈ సినిమాలో ప్రస్తావిస్తాం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి. కో–డైరెక్టర్ శివకుమార్, రైటర్ వెంకట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment