నాలుగు దశలు.. నాలుగు గెటప్పులు | Kangana Ranaut on Jayalalitha biopic Thalaivi | Sakshi
Sakshi News home page

నాలుగు దశలు.. నాలుగు గెటప్పులు

Sep 13 2019 3:05 AM | Updated on Sep 13 2019 3:05 AM

Kangana Ranaut on Jayalalitha biopic Thalaivi - Sakshi

కంగనా రనౌత్‌

తమిళ తలైవి (నాయకురాలు) జయలలిత పాత్రలోకి వెళ్లడానికి తయారవుతున్నారు కంగనా రనౌత్‌. నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఈ పాత్ర కోసం  క్లాసికల్‌ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంటున్నారు కంగనా. తాజాగా ఈ సినిమాలో కంగనా నాలుగు విభిన్న గెటప్పుల్లో కనిపిస్తారని తెలిసింది. ఏ.ఎల్‌. విజయ్‌ దర్శకత్వంలో విష్ణు ఇందూరి నిర్మిస్తారు.

ఈ సినిమాలో కంగనా మేకప్‌ కోసం హాలీవుడ్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ జాసన్‌ కోలిన్స్‌ వర్క్‌ చేయనున్నారు. జాసన్‌ ఇది వరకు ‘బ్లేడ్‌ రన్నర్, కెప్టెన్‌ మార్వెల్, హంగర్‌ గేమ్స్‌’ వంటి హాలీవుడ్‌ సినిమాలకు మేకప్‌ వర్క్‌ చేశారు. దీపావళి తర్వాత ‘తలైవి’ రెగ్యులర్‌ షూట్‌ ఆరంభం కానుందని సమాచారం. కంగనా నాలుగు గెటప్పుల్లో కనిపిస్తారంటే జయ జీవితాన్ని నాలుగు దశలుగా చూపిస్తారనుకోవచ్చు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement