‘అమ్మ’ పాత్ర కోసం అంత తీసుకుంటుందా..? | Is Kangana Ranaut Takes 24 Crore Rupees For Jayalalitha Biopic | Sakshi
Sakshi News home page

తలైవి చిత్రం కోసం కంగనాకు భారీ పారితోషికం

Mar 26 2019 9:00 AM | Updated on Mar 26 2019 9:01 AM

Is Kangana Ranaut Takes 24 Crore Rupees For Jayalalitha Biopic - Sakshi

సినీ నటి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన సంచలన నారీమణి జయలలిత బయోపిక్‌ను తెరకెక్కించడానికి ఇప్పుడు పోటీ నెలకొంది. ఇప్పటికే రెండు చిత్రాలు, ఒక వెబ్‌ సీరియల్‌ నిర్మాణం జరుగుతున్నాయి. వాటిలో దర్శకుడు మిష్కిన్‌ శిష్యురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్‌ లేడీ’ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అందులో జయలలితగా నటి నిత్యామీనన్‌ నటిస్తోంది. దర్శకుడు విజయ్‌ కూడా జయలలిత జీవిత చరిత్రను రూపొందించనున్నారు. దీనికి ‘తలైవి’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులోనే టైటిల్‌ పాత్రకు కంగనా రనౌత్‌ను ఎంపిక చేశారు.

అయితే ‘తలైవి’ పాత్ర కోసం నటి కంగనా రనౌత్‌ పుచ్చుకుంటున్న పారితోషికాన్ని దక్షిణాదిలో ఇంతవరకూ ఏ అగ్రనటి తీసుకోలేదంట. ఈ పాత్ర కోసం కంగనాకు అక్షరాలా రూ.24 కోట్ల పారితోషికాన్ని అందజేస్తున్నట్లు సమాచారం. దక్షిణాదిలో ఇంతవరకూ ఏ హీరోయిన్‌ ఇంత భారీ పారితోషికం తీసుకోలేదన్నది గమనార్హం. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హింది భాషల్లో నిర్మించనున్నారు.  ప్రస్తుతం కంగనా మెంటల్‌ హై క్యా, పంగా అనే హింది చిత్రాల్లో నటిస్తోంది. అవి పూర్తి కాగానే తలైవి చిత్రంలో నటించనుందని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement