
కంగనా రనౌత్
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సీయంగా ప్రమాణస్వీకారం చేయడానికి రంగం సిద్ధం అయ్యింది. ఆల్రెడీ దేశంలో మస్త్ ఎలక్షన్ మజా నడుస్తోంది. కంగన ఏమైనా పాలిటిక్స్ వైపు కన్నేశారా? ఏ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు? అని ఆలోచనలో పడకండి. ఎందుకంటే అలాంటిది ఏమీ లేదు. కంగనా ప్రమాణస్వీకారం చేయబోతున్నది వెండితెరపై. తమిళనాడు మాజీ సీయం జయలలిత జీవితం ఆధారంగా ఏఎల్. విజయ్ దర్శకత్వంలో ‘తలైవి’ (నాయకురాలు) అనే బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. హిందీలో ‘జయ’ అనే టైటిల్ పెట్టారు. శైలేష్ ఆర్ సింగ్, విష్ణువర్థన్ ఇందూరి నిర్మించనున్నారు. విజయేంద్రప్రసాద్ కథ అందిస్తారు.
ఈ బయోపిక్‌లో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటించబోతున్నట్లు శనివారం అధికారిక ప్రకటన వెల్లడైంది. ‘‘మన దేశంలో అత్యంత విజయవంతమైన మహిళా నాయకురాలు జయలలితగారు. వెండితెరపై సూపర్‌స్టార్‌గా ఎదిగి తర్వాత రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఈ మెగా ప్రాజెక్ట్‌లో నా భాగస్వామ్యం ఉండబోతున్నందుకు ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు కంగన. ‘‘జయలలితగారి బయోపిక్‌ను తెరకెక్కించడాన్ని ఓ బాధ్యతగా భావిస్తున్నాను. చాలా జాగ్రత్తగా నిజాయతీగా తెరకెక్కిస్తాం. డైనమిక్ లీడర్ పాత్రలో ప్రతిభావంతురాలైన కంగనా రనౌత్ నటించనున్నారు. చాలా ఆనందంగా ఉంది’’ అని ఏఎల్. విజయ్ అన్నారు. అలాగే శనివారం కంగనా రనౌత్ పుట్టినరోజు. 32వ వసంతంలోకి అడుగుపెట్టారామె.
Comments
Please login to add a commentAdd a comment