‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిగారి దృష్టికి చిత్ర సమస్యలు, చిన్న నిర్మాతల కష్టాలను తీసుకెళ్లి, పరిష్కారం కోసం కృషి చేస్తా’’ అని ‘తమిళనాడు తెలుగు యువశక్తి’ అధ్యక్షుడు, సినీ దర్శక–నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. జనవరి 5న తన పుట్టినరోజుని పురస్కరించుకుని ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ– ‘‘సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌లో స్థిరపడేందుకు ‘తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ను స్థాపించాం. ఎలాంటి చర్యలు చేపడితే చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌లో చిగురిస్తుందో త్వరలో జగన్‌గారిని కలిసి వివరించనున్నాం. ఏపీలో సినిమా రంగం అభివృద్ధికి జగన్‌గారు ఎలాంటి సహాయ, సహకారాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. కాగా, త్వరలోనే ఒక వెబ్ సిరీస్ చేయనున్నా. ‘తమిళనాడు తెలుగు యువశక్తి’ అధ్యక్షుడిగా చెన్నైలోని లె లుగువారి సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు చేస్తున్నా’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment