నకిలీ లేఖలతో కోర్టును ఆశ్రయించారు | Natti Kumar Comments On Fake Letters | Sakshi
Sakshi News home page

నకిలీ లేఖలతో కోర్టును ఆశ్రయించారు

Published Fri, Dec 31 2021 5:31 AM | Last Updated on Fri, Dec 31 2021 5:31 AM

Natti Kumar Comments On Fake Letters - Sakshi

సాక్షి, అమరావతి: సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం తెచ్చిన జీవో 35ను రద్దు చేయాలంటూ నకిలీ లేఖలు పెట్టినవారిపై వెంటనే విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాలని సీనియర్‌ నిర్మాత, దర్శకుడు, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్‌ నట్టికుమార్‌ విజ్ఞప్తి చేశా రు. గురువారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జీవో 35 రద్దు కోరు తూ విశాఖపట్నం జిల్లా చోడవరానికి చెందిన పూసర్ల బాబ్జీ ఏపీ హైకోర్టును ఆశ్రయించినట్టు చె ప్పారు. ఏపీలోని దాదాపు 224 మంది ఎగ్జిబిటర్లు జీవో 35కు వ్యతిరేకంగా ఉన్నారంటూ నకిలీ లేఖల ను సృష్టించడంలో ఆయన కీలక పాత్ర పోషించాడని ఆరోపించారు. అంగీకారం తీసుకోకుండా తన థియేటర్‌ పేరిట నకిలీ లేఖలు సృష్టించాడని తెలి పారు. ఈ లేఖల విషయాన్ని విశాఖపట్నం ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు అక్కడి జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం ప్రాంతాల ఎగ్జిబిటర్స్‌ సైతం బాబ్జీపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారని అన్నారు. 

విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సినీ పరిశ్రమ పట్ల సానుకూలంగా ఉన్నప్పటికీ, ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు.  లెసెన్స్‌లు, ఫైర్‌ ఇతర అనుమతులు రెన్యువల్‌కు ప్రభుత్వం థియేటర్ల యాజమాన్యాలకు నెల రోజుల సమయం ఇచ్చిందని చెప్పారు. తెలుగు ఫిలిం ఛాంబర్‌ పెద్దలంతా వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నారని విమర్శించారు. వీరు టికెట్‌ ధరలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారే తప్ప చిన్న నిర్మాతల గురించి పట్టించుకోవడంలేదని అన్నారు. చిన్న సినిమాల కోసం 5వ షోకు అనుమతించాలని కోరారు. తెలంగాణలో టికెట్‌ రేట్లను తగ్గించకపోతే తన చిన్న సినిమాలను అక్కడ రిలీజ్‌ చేయలేనని అన్నారు. 

లైసెన్స్‌ల పునరుద్ధరణకు అనుమతిపై ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కృతజ్ఞతలు
రాష్ట్రంలో ఇటీవల మూసివేసిన కొన్ని థియేటర్ల పునఃప్రారంభం, లైసెన్స్‌ల పునరుద్ధరణకు అనుమతిస్తూ ప్రభుత్వం నెల రోజుల గడువు ఇవ్వడంపై తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి గురువారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలియచేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement