
'సభ్యత్వం పేరిట కుంభకోణానికి పాల్పడ్డారు'
ఫిల్మ్ అసోసియేషన్ లో సభ్యత్వం పేరిట భారీ కుంభకోణం జరిగిందని చిన్న నిర్మాతల మండలి అధ్యక్షుడు నట్టి కుమార్ మండిపడ్డారు.
విశాఖ: ఫిల్మ్ అసోసియేషన్ లో సభ్యత్వం పేరిట భారీ కుంభకోణం జరిగిందని చిన్న నిర్మాతల మండలి అధ్యక్షుడు నట్టి కుమార్ మండిపడ్డారు. అసోసియేషన్ లో సభ్యత్వం పేరిట సుమారు రూ.2 కోట్ల మేర కుంభకోణం జరిగిందన్నారు. ఇందుకు ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వీర్రాజు, ట్రెజరర్ ఎస్ఆర్కే రెడ్డి, మాజీ కార్యదర్శి రాజమాణిక్యం, ఈసీ మెంబర్ జగపతి రాధాకృష్ణలనే కారణమని విమర్శించారు.
సభ్యత్వం పేరిట వసూలు చేసిన సొమ్మును ఎగ్జిబిటర్స్ కు చెల్లించకుండా సొంతఖాతాల్లోకి మళ్లించారని నట్టి కుమార్ ఆరోపించారు. అసోసియేషన్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. 10 రోజుల్లో బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు, పీడీయాక్ట్ విధించాలని నట్టికుమార్ డిమాండ్ చేశారు. సభ్యులపై తీసుకోకుంటే హైకోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు.