నట్టి క్రాంతి, కృష్ణప్రియ
ప్రముఖ నిర్మాత, దర్శకుడు నట్టి కుమార్ తనయుడు నట్టి క్రాంతి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సైకో వర్మ’ (వీడు తేడా). కృష్ణప్రియ, సుపూర్ణ మలకర్ కథానాయికలు. గతంలో నిర్మాతగానే కాకుండా పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన నట్టికుమార్ ‘సైకో వర్మ’ను తెరకెక్కిస్తున్నారు. శ్రీధర్ పొత్తూరి సమర్పణలో అనురాగ్ కంచర్ల, నట్టి కరుణ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
తొలి సన్నివేశానికి నట్టి కరుణ కెమెరా స్విచ్చాన్ చేయగా, సీనియర్ ఫిల్మ్ ఎడిటర్ గౌతంరాజు క్లాప్ ఇచ్చారు. ‘‘ఈ చిత్రంలో రామ్‌గోపాల్ వర్మ అభిమానిగా కనిపిస్తాడు హీరో. రామ్‌గోపాల్ వర్మ కూడా ఈ చిత్రంలో కనిపించనున్నారు’’ అన్నారు నట్టికుమార్. ‘‘డిసెంబర్లో మా సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు నట్టి కరుణ. ఈ చిత్రానికి కెమెరా: జనార్ధననాయుడు, సంగీతం: ఎస్.ఏ.ఖుద్దూస్, లైన్ ప్రొడ్యూసర్స్: ప్రేమ్ సాగర్, రమణా రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment