హీరోయిన్ అంజలి టైటిల్ రోల్‌లో నటించిన హారర్ కామెడీ ఫిల్మ్ 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. ఏప్రిల్ 11న విడుదల కానుంది. ఇలాంటి సమయంలో ఈ చిత్రాన్ని ఆపాలంటూ ఇండస్ట్రీకి చెందిన నట్టి కుమార్ ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాశాడు. దీనికి ప్రధాన కారణం ఈ సినిమాను వైఎస్సార్ సీపీ ఎంపీ సత్యనారాయణ నిర్మించడమే అని తెలుస్తోంది.
ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ సంయుక్తంగా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమాను నిర్మించారు. ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్‌కు నట్టి కుమార్ రాసిన లేఖపై కోన వెంకట్ ఇలా స్పందించారు. ' గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమా గీతాంజలి సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించాం. కానీ ఈ సినిమా విడుదలను ఆపాలంటూ నట్టి కుమార్ ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాశారు. సినిమా విషయంలో ఆయనకు రూల్స్ తెలుసుకుని ఆ లేఖ రాసి ఉంటే బాగుండేది.
ఎలక్షన్ కమిషన్, సెన్సార్ బోర్డు రూల్స్ తెలుసుకుని ఆ నిర్మాత లేఖ రాస్తే బాగుండేది. ఈ సినిమా ఎవరు ఆపినా ఆగేది కాదు. ఎలక్షన్స్‌కు సినిమాలకు దయచేసి ముడిపెట్టొద్దు. సినిమా అనేది ఒక పార్టీకి,కులానికి,మతానికి చెందినది కాదు. ఈ సినిమా కోసం కొన్ని వందలమంది కళాకారులు, టెక్నీషియన్లు పనిచేశారు. దయచేసి సినిమాను రాజకీయం చేయకండి. ఎప్రిల్ 11న ఈ సినిమా తప్పకుండా విడుదల అవుతుంది. సినిమాను ఆపేందుకు ఎవరు అడ్డుపడినా.. ఎంతమంది అడ్డుపడినా.. ఎన్నిరకాలుగా ఇబ్బందులకు గురిచేసినా అనుకున్న రోజే సినిమా విడుదల అయి తీరుతుంది. అని ఆయన తెలిపారు.
‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో నటించిన హారర్ కామెడీ ఫిల్మ్ ‘గీతాంజలి’ (2014) సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే సినిమాను తెరకెక్కించారు. ఇందులో కూడా అంజలి, సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘నిన్నుకోరి’, ‘నిశ్శబ్దం’ సినిమాలకు వర్క్ చేసిన కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ట్రైలర్‌కు ఎప్రిల్ 11న ఈ సినిమా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment