Geethanjali Movie
-
ఎంతమంది అడ్డుపడినా ఆ రోజే సినిమా విడుదల చేస్తాం: కోన వెంకట్
హీరోయిన్ అంజలి టైటిల్ రోల్లో నటించిన హారర్ కామెడీ ఫిల్మ్ 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. ఏప్రిల్ 11న విడుదల కానుంది. ఇలాంటి సమయంలో ఈ చిత్రాన్ని ఆపాలంటూ ఇండస్ట్రీకి చెందిన నట్టి కుమార్ ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాశాడు. దీనికి ప్రధాన కారణం ఈ సినిమాను వైఎస్సార్ సీపీ ఎంపీ సత్యనారాయణ నిర్మించడమే అని తెలుస్తోంది. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ సంయుక్తంగా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమాను నిర్మించారు. ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్‌కు నట్టి కుమార్ రాసిన లేఖపై కోన వెంకట్ ఇలా స్పందించారు. ' గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమా గీతాంజలి సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించాం. కానీ ఈ సినిమా విడుదలను ఆపాలంటూ నట్టి కుమార్ ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాశారు. సినిమా విషయంలో ఆయనకు రూల్స్ తెలుసుకుని ఆ లేఖ రాసి ఉంటే బాగుండేది. ఎలక్షన్ కమిషన్, సెన్సార్ బోర్డు రూల్స్ తెలుసుకుని ఆ నిర్మాత లేఖ రాస్తే బాగుండేది. ఈ సినిమా ఎవరు ఆపినా ఆగేది కాదు. ఎలక్షన్స్‌కు సినిమాలకు దయచేసి ముడిపెట్టొద్దు. సినిమా అనేది ఒక పార్టీకి,కులానికి,మతానికి చెందినది కాదు. ఈ సినిమా కోసం కొన్ని వందలమంది కళాకారులు, టెక్నీషియన్లు పనిచేశారు. దయచేసి సినిమాను రాజకీయం చేయకండి. ఎప్రిల్ 11న ఈ సినిమా తప్పకుండా విడుదల అవుతుంది. సినిమాను ఆపేందుకు ఎవరు అడ్డుపడినా.. ఎంతమంది అడ్డుపడినా.. ఎన్నిరకాలుగా ఇబ్బందులకు గురిచేసినా అనుకున్న రోజే సినిమా విడుదల అయి తీరుతుంది. అని ఆయన తెలిపారు. ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో నటించిన హారర్ కామెడీ ఫిల్మ్ ‘గీతాంజలి’ (2014) సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే సినిమాను తెరకెక్కించారు. ఇందులో కూడా అంజలి, సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘నిన్నుకోరి’, ‘నిశ్శబ్దం’ సినిమాలకు వర్క్ చేసిన కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ట్రైలర్‌కు ఎప్రిల్ 11న ఈ సినిమా విడుదల కానుంది. -
ఈ హీరోయిన్ గుర్తుందా? 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు రీఎంట్రీ!
ఈ బ్యూటీది అసలు మన దేశమే కాదు. అయినాసరే మన సౌత్ సినిమాల్లో నటించింది. హీరోయిన్గా స్టార్ హోదా దక్కించుకుంది. అప్పుడెప్పుడో 1989లో ఫస్ట్ సినిమా చేసింది. తిప్పి తిప్పి కొడితే అరడజను చిత్రాలు కూడా చేయలేదు. అయినాసరే ఈమె చాలా ఫేమ్ సంపాదించుకుంది. అప్పుడెప్పుడో యాక్టింగ్ పక్కనబెట్టేసిన ఈమె.. దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ నటిస్తోంది. ఎవరో గుర్తుపట్టారా? లేదా చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న ఆమె పేరు గిరిజా శెట్టర్. ఈ పేరు చెబితే గుర్తురాకపోవచ్చు. కానీ 'గీతాంజలి' హీరోయిన్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే మణిరత్నం తీసిన వన్ అండ్ ఓన్లీ తెలుగు సినిమా ఇది. ఓ హీరోయిన్ క్యారెక్టర్ ఎంత బలంగా రాయొచ్చనేది ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. అలా ఫస్ట్ చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన గీత అలియాస్ గిరిజా శెట్టర్.. ఓవరాల్‌గా ఐదే సినిమాలు చేసింది. (ఇదీ చదవండి: సర్జరీ చేయించుకున్న చిరంజీవి.. హైదరాబాద్ వచ్చేది అప్పుడే) ఇంగ్లాండ్‌లో సెటిలైన ఈమె తండ్రి ఓ డాక్టర్. ఆయనది కర్ణాటక. అమ్మది మాత్రం ఇంగ్లాండ్. అలా కన్నడ-బ్రిటీష్ మూలాలున్న ఫ్యామిలీలో పుట్టింది. 18 ఏళ్ల తర్వాత భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టిన ఈ బ్యూటీ.. అలా నటిగా మారింది. సైకాలజీ, ఫిలాసఫీ సబ్జెక్ట్స్‌లో థీసిస్ చేసింది. హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసిన ఇంగ్లాండ్ వెళ్లిపోయిన తర్వాత రైటర్, జర్నలిస్టుగా డిఫరెంట్ ఉద్యోగాలు చేసింది. అయితే ఇన్నేళ్లుగా యాక్టింగ్‌కి దూరంగా ఉన్న ఈమెని.. కన్నడ ఇండస్ట్రీకి చెందిన దర్శకనిర్మాతలు ఒప్పించారు. 'ఇబ్బని తబ్బిదా ఇలెయాలి' అనే సినిమాలో నటించేలా చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం నుంచి ఈ మధ్యే గిరిజా శెట్టర్ లుక్ తాజాగా రిలీజ్ చేశారు. ఆమె గురించి చెబుతూ పెద్ద క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ ఫొటో చూసిన తెలుగు ఆడియెన్స్ ఫస్ట్ గుర్తుపట్టలేకపోయారు. తర్వాత మాత్రం 'గీతాంజలి' భామ అని కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Paramvah Studios (@paramvah_studios) (ఇదీ చదవండి: 'భోళా శంకర్' పంచాయతీ.. ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చారు!) -
గీతాంజలి మూవీ పోస్టర్స్