Actress Girija Shettar Recent Pic, Makes Re Entry In Kannada Movie - Sakshi
Sakshi News home page

Guess The Actress: తెలుగు కల్ట్ క్లాసిక్ హీరోయిన్.. ఇప్పుడేమో ఇలా!

Published Tue, Aug 15 2023 7:44 PM | Last Updated on Wed, Aug 16 2023 11:36 AM

Actress Girija Shettar Recent Pic Re Entry Kannada Movie - Sakshi

ఈ బ్యూటీది అసలు మన దేశమే కాదు. అయినాసరే మన సౌత్ సినిమాల్లో నటించింది. హీరోయిన్‌గా స్టార్ హోదా దక్కించుకుంది.  అప్పుడెప్పుడో 1989లో ఫస్ట్ సినిమా చేసింది. తిప్పి తిప్పి కొడితే అరడజను చిత్రాలు కూడా చేయలేదు. అయినాసరే ఈమె చాలా ఫేమ్ సంపాదించుకుంది. అప్పుడెప్పుడో యాక్టింగ్ పక్కనబెట్టేసిన ఈమె.. దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ నటిస్తోంది. ఎవరో గుర్తుపట్టారా? లేదా చెప్పేయమంటారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న ఆమె పేరు గిరిజా శెట్టర్. ఈ పేరు చెబితే గుర్తురాకపోవచ్చు. కానీ 'గీతాంజలి' హీరోయిన్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే మణిరత్నం తీసిన వన్ అండ్ ఓన్లీ తెలుగు సినిమా ఇది. ఓ హీరోయిన్ క్యారెక్టర్ ఎంత బలంగా రాయొచ్చనేది ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. అలా ఫస్ట్ చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన గీత అలియాస్  గిరిజా శెట్టర్.. ఓవరాల్‌గా ఐదే సినిమాలు చేసింది. 

(ఇదీ చదవండి: సర్జరీ చేయించుకున్న చిరంజీవి.. హైదరాబాద్ వచ్చేది అప్పుడే)

ఇంగ్లాండ్‌లో సెటిలైన ఈమె తండ్రి ఓ డాక్టర్. ఆయనది కర్ణాటక. అమ్మది మాత్రం ఇంగ్లాండ్. అలా కన్నడ-బ్రిటీష్ మూలాలున్న ఫ్యామిలీలో పుట్టింది. 18 ఏళ్ల తర్వాత భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టిన ఈ బ్యూటీ.. అలా నటిగా మారింది. సైకాలజీ, ఫిలాసఫీ సబ్జెక్ట్స్‌లో థీసిస్ చేసింది. హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసిన ఇంగ్లాండ్ వెళ్లిపోయిన తర్వాత రైటర్, జర్నలిస్టుగా డిఫరెంట్ ఉద్యోగాలు చేసింది.

అయితే ఇన్నేళ్లుగా యాక్టింగ్‌కి దూరంగా ఉన్న ఈమెని.. కన్నడ ఇండస్ట్రీకి చెందిన దర్శకనిర్మాతలు ఒప్పించారు. 'ఇబ్బని తబ్బిదా ఇలెయాలి' అనే సినిమాలో నటించేలా చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం నుంచి ఈ మధ్యే గిరిజా శెట్టర్ లుక్ తాజాగా రిలీజ్ చేశారు. ఆమె గురించి చెబుతూ పెద్ద క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ ఫొటో చూసిన తెలుగు ఆడియెన్స్ ఫస్ట్ గుర్తుపట్టలేకపోయారు. తర్వాత మాత్రం 'గీతాంజలి' భామ అని కామెంట్స్ చేస‍్తున్నారు.

(ఇదీ చదవండి: 'భోళా శంకర్' పంచాయతీ.. ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చారు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement