‘దెయ్యంతో సహజీవనం’.. ఓ అమ్మాయి పగ | Deyyam tho sahajeevanam song launch on june 13 | Sakshi
Sakshi News home page

‘దెయ్యంతో సహజీవనం’.. ఓ అమ్మాయి పగ

Published Sat, Jun 12 2021 3:28 AM | Last Updated on Sat, Jun 12 2021 9:10 AM

Deyyam tho sahajeevanam song launch on june 13 - Sakshi

బాగా చదువుకొని బంగారు పతకం సాధించిన ఒక అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఎలా మోసం చేశారు? వారిపై ఆ అమ్మాయి ఎలా పగ తీర్చుకుంది? అనే కథతో తెరకెక్కిన చిత్రం ‘డీఎస్‌జె’ (దెయ్యంతో సహజీవనం). నిర్మాత నట్టికుమార్‌ దర్శకత్వం వహించగా, ఆయన కుమార్తె కరుణ లీడ్‌ రోల్‌లో నటించారు. నట్టి లక్ష్మీ, అనురాగ్‌ కంచర్ల సమర్పణలో నట్టి క్రాంతి నిర్మించిన ఈ చిత్రంలోని తొలి పాట నేడు విడుదలవుతోంది. ‘‘మా చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తాం. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నట్టి క్రాంతి. ‘‘కరోనా సమయంలోనూ యూనిట్‌ అంతా భయపడకుండా మాకు సహకరించడం వల్ల ఈ సినిమాని త్వరగా పూర్తి చేశాం’’ అన్నారు నట్టికుమార్‌.

చదవండి: కరోనా నివారణ నిధికి రూ.కోటి విరాళం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement