Karuna
-
హెల్దీ డైట్: సగ్గుబియ్యం పొంగనాలు..
పోషకాలు, కేలరీలు, కార్బోహైడ్రేట్లు, క్యాల్షియం వంటి విటమిన్స్ ఆరోగ్యానికి పుష్కలంగా దొరికే వంటకం ఇది. దీనిని ఏ విధంగా తయారుచేయాలో చూద్దాం..కావలసినవి..సగ్గుబియ్యం – అర కప్పు (గంట సేపు నానబెట్టాలి);పనీర్ తురుము – 75 గ్రాములు;వేరుశనగపప్పుల పొడి– 3 టేబుల్ స్పూన్లు;క్యారట్ తురుము – 3 టేబుల్ స్పూన్లు;బంగాళదుంప – 1 (ఉడికించి తొక్క తీసి చిదమాలి);జీలకర్ర పొడి– టీ స్పూన్;ధనియాల పొడి– టీ స్పూన్;మిప్రో్పడి– టీ స్పూన్;ఉప్పు– అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;క్యాబేజ్ తరుగు – ము΄్పావు కప్పు;క్యాప్సికమ్ ముక్కలు – అర కప్పు (రెడ్, గ్రీన్ క్యాప్సికమ్);చీజ్ తురుము – 50 గ్రాములు (12 భాగాలు చేసుకోవాలి);నూనె – టీ స్పూన్.తయారీ..– ఒక పాత్రలో క్యాబేజ్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు వేసి ఐదు నిమిషాల సేపు పక్కన ఉంచాలి.– ఆ తర్వాత ఇందులో నూనె, చీజ్ మినహా మిగిలినవన్నీ వేసి బాగా కలిపి పన్నెండు భాగాలుగా చేయాలి.– ఒక్కో భాగంలో చీజ్ స్టఫ్ చేస్తూ గోళీలాగా చేయాలి.– గుంత పొంగనాల పెనం వేడి చేసి ఒక్కో గుంతలో ఒక్కో చుక్క నూనె రుద్ది పొంగనాన్ని పెట్టి మీడియం మంట మీద కాలనివ్వాలి.– ఒకవైపు కాలిన తర్వాత రెండోవైపు కాల్చాలి.పోషకాలు (ఒక్కో పొంగనంలో)..– కేలరీలు 63;– ప్రోటీన్ – 2.5 – 3 గ్రాములు;– కార్బోహైడ్రేట్లు – 8–9 గ్రాములు;– ఫ్యాట్ – 2–3 గ్రాములు;– ఫైబర్– గ్రాము;– క్యాల్షియం – 40–50 గ్రాములు.– డాక్టర్ కరుణ, న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్ -
కవలలకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్
తెలుగు సీరియల్ నటి కవల పిల్లలకు జన్మనిచ్చింది. చాలా ఏళ్ల క్రితమే సీరియల్ దర్శకుడిని పెళ్లి చేసుకున్న ఈమెకు పదేళ్ల వయసున్న కొడుకు కూడా ఉన్నాడు. అలాంటిది మళ్లీ చాన్నాళ్ల తర్వాత కరుణ్ భూషణ్ ట్విన్స్‌కి తల్లయింది. ఈ క్రమంలోనే తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్-సాయిధరమ్ తేజ్ వివాదంపై స్పందించిన నిహారిక)'ఆహా' సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కరుణ.. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని 'శంకర్ దాదా ఎంబీబీఎస్', కొంచెం ఇష్టం కొంచెం కష్టం, నిన్నే ఇష్టపడ్డాను, కాటమరాయుడు తదితర సినిమాల్లో నటించింది. మరోవైపు 'మొగలిరేకులు' నుంచి 'వైదేహి పరిణయం' వరకు తెలుగులో బోలెడన్ని సీరియల్స్ చేసింది.ముఖ్యంగా 'అభిషేకం' సీరియల్లో కరుణ అభినయానికి అందానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం 'వైదేహి పరిణయం'లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఈమె కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి పిల్లల్ని కనేంత వరకు తన జర్నీ ఎలా సాగిందో చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: తొమ్మిదేళ్ల తర్వాత తల్లి కాబోతున్న బుల్లితెర నటి!) View this post on Instagram A post shared by Karuunaa Bhushan (Nethikaruna) (@karuunaa_bhushan) View this post on Instagram A post shared by Bharath Bhushan Nethi (@bharathbhushan_nethi) -
బీఆర్ఎస్కు షాక్! జెడ్పీటీసీ సభ్యురాలు పార్టీకి గుడ్‌బై..
కరీంనగర్: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్కు తొలి షాక్ తగిలింది. కొత్తపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు పిట్టల కరుణ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి, కాంగ్రెస్‌లో చేరారు. శుక్రవారం నగరంలోని ఓ కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమెకు పార్టీ కండువా కప్పి, ఆహ్వానించారు. అలాగే మత్స్యపారిశ్రామిక సంఘం అధ్యక్షుడు పిట్టల రవీందర్, వార్డు సభ్యులు పిట్టల విష్ణు, పిల్లి శ్రీధర్, గుర్రం సత్యం, కోమలతోపాటు కొత్తూరి వెంకట్రాజయ్య, ముస్కు అంజిరెడ్డి, గుగులోతు దివ్య, బానోతు రవినాయక్, శ్రవణ్‌నాయక్, గంగాధర కనకయ్య కాంగ్రెస్‌లో చేరినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్తపల్లి జెడ్పీటీసీ సభ్యురాలి చేరికతో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందన్నారు. ముదిరాజ్ కులస్తుల అభ్యున్నతికి కృషి చేస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో ముదిరాజ్‌లకు న్యాయం జరగలేదని, అందుకే కాంగ్రెస్‌లో చేరామని జెడ్పీటీసీ సభ్యురాలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నగర శాఖ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. ఇవి చదవండి: కాంగ్రెస్‌లోకి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి -
ప్రభుత్వాస్పత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం
పార్వతీపురం: ఆయన ఆ జిల్లాకే ప్రధాన అధికారి. ఆయన తలచుకుంటే కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందగలరు. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుతున్న మెరుగైన వైద్య సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు. ధైర్యంగా తన భార్యకు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించారు. పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఆయన మరెవరో కాదు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిషాంత్‌కుమార్. వివరాల్లోకి వెళితే...పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో కలెక్టర్ నిషాంత్‌కుమార్ భార్య కరుణ బుధవారం సాయంత్రం మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.వాగ్దేవి, వైద్యులు త్రివేణి, చిన్నపిల్లల వైద్యుడు బి.గణేష్ చైతన్య వైద్యసేవలందించి సుఖప్రసవం చేశారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. కలెక్టర్ నిషాంత్‌కుమార్ గతంలో రంపచోడవరం ఐటీడీఏ పీవోగా పనిచేసిన సమయంలో అక్కడి సమీపంలోని ప్రభుత్వాస్పత్రిలోనే ఆయన భార్య తొలి సంతానంగా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అలాగే పార్వతీపురంలో పనిచేసిన జాయింట్ కలెక్టర్ ఒ.ఆనంద్ భార్య కూడా ఇటీవల 108 వాహనంలో వెళ్లి పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలోనే మగబిడ్డకు జన్మనిచి్చన సంగతి తెలిసిందే. -
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు చివరి చాన్స్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ఈ నెల 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కన్వినర్ సీటు కౌన్సెలింగ్ ద్వారా పొందడానికి ఇదే చివరి అవకాశం. ఇప్పటివరకూ సీటు కోసం ప్రయత్నించని వారు ఉంటే ఈ నెల 18న సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరవ్వాలని సాంకేతిక విద్య కమిషనర్ వాకాటి కరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 17 నుంచి 19 వరకూ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ నెల 23వ తేదీన ప్రత్యేక దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రెండు రోజుల్లో సీటు వచ్చిన అభ్యర్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత కూడా మిగిలిపోయిన సీట్లను ఈ నెల 25న స్పాట్ అడ్మిషన్ల పేరిట ఆన్లైన్లో కాకుండా నేరుగా కాలేజీల్లోనే భర్తీ చేస్తారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సాంకేతిక విద్య విభాగం విడుదల చేయాల్సి ఉంది. అందుబాటులో 19 వేల సీట్లు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ 19,049 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కంప్యూటర్ కోర్సులకు సంబంధించిన సీట్లు దాదాపు 4 వేలకు పైనే ఉన్నాయి. ఒక్క సీఎస్సీలోనే 3,034 సీట్లు మిగిలాయి. సివిల్ ఇంజనీరింగ్‌లో 2,505, ఈసీఈలో 2,721, ఈఈఈలో 2,630, ఐటీలో 1,785, మెకానికల్‌లో 2,542 సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది పలు కాలేజీలు సివిల్, మెకానికల్ సీట్లు రద్దు చేసుకుని, ఆ స్థానంలో కంప్యూటర్ సైన్స్ సీట్లు పెంచుకున్నాయి. వీటితో పాటు మరో 7 వేల సీట్లు కొత్తగా కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలో పెరిగాయి. మొత్తంగా కంప్యూటర్ సైన్స్ సీట్లు 14 వేల వరకు పెరిగాయి. అయితే గ్రామీణ ప్రాంతాలకు చేరువలో ఉండే కాలేజీల్లో కంప్యూటర్ కోర్సులు అందుబాటులో ఉన్నా అక్కడ చేరేందుకు విద్యార్థులు ఇష్టపడటం లేదు. ఆయా కాలేజీల్లో మౌలిక వసతులు, సరైన ఫ్యాకల్టీ లేదని విద్యార్థులు భావిస్తున్నారు. కాగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో సీట్లు 90 శాతం వరకూ భర్తీ అయ్యాయి. లక్షకు చేరువలో చేరికలు ఈ ఏడాది ఇంజనీరింగ్‌లో కన్వీనర్, యాజమాన్య కోటా కలిపి లక్ష మంది వరకు చేరే వీలుందని తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 174 కాలేజీలుంటే, వీటిలో 83,766 కన్వినర్ కోటా సీట్లు, మరో 33 వేలు యాజమాన్య కోటా సీట్లు ఉన్నాయి. కన్వీనర్ కోటాలో ఇప్పటికే 65 వేల మంది వరకూ చేరారు. ప్రత్యేక కౌన్సెలింగ్, స్పాట్ అడ్మిషన్ల ద్వారా మరో 6 వేల మంది వరకూ చేరే వీలుందని అంచనా వేస్తున్నారు. ఇక యాజమాన్య కోటా కింద దాదాపు 30 వేల వరకూ భర్తీ అయ్యే వీలుందని భావిస్తున్నారు. -
‘దెయ్యంతో సహజీవనం’.. ఓ అమ్మాయి పగ
బాగా చదువుకొని బంగారు పతకం సాధించిన ఒక అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఎలా మోసం చేశారు? వారిపై ఆ అమ్మాయి ఎలా పగ తీర్చుకుంది? అనే కథతో తెరకెక్కిన చిత్రం ‘డీఎస్‌జె’ (దెయ్యంతో సహజీవనం). నిర్మాత నట్టికుమార్ దర్శకత్వం వహించగా, ఆయన కుమార్తె కరుణ లీడ్ రోల్లో నటించారు. నట్టి లక్ష్మీ, అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి క్రాంతి నిర్మించిన ఈ చిత్రంలోని తొలి పాట నేడు విడుదలవుతోంది. ‘‘మా చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తాం. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నట్టి క్రాంతి. ‘‘కరోనా సమయంలోనూ యూనిట్ అంతా భయపడకుండా మాకు సహకరించడం వల్ల ఈ సినిమాని త్వరగా పూర్తి చేశాం’’ అన్నారు నట్టికుమార్. చదవండి: కరోనా నివారణ నిధికి రూ.కోటి విరాళం -
నిజాం క్లబ్ రికార్డు: ఫస్ట్ ఉమన్ @135
హైదరాబాద్‌లో నిజాం క్లబ్‌ను 1884లో స్థాపించారు. నగరంలోని ప్రముఖులు ఆ క్లబ్లో సభ్యత్వం ఉండడాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. అలాంటి క్లబ్లో ఓ మహిళ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలను నిర్వర్తించడం 135 ఏళ్ల నిజాం క్లబ్ చరిత్రలో తొలిసారి. వైస్ ప్రెసిడెంట్‌గా 2019 డిసెంబర్లో గెలిచారామె. ఆమె పేరు డాక్టర్ కరుణా ఏకాంబర్. ఓ మహిళ తన అభ్యుదయ ప్రయాణంలో వేసిన సాధికారపు అడుగు ఇది. మగవాళ్లు తమ సామ్రాజ్యంగా పరిధి విధించుకున్న క్లబ్‌ను ఫ్యామిలీ క్లబ్‌గా దిద్దడంలో కరుణది కీలకమైన పాత్ర. ‘విరి’సిన అభిలాష జంటనగరాల్లో ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన కరుణా ఏకాంబర్ వారసత్వంగా అందివచ్చిన హోటల్ ఇండస్ట్రీ నిర్వహణతోపాటు తన అభిరుచి మేరకు సొంతంగా బ్లూమింగ్ బడ్స్ పేరుతో ఓ పూల వ్యాపారసామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. విజయవంతమైన పారిశ్రామిక వేత్తగా గుర్తింపు పొందారు. ఇన్ని బాధ్యతల్లో నిజాం క్లబ్ బాధ్యతలను తలకెత్తుకోవడంలో ఉన్న ఇష్టాన్ని సాక్షితో పంచుకున్నారామె. తొలితరం మెంబర్ ‘‘నిజాం క్లబ్ నాకు సొంతిల్లులాంటిది. చిన్నప్పుడు నాన్నతో దాదాపు రోజూ క్లబ్‌కి వచ్చేదాన్ని. ఇక్కడ టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తూనే పెరిగాను. అప్పట్లో మహిళలకు సభ్యత్వం ఉండేది కాదు. మహిళలకు అన్ని చోట్లా సమాన హక్కులు ఉండాలని కోర్టు తీర్పు ఇవ్వడంతో 1992లో మహిళలకు ఓటు హక్కుతో కూడిన మెంబర్షిప్ ఇచ్చారు. అలా నేను నిజాం క్లబ్ సభ్యత్వం తీసుకున్న తొలితరం మహిళనన్నమాట. క్లబ్లో మహిళల భాగస్వామ్యం పెంచాలని అనుకునే దాన్ని. 2009 నుంచి నాలుగేళ్లపాటు మేనేజింగ్ కమిటీ మెంబర్‌గా ఉన్నాను. నా ప్రతిపాదనను మిగిలిన సభ్యులు కూడా సానుకూలంగా తీసుకోవడంతో క్లబ్లో చాలా మార్పులు చేయగలిగాం. ఆ తర్వాత నాలుగేళ్లు జాయింట్ సెక్రటరీగా బాధ్యతల్లో ఉన్నాను. వైస్ ప్రెసిడెంట్‌గా ఇది రెండో ఏడాది. ఈ పదేళ్లలో క్లబ్లో ఆడవాళ్లు ఆడుకునే ఆటలు పెట్టించడంతోపాటు లేడీస్ ట్రైనర్లతో జిమ్, హెల్త్‌క్లబ్‌ను ఇంప్రూవ్ చేయడంతోపాటు మహిళలు, పిల్లల కోసం విడివిడిగా స్విమ్మింగ్ పూల్స్ కట్టించాం. అంతకుముందు కామన్ స్విమ్మింగ్ పూల్‌లో మహిళల కోసం కొంత టైమ్ ఉండేది. మహిళలకు విడిగా పూల్ ఉండడంతో పిల్లలతోపాటు మహిళలూ రోజూ వస్తున్నారు. పండుగల వేదిక నిజాం క్లబ్లో ఇప్పుడు రంజాన్, దసరా, క్రిస్టమస్, ఉగాది పండుగలతోపాటు ఉమెన్స్ డే వేడుకలను కూడా నిర్వహిస్తున్నాం. దాంతో మహిళల పార్టిసిపేషన్ బాగా పెరిగింది. ఈ ఏడాది మార్చిలో ఐదు సాధారణ సభ్యత్వాలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో దాదాపు 650 మంది మహిళలు ఓటు వేశారు. ఆకాశంలో సగం, అవనిలో సగం అని మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి. అందుకు మగవాళ్లు బాటలు వేయాలని ఎదురు చూడడం ఎందుకు? మనం ఒక అడుగు వేస్తే ఆ తర్వాత అడుగులను సమాజమే వేయిస్తుంది’’ అన్నారు డాక్టర్ కరుణా ఏకాంబర్. రిపబ్లిక్ డే పతాక అవిష్కరణ సందర్భంగా... పూల డాక్టర్ – పుస్తక రచయిత కరుణా ఏకాంబర్‌కి పూలంటే ఇష్టం. పూల వ్యాపారం చేశారు. పూల మీద అధ్యయనం చేసి పీహెచ్డీ అందుకున్నారు. అలాగే ఆమె నిత్యవిద్యార్థిని. నేర్చుకోవాలనే జిజ్ఞాసకు వయసు అడ్డంకి కాదంటారామె. పెళ్లి తర్వాత డిగ్రీ, హోటల్ మేనేజ్మెంట్, న్యూట్రిషన్ కోర్సు, ఇకబెనా ఫ్లవర్ డెకరేషన్ కోర్సులు చేశారు. పియానో కోర్సు కూడా చేశారు. అంతకంటే ముందు సోషియాలజీలో ఎంఫిల్ ఉంది. కోవిడ్ కారణంగా వచ్చిన ఈ విరామంలో హోలిస్టిక్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్‌లో ఎంఫిల్ చేశారు. పని ఒత్తిడి నుంచి బయటపడడానికి కాలిగ్రఫీ, డూడులింగ్, మండల్ ఆర్ట్ వేస్తుంటారు. హైబిజ్ లీడర్షిప్ అవార్డు అందుకున్న కరుణ ఇప్పుడు ఆయుర్వేద మెడిసిన్ రెండవ దశ కోర్సు చేస్తున్నారు. ఇక పుస్తక రచన పట్ల ఆసక్తి కగలగానికి కారణం ఆధునికతలో మన వంటిల్లు రూపు మారిపోవడమేనన్నారు. అమ్మ చేతి వంటకు దూరం కాకూడదని ఆమె ‘మదర్స్ కుక్ బుక్ రాశారు. తెలంగాణ కిచెన్ అంటే నాన్‌వెజ్ భోజనం, బిర్యానీలు మాత్రమే అనే అపోహను తొలగించడానికి శాకాహార రుచుల కోసం ‘సీక్రెట్స్ ఆఫ్ తెలంగాణ కిచెన్’ రాశారు డాక్టర్ కరుణ. – వాకా మంజులారెడ్డి -
నాన్నతో సినిమా చేయడం హ్యాపీ
దర్శక–నిర్మాత నట్టి కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘డి.ఎస్.జె’ (దెయ్యంతో సహజీవనం). ఈ సినిమా ద్వారా నట్టి కుమార్ కుమార్తె కరుణ కథానాయికగా, కుమారుడు క్రాంతి నిర్మాతగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ‘‘నా దర్శకత్వంలో నా కూతురు కరుణ హీరోయిన్గా, నా కుమారుడు క్రాంతి నిర్మాతగా చేయడం ఓ మంచి అనుభూతి’’ అన్నారు నట్టి కుమార్. ‘‘నాన్న డైరెక్షన్లో నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు నట్టి కరుణ. -
ప్రియుడు మోసం చేశాడని
సారంగపూర్(నిర్మల్): తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి పెళ్లికి నిరాకరించడంతో సారంగాపూర్ మండలం నాగపూర్ తండాకు చెందిన జాదవ్ కరుణ(19) సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. సారంగాపూర్‌కు చెందిన యువకుడు ఎస్కే బాబా కరుణను ప్రేమించాడు. అయితే మొన్నటివరకు పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన ఎస్కే బాబా ఇటీవల పెళ్లికి నిరాకరించాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన కరుణ సోమవారం ఉదయం తన ఇంట్లో పంట కోసం నిలువ ఉంచిన పురుగుల మందు సేవించి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబీకులు వెంటనే నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కరుణ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సారంగాపూర్ ఎస్సై సునీల్‌కుమార్ తెలిపారు. -
ట్విట్టర్లో సాయానికి ముందుకొచ్చిన కేటీఆర్
హైదరాబాద్: ట్విట్టర్లో చురుగ్గా ఉండి.. ఎప్పటికప్పుడు నెటిజన్ల విజ్ఞపులపై స్పందిస్తున్న తెలంగాణ ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారు. రెండు కిడ్నీలు చెడిపోయి సాయం కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళకు ఆపన్నహస్తం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఉప్పల్‌లో ఓ అనాథ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న 55 ఏళ్ల కరుణ ఇటీవల ఆరోగ్యం విషమించింది. రెండు మూత్రపిండాలు చెడిపోవడంతో నగరంలోని ఓ నర్సింగ్‌హోమ్‌లో చికిత్స పొందుతున్నారు. ఉప్పల్‌లో ‘కారుణ్య ఆర్ఫా అండ్ ఒల్డేజ్ హోమ్’ నిర్వహిస్తున్న కరుణ 70 మంది అనాథా చిన్నారులకు, నలుగురు వృద్ధ వితంతువులకు సేవలు అందిస్తున్నారు. కిడ్నీలు చెడిపోవడంతో ఆమె ఆస్పత్రి పాలైందని, ఆమెకు నిమ్స్‌లో చికిత్స అందించాల్సిన అవసరముందని, ఆమె వైద్యఖర్చులకు రూ. 3 లక్షలు ఖర్చు అవుతుందని కోరుతూ హృదయ స్పందన అనే స్వచ్ఛంద సంస్థ ట్విట్టర్లో కేటీఆర్‌ను, తెలంగాణ సీఎంవోను విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి కేటీఆర్ మరిన్ని వివరాలు తెలుపాలని, ఆమెకు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. Send me the details. Will make sure she is helped https://t.co/mmHMFd07Za — KTR (@KTRTRS) 26 November 2016 -
ఎమ్మెల్యేలుగా..
► అమ్మ ఆశీస్సులు ►నారాయణ ప్రమాణ స్వీకారం ►ఓటరుకు కరుణ కృతజ్ఞత సాక్షి, చెన్నై : రాష్ట్రంలోని అరవకురిచ్చి, తంజావూరు, తిరుప్పరగుండ్రం, పుదుచ్చేరిలోని నెల్లితోపు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డ విషయం తెలిసిందే. అన్నాడీఎంకే అభ్యర్థులు అరవకురిచ్చిలోఉప ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు బుధవారం చెన్నైకు చేరుకున్నారు. గెలుపు ధ్రువీకరణ పత్రాల తో అపోలో ఆసుపత్రిలో ఉన్న సీఎం జయలలిత ఆశీస్సుల్ని అందుకున్నారు. ఇక, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి నెల్లితోపు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. నారాయణకు శుభకాంక్షలు తెలుపుతూ, తమకు ఓట్లు వేసిన ఓటరుకు డీఎం కే అధినేత ఎం కరుణానిధి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. సెంథిల్ బాలాజీ, తంజావూరులో రంగస్వామి, తిరుప్పర గుండ్రంలో ఏకే బోసు విజయకేతనం ఎగుర వేశారు. నెల్లితోపులో కాంగ్రెస్ అభ్య ర్థి, ఆ రాష్ట్ర సీఎం నారాయణస్వామి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేలుగా ధ్రువీకరణ పత్రాలను అందుకున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాత్రికిరాత్రే చెన్నైకు చేరుకున్నారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించిన మంత్రులు తంగమణి, ఎస్పీ వేలుమణి, ఎడపాడి పళనిస్వామి, ఉదయకమార్, కామరాజ్‌లతో కలిసి కొత్త ఎమ్మెల్యేలు ముగ్గురు అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. తమ ధ్రువీకరణ పత్రాలతో అమ్మ జయలలిల ఆశీస్సుల్ని అందుకునేందుకు లోనికి వెళ్లారు. రెండు గంటల అనంతరం ఈ ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్ మంత్రులు ఆసుపత్రి నుంచి బయటకు వచ్చారు. అమ్మ ఆశీస్సులు అందుకునేందుకు వచ్చామని, అమ్మ ఆరోగ్యం గురించి వైద్యుల్ని విచారించినట్టు పేర్కొని ముందుకు సాగారు. నారాయణ ప్రమాణ స్వీకారం: పుదుచ్చేరి సీఎంగా నారాయణస్వామి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులతో ముందుకు సాగిన నారాయణస్వామి, ఈ సారి ఉప ఎన్నికల ద్వారా ప్రప్రథమంగా విజయకేతనం ఎగుర వేశారు. ఇది ఆయనకు మహా ఆనందమే. తన ఆనందాన్ని పంచుకునేవిధంగా ఓటర్ల చెంతకు వెళ్లి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. బుధవారం ఉదయం తన నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేడుకలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత అసెంబ్లీ స్పీకర్ వైద్యలింగం ప్రమాణ స్వీకారం చేరుుంచారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. ఇక, నారాయణస్వామికి తన శుభాకాంక్షలు తెలియజేసిన డీఎంకే అధినేత ఎం కరుణానిధి, ఓటర్లకు తన కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలోని మూడు నియోజకవర్గాల్లో అన్నాడీఎంకే అరాచకాలు, అధికార దుర్వినియోగం, ఎన్నికల యంత్రాంగం ఏకపక్ష తీరు సాగినా, తమ అభ్యర్థులకు మద్దతుగా ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు కరుణానిధి పేర్కొన్నారు. ఇక, అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో శ్రమించిన కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞత తెలియజేశారు. -
వరంగల్ జిల్లాలో శుక్రవారం స్కూళ్లకు సెలవు
భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని 5 రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో పాటు మండల, గ్రామస్థాయి అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండి అప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. -
కత్తి వాడటం రాదని వెక్కిరించింది.. అందుకే పొడిచా
కత్తి వాడటం కూడా రాదు.. అంటూ కరుణ తనను వెక్కిరించిందని, అందుకే తనకు కత్తి ఎంత బాగా వాడటం వచ్చో చూపించాలనే ఆమెను అన్నిసార్లు పొడిచానని ఢిల్లీ టీచర్ హంతకుడు సురేందర్ సింగ్ పోలీసులకు వెల్లడించాడు. గత నాలుగేళ్లుగా ఇద్దరి మధ్య మంచి సంబంధాలే ఉండేవని, ఏడాది నుంచే అవి చెడిపోయాయని పోలీసులు చెప్పారు. తర్వాత కొంత కాలానికి మళ్లీ సర్దుకుందని అనుకున్నా.. ఆమె ఫేస్బుక్ చూసి తాను ఒక్కసారిగా షాక్ తిన్నానని సురేందర్ అన్నాడు. ఆమె ఫేస్బుక్ అకౌంట్ పాస్వర్డ్ తనకు తెలుసని, దాన్ని తెరిచి చూస్తే అందులో మోహిత్ అనే యువకుడికి ఆమె అభ్యంతరకరంగా ఉన్న తన ఫొటోలు పంపినట్లు, అతడితో బాగా సన్నిహితంగా చాటింగ్ చేసినట్లు ఉందని తెలిపాడు. తాను ముందుగా కరుణ బ్యాగ్ మీద కత్తి ఆడించానని సురేందర్ చెప్పాడు. అయితే.. కత్తి ఎలా వాడాలో కూడా నీకు తెలియదంటూ ఆమె తనను వెక్కిరించిందని, దాంతో దాన్ని తాను చాలా బాగా వాడగలనని చూపించడానికే అలా పొడిచానని వివరించాడు. పైగా, ఆ తర్వాత పో్లీసులకు ఫోన్ చేసింది కూడా వేరే ఎవరో కాదు.. స్వయంగా సురేందరే ఫోన్ చేసి చెప్పాడు. నాలుగేళ్ల పాటు తనతో సన్నిహితంగా ఉన్న ఆమె.. వేరే యువకుడికి అలాంటి ఫొటోలు పంపడం చూసి తాను ఎంతో ఆవేదన చెందానని, దాని గురించి ఆమెను అడిగితే 'నా మీద గూఢచర్యం చేస్తున్నావా' అంటూ తిట్టిపోసిందని సురేందర్ తెలిపాడు. తాను, కరుణ కలిసి ఉన్నప్పటి కొన్ని ఫొటోలను కూడా అతడు పోలీసులకు చూపించాడు. ఇద్దరి ఫేస్బుక్ అకౌంట్లలో కూడా ఆ ఫొటోలున్నాయి. సోషల్ మీడియాలో ఆదిత్య అనే పేరుతో సురేందర్ సింగ్ అకౌంట్లున్నాయి. 2012 నుంచి తామిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందని.. అయితే ఇటీవల మోహిత్ తనకు ఆమె బాగా తెలుసని చెబుతూ ఆమె పంపిన ఫొటోలు తనకు చూపించాడని, అవి చూసి తన కళ్లను తానే నమ్మలేకపోయానని వివరించాడు. తర్వాత ఆమెకు ఫోన్ చేసి తాము ఎప్పుడూ కలుసుకునే జీటీబీ మెట్రోస్టేషన్ వద్దకు పిలిచానని చెప్పాడు. వాళ్లిద్దరి మొబైల్ ఫోన్ లొకేషన్లు చూడగా.. ఇద్దరూ హత్యకు ముందు గంట నుంచి అక్కడే ఉన్నట్లు తేలింది. -
హరితహారంపై నిర్లక్ష్యం వద్దు
వారంలోగా టార్గెట్లు పూర్తి చేయాలి కలెక్టర్ వాకాటి కరుణ హన్మకొండ అర్బన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి న హరితహారంపై నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని కలెక్టర్ వాకాటి కరుణ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ నుంచి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులతో హరితహారంపై ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారంలోగా వివిధ స్థాయిల్లో అప్పగించిన టార్గెట్లను పూర్తి చేయాలన్నారు. మొక్కల సంరక్షణకు కావాల్సిన ఫెన్సింగ్ నాటి, నీటి సరఫరా కోసం అవసరమైన నిధులకు సూక్ష్మ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసి ప్రతిపాదన లు పంపించాలన్నారు. మొక్కలు కావాల్సిన వారు ఇం డెంట్ ఇవ్వాలని, ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చే యాలన్నారు. కాగా, హరితహారంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అధికారులకు సహకరించనందుకు రేగొండ పంచాయతీరాజ్ ఏఈని సస్పెండ్ చేయాలని ఎస్ఈని ఆదేశించారు. వీడియో కాన్ఫరె¯Œæ్సలో జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఏజేసీ తిరుపతిరావు, జెడ్పీ సీఈఓ విజయ్ గోపాల్, డీఎఫ్ఓలు శ్రీనివాస్, పురుషోత్తం, డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.‡ -
పీహెచ్‌సీలు పరిశుభ్రంగా ఉండాలి
నెలకు కనీసం 11 ప్రసవాలు నిర్వహించాలి గర్భిణుల వివరాలు ఆన్లైన్లో ఉంచాలి కలెక్టర్ వాకాటి కరుణ హన్మకొండ అర్బన్ : జిల్లాలోని అన్ని పీహెచ్సీ ల్లో ఆరోగ్యకరమైన వాతావరణం కల్పిస్తూ నెల కు కనీసం 11 ప్రసవాలు నిర్వహించే విధంగా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. శనివారం కలెక్టరేట్ నుంచి పీహెచ్‌సీల వైద్యులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణులకు సంబంధించిన ఫోన్‌నెంబర్లు సేకరించి అందుబాటులో ఉంచాలని సూచించారు. కమిటీ ఆ మోదంతో ఆస్పత్రి అభివృద్ధి నిధుల నుంచి అ వసరమైన కొత్త సామాగ్రిని కొనుగోలు చేయాల ని ఆదేశించారు. అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌వో శ్రీరాం మాట్లాడుతూ ఆస్పత్రుల్లో సౌకర్యాల క ల్పనకోసం చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అన్ని విభాగాల్లో ఉత్తమ పీహెచ్‌సీకి రూ.2 లక్షలు, రెండవ స్థానంలో ఉన్న పీహెచ్సీ కి రూ.50 వేల చొప్పున నగదు పారితోషికం అందజేయనున్నట్లు తెలిపారు. -
మహిళా మావోయిస్టుల లొంగుబాటు
మహిళా మావోయిస్టులు ఇద్దరు పోలీసులకు లొంగిపోయారు. ఖమ్మం జిల్లా శబరి ఏరియా కమిటీ కార్యదర్శి నగేష్ సతీమణి కరుణతోపాటు మరో మావోయిస్టు మడకం దేవి భద్రాచలం ఏఎస్పీ భాస్కరన్ ఎదుట సోమవారం లొంగిపోయారు. అనారోగ్య కారణాలతోనే వారు లొంగుబాట పట్టారని ఏఎస్పీ తెలిపారు. వారిపై నమోదైన కేసులను పరిశీలిస్తున్నామన్నారు. -
ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగింది:కరుణ
-
యువతుల్లారా జాగ్రత్త!
పాండురంగారావుపై ఏ కేసు నమోదు చేస్తారు? మూడేళ్ల పాటు తనను ప్రేమ పేరుతో వంచించి చివరకు మరో యువతిని పెళ్లి చేసుకున్న ప్రియుడి గొంతుకోసిన ప్రియురాలిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆ యువతిని అన్ని విధాలా మోసం చేసిన ఆ యువకుడిపై ఏ కేసు నమోదు చేశారు? ఏ కేసు నమోదు చేస్తారు? ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట ప్రాంతంలోని కుర్వపల్లి గ్రామానికి చెందిన పైదా కరుణ(23) ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అదే కళాశాలలో చర్ల మండలం వెంకటాపురం ఉప్పిడి వీరాపురంనకు చెందిన చల్లూరి పాండురంగారావు(23) కూడా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వీరిద్దరూ మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పాండురంగ పెళ్లి చేసుకొంటానని కరుణను నమ్మించి లోబర్చుకున్నాడు. ఖమ్మంలో ఓ సంవత్సరం పాటు ఇద్దరూ కలిసి ఒకే గదిలో సహజీవనం చేశారు. పాండురంగారావు గుట్టు చప్పుడు కాకుండా ఇటీవల తన మామయ్య కూతురిని వివాహం చేసుకున్నాడు. ఆదివారం ప్రాజెక్ట్ వర్క్‌పై ఖమ్మం వచ్చిన పాండురంగారావుని కరుణ నిలదీయగా తాను వివాహం చేసుకున్నది నిజమేనని చెప్పాడు. సింపుల్‌గా తనను మర్చిపోమ్మన్నాడు. తన పరిస్థితి ఏమిటని అడిగిన కరుణకు, తనకేమీ సంబంధం లేదని చెప్పాడు. ఎంతో భవిష్యత్ ఉన్న కరుణ అతనిని నమ్మింది. మోసపోయానని తెలుసుకొని, అతని మాటలకు కడుపు మండి కోపంతో బ్లేడుతో అతడి గొంతుపై గాయం చేసింది. స్థానికులు అతనిని ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉంది. అతని మోసం వల్ల కరుణ జీవితాన్ని నష్టపోయింది. ఇప్పడు పోలీసులు ఆ విద్యార్థినిపై హత్యాయత్నం కేసు నమెదు చేశారు. అరెస్ట్ చేశారు. నాలుగు రోజులు పోయిన తరువాత ఆ పాండురంగ కొత్తపెళ్లాంతో హాయిగా జీవితం గడుపుతాడు. కరుణ పరిస్థితి ఏమిటి? పాండురంగపై ఏ కేసు నమోదు చేస్తారు? ఇటు వంటి విషయాలలో అన్నివిధాల యువతులే నష్టపోతున్నారు. ఈ విధంగా మోసపోయిన ఎంతో మంది యువతులు విషయం బయటకు తెలిస్తే, తమ జీవితాలకే ముప్పు అని గుట్టుగా బతుకుతున్నారు. ధైర్యం చేసి మోసగాడిని నిలదీసి, ఎదురుతిరిగిన యువతల పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. అందువల్ల యువతుల్లారా జాగ్రత్త! -
ప్రియుడి గొంతు కోసిన యువతి
ప్రేమించి మోసం చేశాడని.. సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మూడేళ్ల పాటు ప్రేమ పేరుతో వంచించి.. మరో యువతిని వివాహం చేసుకున్న ప్రియుడి గొంతుకోసింది ఓ యువతి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ యువకుడు ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. ఖమ్మంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... జిల్లాలోని అశ్వాపురం మండలం కుర్వపల్లి గ్రామానికి చెందిన పైదా కరుణ(23) ఖమ్మంలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అదే కళాశాలలో చర్ల మండలం వెంకటాపురం ఉప్పిడి వీరాపురంనకు చెందిన చల్లూరి పాండురంగారావు(23) కూడా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వీరు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకొంటానని నమ్మించి ఆమెను లోబర్చుకున్నాడు. ఖమ్మంలో ఓ సంవత్సరం పాటు ఒకే గదిలో ఉన్నారు. అయితే, ఇటీవల పాండురంగారావు గుట్టు చప్పుడు కాకుండా తన మామయ్య కూతురిని వివాహం చేసుకున్నాడు. విషయం తెలిసిన కరుణ ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ చేసి ఉంచాడు. ఆదివారం ప్రాజెక్ట్ వర్క్‌కు సంబంధించి ఖమ్మం వచ్చిన పాండురంగారావుని కలిసిన కరుణ మాట్లాడాల్సి ఉందని చెప్పింది. దీంతో ఇద్దరూ ఖమ్మంలో నరసింహస్వామి గుట్ట పైకి వెళ్లారు. అక్కడ కరుణ పాండురంగారావుని నిలదీయగా తాను వివాహం చేసుకున్నది నిజమేనని, తనను మర్చిపోవాలని చెప్పాడు. దీంతో కరుణ కోపంతో తన వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో గొంతు కోసింది. ఒక్కసారిగా జరిగిన పరిణామానికి బిత్తరపోయిన పాండురంగారావు కేకలు వేయటంతో స్థానికులు అతన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కరుణను ఖమ్మం టూ టౌన్ పోలీసులు స్టేషన్‌కు తరలించారు. తనను ప్రేమించి మోసం చేసినందుకే అతడిని చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని... అందుకే ఈ పని చేశానని విలేకరులతో కరుణ తెలిపింది. పాండురంగారావుని వివరణ కోరగా కరుణ, తాను ప్రేమించుకున్నమాట వాస్తవమేనని తల్లిదండ్రుల కోరిక మేరకు తాను మామయ్య కూతురిని వివాహం చేసుకున్నాని తెలిపాడు. అతని పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. కరుణపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నగరంపై నజర్
అటు కలెక్టర్... ఇటు కమిషనర్ తనిఖీలతో హడలెత్తించిన ‘బాస్’లు హైరానా పడ్డ బల్దియూ అధికారులు, సిబ్బంది వరంగల్ అర్బన్ : జిల్లా కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి వాకాటి కరుణ, కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ నగర సమస్యలపై దృష్టి సారించారు. ఇప్పటికే పలుమార్లు పలు ప్రాంతాలను సందర్శిం చారు. తాజాగా మంగళవారం ఉదయం తనిఖీలతో హడలెత్తించారు. కాలనీల్లో పర్యటనలు చేసి బల్దియా అధికారుల గుండెల్లో గుబులు పుట్టించారు. వారు ఎప్పుడు, ఏ కాలనీని సందర్శిస్తారో తెలియక బల్దియా అధికారులు, సిబ్బంది హైరానా పడ్డారు. హన్మకొండలోని పలు ప్రాంతాల్లో కలెక్టర్, కాజీపేటలోని పలు కాలనీల్లో కమిషనర్ ప్రజా క్షేత్రంలో పర్యటించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను సావధానంగా విన్నారు. కొన్ని సమస్యలకు అక్కడికకక్కడే పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. నిధులతో ముడిపడి ఉన్న అభివృద్ధి పనులను దశల వారీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మురికి కూపాలుగా మారిన ఖాళీ స్థలాలు, వీధుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, తాగునీటి పైపులైన్ల లీకేజీలు, అధ్వానంగా తయారైన రహదారులు,డ్రెరుునేజీలు, అక్రమ కట్టడాలు, కబ్జాలు, భవనాల అనుమతులు, ఆస్తి పన్ను మదింపు, మంచినీటి సరఫరా తీరుతెన్నులను వారు పరిశీలించి పలు సూచనలు చేశారు. రోడ్డుపై చెత్త వేస్తే రూ.500 జరిమానా : కలెక్టర్ రహదారులపై చెత్త వేస్తే రూ. 500 జరిమానా వసూలు చేయాలని కలెక్టర్ వాకాటి కరుణ అధికారులను అదేశించారు. రెడ్డికాలనీలోని ఓ రోడ్డు మొత్తం చెత్తాచెదారంతో నిండి ఉండడాన్ని గమనించిన ఆమె.. బల్దియూ సిబ్బందితోపాటు స్థానిక ప్రజల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కనీస జ్ఞానం లేకుండా రోడ్డుపై ఇలా చెత్త పోస్తే ఎలా? అంటూ అక్కడ ఉన్న ప్రజలను పిలిచి మందలించారు. రోడ్డుపై, ఖాళీ స్థలాల్లో చెత్త వేస్తే రూ.500 జరిమానా వసూలు చేయాలని బల్దియా ఎంహెచ్ఓ ధన్‌రాజ్‌ను కలెక్టర్ ఆదేశించారు. అంత ర్గత రహదారి పక్కన ఉన్న చేతి పంపు నీరు కాల్వలోకి వెళ్లకుండా చెత్త పేరుకుపోవడంతో మురుగు నీరంతా రోడ్డుపై పారుతుండడాన్ని పరిశీలించిన కలెక్టర్ వెంటనే శుభ్రపర్చాలని సిబ్బందికి సూచించారు.రాంనగర్ టవర్స్ వెనుక వైపు క్రాంతినగర్ కాలనీ వద్ద నిర్మించిన బాక్స్ డ్రెరుునేజీ ఇరుకుగా ఉండడంతో మురుగునీరు నిలుస్తోందంటూ తమ సమస్యలను స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కాలనీ సొసైటీకి చెందిన స్థలాన్ని ఓ రిటైర్డ్ ఉద్యోగి ఆక్రమించుకోవడంతో బాక్స్ డ్రైయినేజి విస్తరణ జరగడం లేదని వివరించారు. ఈ మేరకు విచారణ జరిపి చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను అదేశించారు. ఖాళీ స్థలాల్లో చెత్త పోయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అక్రమ కట్టడాలను ఉపేక్షించొద్దు : కమిషనర్ విధుల పట్ల అంకిత భావం ఉండాలి. ఏదైనా పని ప్రారంభిస్తే పూర్తయ్యే వరకు పట్టుదలతో ముందుకు సాగాలి. నగర ప్రజల అదరాభిమానాలను పొందాలి.’ అని నగర పాలక సంస్థ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులకు క్లాస్ తీసుకున్నారు. ఉదయం ఆయన ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, ప్రజారోగ్యం, అర్బన్ మలేరియా, పన్నులు తదితర విభాగాల అధికారులు,సిబ్బందితో కలిసి కాజీపేట 36వ డివిజన్లోని ప్రశాంత్ నగర్, చైతన్యపురితోపాటు పలు కాలనీలను కలియతిరిగారు. కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఖాళీ స్థలాల్లో చెత్త చెదారం, రహదారుల్లో చెత్త కుప్పలు, పూడిక తీయని మురికి కాల్వలు, దోమల సమస్యపై ప్రజలు ఫిర్యాదు చేశారు. పరిశీలనల అనంతరం పజారోగ్యం అధికారులు, సిబ్బందిని కమిషనర్ మందలించారు. మారోమారు ప్రజల నుంచి ఫిర్యాదులు రావద్దని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానికంగా ఓ వ్యక్తి రోడ్డును ఆక్రమించుకుని నిర్మాణాలు చేస్తున్నారని కాలనీవాసి ఫిర్యాదు చేయగా... ఈ విషయంపై టౌన్ ప్లానింగ్ అధికారుల వద్ద సమాచారం తెలుసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తే కూల్చివేయాలని ఆదేశించారు. అక్రమ కట్టడాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదన్నారు. కాగా, కాలనీల్లో నెలకొన్న చెత్త ఇతరత్రా సమస్యలకు సంబంధించి కమిషనర్ తన సెల్ ఫోన్లో చిత్రీకరించారు. -
‘కరుణ’ జపం
డీఎండీకే అధినే త విజయకాంత్ ఉన్నట్టుండి మనసు మార్చుకున్నారు. డీఎంకే అధినేత ఎం.కరుణానిధి నామాన్ని జపించేపనిలో పడ్డారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన చిత్ర పటాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. * కరుణానిధి చిత్రపటాల్ని ప్రభుత్వ కార్యాలయల్లో పెట్టాల్సిందే * లేకుంటే ఆందోళనలు తప్పవు : విజయకాంత్ సాక్షి, చెన్నై: డీఎంకేపై విమర్శలు గుప్పించడంలో డీఎండీకే అధినేత విజయకాంత్ ఎప్పుడూ ముందుంటారు. అయితే ఇటీవల కొంత కాలంగా ఆ పార్టీ మీద కన్నా, జయలలిత మీద విమర్శల స్వరం పెంచారు. అలాగే, ఈ సారి ఏకంగా కరుణానిధి జపం అందుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఐదు సార్లు సీఎంగా పనిచేసిన కరుణానిధి మహానాయకుడు అని, ఆయన చిత్ర పటం ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పని సరిగా ఉంచాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేయడం గమనార్హం. కరుణ చిత్ర పటాల్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టాల్సిందే శుక్రవారం డీఎండీకే అధినేత విజయకాంత్ ఓ ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వం తీరును ఎండగట్టారు. సీఎం పన్నీరు సెల్వంను టార్గెట్‌చేసి తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం పన్నీరు సెల్వం, అన్నాడీఎంకే మంత్రులు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. అసెంబ్లీ వేదికగా ప్రజా సీఎం జయలలిత, ప్రజా సీఎం జయలలిత అని జపిస్తూనే, ఆమె మార్గదర్శకంలోనే ప్రభుత్వం నడుస్తోందని స్పష్టం చేయడం విచారకరమన్నారు. జైలు శిక్ష ఎదుర్కొంటున్న జయలలిత ప్రజా సీఎం అయితే, తమరు ఎవరికి సీఎం అని పన్నీరు సెల్వంను ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జయలలిత చిత్ర పటాల్ని ఏర్పాటుచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని అడ్వకేట్ జనరల్ సోమయాజులు మదురై ధర్మాసనంలో స్పష్టంచేసి ఉన్నారని గుర్తుచేశారు. జైలు శిక్ష ఎదుర్కొం టున్న వాళ్ల ఫొటోల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసినప్పుడు ప్రజా సీఎంలుగా ఉన్న కామరాజర్, అన్నా, ఎంజీయార్ చిత్రపటాల్ని తప్పనిసరిగా ప్రభుత్వ కార్యాలయూల్లో ఏర్పాటు చేయూల్సిందేనన్నారు. డీఎంకే అధినేత కరుణానిధి తమిళనాడుకు ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారని, అలాంటి నాయకుడి చిత్ర పటాన్ని సైతం ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఆ విధంగా ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. లేని పక్షంలో ప్రజలతో కలసి పోరాటాలు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
లవ్ Heart
సుందర్, కరుణ నువ్వు-నేను YOU AND I Every woman deserves a man who loves and respects her. And every man deserves a woman who appreciates his efforts. అంటారు. వెల్‌నోన్ ఆర్టిస్ట్‌లు సుక్క కరుణ, సుక్క సుందర్ కూడా అలాంటి జంటే! అతను ఆమెను ఎంత ఇష్టపడతాడో అంతగా గౌరవిస్తాడు. ఆమె.. అతని విజయం కన్నా ప్రయత్నాన్ని విశ్వసిస్తుంది.. ప్రశంసిస్తుంది! ఈ ఇద్దరిదీ ప్రేమ వివాహం! వీళ్ల లవ్.. ఫస్ట్ సైట్లో స్టార్ట్ కాలేదు.. మరెప్పుడు? ఎలా? అసలు మీ కథ చెప్పండి అని అడిగితే.. ఇలా మొదలైంది వాళ్ల సంభాషణ.. ..:: సరస్వతి రమ ‘తెలుగు యూనివర్సిటీలో బీఎఫ్ఏ క్లాస్‌మేట్స్‌మి. మొదటి రెండేళ్లు మా మధ్య ఇంటరాక్షనే లేదు. ఫస్ట్ ఐ యూస్డ్ టు హేట్ హిమ్. చదువు పక్కన పెట్టి సోషల్ యాక్టివిటీస్‌లో బిజీగా ఉండేవాడు. అందుకే నచ్చేది కాదు. అదీగాక నేను చాలా రిజిడ్‌గా ఉండేదాన్ని. దేనికోసం యూనివర్సిటీకి వచ్చామో అది చూసుకొని పోయేదాన్ని’ చెప్పింది కరుణ. ‘ఆమెకు క్వయిట్ అపోజిట్ నేను. అందరితో కలివిడిగా ఉండేవాడిని. మా క్లాస్‌లో అమ్మాయిలు ఉన్నదే ఏడుగురు. కరుణ తప్ప ఆరుగురూ నాతో క్లోజ్‌గా మాట్లాడేవారు. తను ఎక్కువగా మాట్లాడేది కాదు కాబట్టి నేనూ దూరంగానే ఉండేవాడిని. కాకపోతే గమనించే వాన్ని’ తన వెర్షన్ చెప్పాడు సుందర్. ఎన్నో సైట్‌కి లవ్ ఏర్పడింది మరి? ‘థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు భోపాల్‌లో ప్రింట్ బైనాలే ఎగ్జిబిషన్‌కి వెళ్లాం అందరం. అక్కడ మిగిలిన వాళ్లంతా అసలు ఎగ్జిబిషన్ వదిలిపెట్టి మిగిలిన ప్లేసెస్‌కి వెళ్లేవాళ్లు. నేను, సుందర్ ఇద్దరమే చాలా సీరియస్‌గా ఎగ్జిబిషన్ అంతా తిరిగాం. ఆ టైమ్‌లో ఫ్రెండ్స్ అయ్యాం. అప్పుడే సుందర్‌ను దగ్గరగా గమనించే, అర్థం చేసుకునే అవకాశం దొరికింది. అప్పుడే అతని లీడర్షిప్ క్వాలిటీస్‌పై రెస్పెక్ట్ పెరిగింది. తెలుగు యూనివర్సిటీ ఓ ఫ్యాకల్టీని కూడా అపాయింట్ చేసుకునే స్థితిలో లేనప్పుడు ఈయన ఇనీషియేషన్ తీసుకున్న తీరు, సమస్యను సాల్వ్ చేసిన వైనమూ గుర్తొచ్చింది. అప్పటి నుంచి సుందర్‌ను చూసే నా దృష్టి మారింది. అలా స్లో అండ్ స్టడీగా సాగిన మా ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగే కాదు ఎవర్ చార్మ్ కూడా’ అంటూ గతాన్ని గుర్తుచేసుకుంది కరుణ. ‘బీఎఫ్ఏ తర్వాత ఎమ్ఎఫ్ఏ కూడా కలిసి చదివాం. ఎమ్ఎఫ్ఏ తర్వాత తను బరోడా వెళ్లింది. నేను ఇక్కడే చిత్రమయి ఆర్ట్ గ్యాలరీలో జాయిన్ అయ్యాను’ సుందర్ అంటుంటే ‘నేను బరోడా వెళ్లడం వల్లే సుందర్‌ను మ్యారేజ్ చేసుకోగలిగాను. అంతకంటే ముందు సుందర్ వాళ్లన్నయ్య పెళ్లికని వాళ్లూరు వెళ్లాను. అక్కడ సుందర్ వాళ్ల ఫ్యామిలీ, సిట్యుయేషన్ చూసినప్పుడు అనిపించింది.. సుందర్‌కి నా తోడు తప్పకుండా కావాలని. బహుశా అప్పుడే అతని మీద ప్రేమ మొదలై ఉండాలి. బరోడా వెళ్లాక అక్కడి ఆర్టిస్టులు తోటి ఆర్టిస్టులను పెళ్లి చేసుకోవడం, వాళ్ల కంపానియన్‌షిప్ చూశాక నేనూ ఆర్టిస్ట్‌నే పెళ్లిచేసుకుంటే కెరీర్, ఫ్యామిలీ లైఫ్ రెండూ డిస్టర్బ్ కాకుండా ఉంటాయనిపించింది. ఆ నిర్ణయానికి రాగానే సుందరే గుర్తొచ్చాడు. వెంటనే ఫోన్ చేసి చెప్పేశాను ప్రేమ విషయాన్ని, పెళ్లి ప్రపోజల్‌ని కూడా’ కరుణ. ‘కానీ నేనిప్పటివరకు ఐ లవ్ యూ చెప్పలేదు తనకు’ పక్కనుంచి సుందర్. ‘అదే నా కంప్లయింట్’ చిరుకోపంతో కరుణ. ‘నిజానికి నేనే ముందు ప్రేమలో పడ్డాను తనతో. చెప్పడానికి నేను భయపడ్డాను. తను చెప్పి బయటపడింది. అలా 2009లో మా ప్రేమకు పెళ్లి రూపమిచ్చింది’ అన్నాడు కరుణ వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ! కెరీర్లో సహకారం.. కుటుంబంలో సగం బాధ్యత ‘కరుణది థియరిటికల్ నాలెడ్జ్. నాది ప్రాక్టికల్ నాలెడ్జ్. ఈ రెండిటినీ కలిపి కలిసి పనిచేస్తాం’ అని సుందర్ అంటుంటే ‘సుందర్‌కి కలర్ కాంబినేషన్ బాగా తెలుసు. నా ఐడియాను తనతో షేర్ చేస్తే తను దానికి కలర్ కాంబినేషన్ చెప్తాడు’ భర్తకి కరుణ కితాబు. ‘తను హైదరాబాదీ. పెద్ద ఆర్టిస్ట్ (శ్రీహరి భోలేకర్) కూతురు. ఇంగ్లిష్‌లో దడదడలాడిస్తుంది. ఆమెకున్న ఈ ప్లస్లన్నీ నాలో మైనస్‌లు. పల్లెటూరి నేపథ్యం. వానాకాలం చదువు. ఇంగ్లిష్‌కి దూరం. ఇంగ్లిష్‌లో ఉన్న ఆర్ట్ బుక్స్ బాగా చదువుతుంది. అవన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంగ్లిష్ మీద నేను పట్టు సాధించేందుకు హెల్ప్ చేస్తుంది’అంటూ భార్య సహచర్యం తన మైనస్‌లు ప్లస్ అయిన తీరును వివరించాడు సుందర్. ‘నేను ఇంటి పనుల్లో పూర్. మాకు రెండున్నరేళ్ల కూతురుంది. నా పీహెచ్డీ, ఆర్ట్ వర్క్ ఇవన్నిటితో పాపను చూసుకోవడం కుదరదు. ఆ విషయంలో తను చాలా హెల్ప్ చేస్తాడు. ఇన్ఫాక్ట్ సుందర్ బలవంతం వల్లే పీహెచ్డీ చేస్తున్నాను’అంటూ కుటుంబ నిర్వహణలో భర్త మోస్తున్న సగం బాధ్యతను చెప్పింది కరుణ. ‘చాలామంది ‘నువ్వూ పీహెచ్డీ చేయొచ్చుకదా..’ అని సలహాలిచ్చారు. ఎవరు ఎందులో పర్ఫెక్టో వాళ్లు ఆ పనిచేస్తే బాగుంటుంది. తనకు పీహెచ్డీ అంటే ఇంట్రెస్ట్ అందుకే ప్రోత్సహించాను. ఆమె అందులో బిజీ కాబట్టి ఇల్లు, పాప బాధ్యతను తీసుకోవడం నాకు చాలా హ్యాపీ. నేను హౌజ్ హజ్బెండ్‌నని గర్వంగా చెప్తాను’ అన్నాడు సహచరుడు అన్న పదానికి అసలైన నిర్వచనంలా! పెళ్లాయ్యాక ఒకరికోసం ఒకరు మార్చుకున్న పద్ధతులు? ‘ఆయన సోషల్ యాక్టివిటీని కొంచెం తగ్గించుకున్నాడు. నా పట్ల హెల్పింగ్ నేచర్ పెరిగింది. నాకేం ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసేదాకా నిద్రపోడు. నాకేమాత్రం ఇన్‌కన్వీనియెంట్ లేకుండా చూసుకుంటాడు’ మురిపెంగా కరుణ. ‘పెళ్లికి ముందు రిజిడ్‌గా, సెల్ఫిష్‌గా ఉండేదా.. ఇప్పుడు చాలా కలివిడిగా... లిబరల్గా మారింది. తనలో ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు. ఇప్పుడు తన ఫెలోషిప్ డబ్బులే మాకు ఆధారం. ఇంత కో ఆపరేట్ చేస్తుందని అనుకోలేదు’ సంబంరంగా చెప్పాడు సుందర్. ‘క్రెడిట్ అంతా తనదే’ కరుణ. ‘వర్క్ విషయంలో నా బెస్ట్ క్రిటిక్ తనే. నేను, నువ్వు అనే భావన ఉండదు మనమనే ఫీలే. అందుకే ఎవరికి బయటి నుంచి అప్రిసియేషన్స్ వచ్చినా ఇద్దరం హ్యాపీగా ఫీలవుతాం. నో జెలసీ’ సుందర్. ‘తను ప్రతి చిన్న విషయాన్ని సెలబ్రేట్ చేస్తాడు. ఇండివిడ్యువల్ సక్సెస్కన్నా మా ఇద్దరి సక్సెస్‌కే ఇంపార్టెన్స్ ఇస్తాడు’ కరుణ. ‘అన్ని విషయాల్లో ఇద్దరూ సమానమైన ప్రతిభ చూపలేరు. ఒకరు విజయం కోసం పోరాడుతున్నప్పుడు ఇంకొకరు అండగా నిలబడాలి’ అని సుందర్ అంటుంటే ‘మేం అదే ఫాలో అవుతున్నాం. ఒకరి ఎబిలిటీని ఇంకొకరం నిజాయితీ ఒప్పుకుంటాం. గౌరవిస్తాం. నమ్ముతాం’ అంటూ చెప్పింది కరుణ. ప్రేమలో పడడం కాదు.. దాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం అంటారు. అలా తమ ప్రేమను నిలబెట్టుకుందీ జంట! -
శ్రీ నిలయం మూవీ పోస్టర్స్, వర్కింగ్ స్టిల్స్
-
కిరాతకుడు
కన్నతండ్రి ఘాతుకం పిల్లలను చంపి.. ఆత్మహత్యాయత్నం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఘటన హత్యకు గల కారణాలపై పోలీసుల దర్యాప్తు దుండిగల్, న్యూస్‌లైన్: మానవత్వం మంటగలిసింది.. సభ్యసమాజం తల దించుకుంది.. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడయ్యాడు.. ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేసి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కలకలం సృష్టించిన ఈ సంఘటన మంగళవారం దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా నర్మేట మండలం గండిరామరం గ్రామానికి చెందిన కొండేటి సంపత్‌కుమార్ (40)కు అదే జిల్లా మద్దూర్ మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన గాజుల మురహరి, అండాలు కుమార్తె కరుణ (లక్ష్మి)తో పదకొండేళ్ల క్రితం వివాహం జరిగింది. పదేళ్ల క్రితం కుటుంబంతో కలిసి నగరానికి వలస వచ్చిన సంపత్.. సూరారం కాలనీ డివిజన్ సాయిబాబా నగర్ పాండు బస్తీలో నివసిస్తున్నాడు. వీరికి రాకేష్(10), రాజశ్రీ (09) అనే ఇద్దరు పిల్లలున్నారు. డీసీఎం డ్రైవర్‌గా పనిచేసే సంపత్ భార్య కరుణ గత సంవత్సరం ఫిబ్రవరి 15న అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో అప్పటి నుంచి పిల్లలిద్దరూ బోరబండలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. స్థానికంగా ఉన్న భార్గవి విద్యానికేతన్ స్కూల్లో రాకేశ్ 5వ తరగతి, రాజశ్రీ 4వ తరగతి చదువుతున్నారు. కాగా పది రోజుల క్రితం బోరబండలోని అత్తగారి ఇంటికి వెళ్లిన సంపత్.. వేసవి సెలవులకు పిల్లలను తీసుకెళ్తానని చెప్పి తన ఇంటికి తీసుకు వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి రాకేశ్, రాజశ్రీలకు మొదట విషం ఇచ్చి ఆ తరువాత ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. ఆనక మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో సంపత్ పురుగుల మందు (ఎండ్రిన్) తాగాడు. వెంటనే బయటకు వచ్చి తనంతట తానే కొట్టుకుంటుండగా.. స్థాని కులు గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా.. ఇద్దరు చిన్నారులు మంచంపై విగత జీవులుగా పడి ఉన్నారు. వారు అందించిన సమాచారం మేరకు దుండిగల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సంపత్‌ను చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చిన్నారుల మృతదేహాలకు శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి పంపారు. కాగా సంపత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చిన్నారులను ఎందుకు హత్య చేసినట్టు? గత సంవత్సరమే సంపత్ భార్య చనిపోయింది. ఈ క్రమంలో ఇద్దరు పిల్లల ఆలనాపాలన వారి అమ్మమ్మ వాళ్లే చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సంపత్ ఒక్కడే ఉంటున్నాడు. అయితే చిన్నారులను అతి దారుణంగా హత్య చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కాగా సంపత్ ఇతర స్త్రీలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని.. గతంలో తన అక్క కరుణను, ఇప్పుడు ఈ పిల్లల్ని హత్య చేశాడని అతని బావమరిది రాంప్రసాద్ ఆరోపిస్తున్నారు. ఎలా హత్య చేశాడు? పిల్లలిద్దరికీ విషం ఇచ్చి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. అయితే గొంతు నులి మి హత్య చేశాడా.. లేక దిండు మొఖానికి అడ్డు పెట్టి చంపాడా.. లేదా పురుగుల మందు తాగించి హత్య చేశాడా అన్న వివరాలు పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలనున్నాయి. ఫ్యాన్‌కు మాత్రం టవల్‌తో ఉరి వేసి ఉంది. చిన్నారులను రాత్రి 11 నుంచి 12 గంటల మధ్య సమయంలో హత్య చేసి ఉండవచ్చని పోలీసు లు భావిస్తున్నారు. కాగా సంపత్ మాత్రం రాత్రంతా ఇంట్లోనే గడిపి ఉదయం 6 గంటల సమయంలో ఇంట్లో ఉన్న ఎండ్రిన్ తాగినట్లు తెలుస్తోంది. ఇంట్లో గోడలపై రాతలు.. ఇంట్లోని గోడలపై బొగ్గుతో సంపత్ పలు రాతలు రాశాడు. వారి పిల్లలు రాసినట్లుగా ‘మా అమ్మ కరుణ’ అంటూ ఇంట్లోని అన్ని గోడలపై రాశాడు. పిల్లలే రాసినట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. అదేవిధంగా స్థానికంగా ఉండే ఓ మహిళ పేరును ప్రస్తావిస్తూ ‘ఐ లవ్ యూ.. నిన్ను నేను మరవను.. నీ గురించే నా మరణం’ అంటూ గోడపై రాశాడు. బాత్రూం గోడపై మాత్రం ‘ప్లీజ్ కరుణ నన్ను మన్నించు’ అని రాశాడు. వివాహేతర సంబంధాల కారణంగానే సంపత్ చిన్నారులను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా చిన్నారులను దారుణంగా హత్య చేసిన సంపత్‌ను నడిరోడ్డుపై ఉరి తీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.